హోమ్ /వార్తలు /బిజినెస్ /

Paytm: పేటీఎంలో బస్సు టికెట్లు బుక్ చేస్తే ఫ్రీ క్యాన్సలేషన్

Paytm: పేటీఎంలో బస్సు టికెట్లు బుక్ చేస్తే ఫ్రీ క్యాన్సలేషన్

Paytm Gold: అక్షయ తృతీయ ఆఫర్... పేటీఎంలో బంగారం కొంటే క్యాష్‌బ్యాక్
(ప్రతీకాత్మక చిత్రం)

Paytm Gold: అక్షయ తృతీయ ఆఫర్... పేటీఎంలో బంగారం కొంటే క్యాష్‌బ్యాక్ (ప్రతీకాత్మక చిత్రం)

Paytm Travel | పేటీఎం ట్రావెల్‌లో ఎవరైనా బస్సు టికెట్లు బుక్ చేసుకోవచ్చు. ఒకవేళ ప్రయాణాల్లో ఏవైనా మార్పులు ఉంటే టికెట్లు క్యాన్సిల్ చేయొచ్చు. వారికి పూర్తి రీఫండ్ వస్తుంది.

  బస్సు టికెట్లు బుక్ చేసేవారికి పేటీఎం ఓ ఆఫర్ ఇస్తోంది. తెలంగాణ ఆర్‌టీసీ, ఏపీఎస్ఆర్‌సీటీసీతో పాటు ఇతర రాష్ట్రాల ప్రభుత్వ బస్సులు, ప్రైవేట్ బస్సుల్లో టికెట్లు బుక్ చేస్తే వారికి ఫ్రీ క్యాన్సలేషన్ సదుపాయం కల్పిస్తోంది. లాక్‌డౌన్ తర్వాత ఎక్కడికైనా ప్రయాణించాలనుకునేవారు బస్సు టికెట్లు బుక్ చేసుకునేలా పేటీఎం ఈ ప్రకటన చేసింది. సాధారణంగా బస్సు టికెట్లు బుక్ చేసిన తర్వాత క్యాన్సిల్ చేస్తే క్యాన్సలేషన్ ఛార్జీలు ఉంటాయి. భారతదేశంలో మే 3 వరకు లాక్‌డౌన్ ఉన్న సంగతి తెలిసిందే. లాక్‌డౌన్ తర్వాత పరిస్థితి ఎలా ఉంటుందో తెలియదు కాబట్టి ఇప్పుడు ఎవరూ బుకింగ్స్ చేయట్లేదు. వారి కోసం పేటీఎం ఆన్‌లైన్ ట్రావెల్ బుకింగ్ ప్లాట్‌ఫామ్ పేటీఎం ట్రావెల్ ఫ్రీ క్యాన్సలేషన్ ఫీచర్ ప్రకటించింది.

  పేటీఎం ట్రావెల్‌లో ఎవరైనా బస్సు టికెట్లు బుక్ చేసుకోవచ్చు. ఒకవేళ ప్రయాణాల్లో ఏవైనా మార్పులు ఉంటే టికెట్లు క్యాన్సిల్ చేయొచ్చు. వారికి పూర్తి రీఫండ్ వస్తుంది. క్యాన్సలేషన్ ఛార్జీలు వర్తించవు. ఫ్రీ క్యాన్సలేషన్ నియమనిబంధనలు పేటీఎం యాప్‌లో చూడొచ్చు. ఫ్రీ క్యాన్సలేషన్ కోసం 200 బస్ ఆపరేటర్స్‌తో ఒప్పందం కుదుర్చుకున్నట్టు కంపెనీ చెబుతోంది. పేటీఎం ట్రావెల్‌లో 62000 పైగా రూట్లలో బస్సు టికెట్లు బుక్ చేసుకోవచ్చు. టీఎస్‌ఆర్‌టీసీ, ఏపీఎస్‌ఆర్‌టీసీ, జీఎస్ఆర్‌టీసీ, యూపీఎస్ఆర్‌టీసీ, ఎంఎస్ఆర్‌టీసీ, టీఎన్ఎస్‌టీసీ, యూపీఎస్ఆర్‌టీసీ లాంటి ప్రభుత్వ రవాణా కార్పొరేషన్ల టికెట్లు పేటీఎం ట్రావెల్‌లో బుక్ చేయొచ్చు. 2000 పైగా ప్రైవేట్ ఆపరేటర్లతో కూడా పేటీఎం ఒప్పందం కుదుర్చుకుంది.

  ఇవి కూడా చదవండి:

  PF Balance: పీఎఫ్ డబ్బులు విత్‌డ్రా చేస్తున్నారా? ఎంత నష్టమంటే

  Jan Dhan Yojana: జన్ ధన్ అకౌంట్‌లోకి డబ్బులు పంపిన కేంద్రం... బ్యాలెన్స్ చెక్ చేయండిలా

  Lockdown Guidelines: బ్యాంకులు ఎప్పటివరకు తెరిచి ఉంటాయంటే...

  Published by:Santhosh Kumar S
  First published:

  Tags: Apsrtc, Business, BUSINESS NEWS, Corona, Corona virus, Coronavirus, Covid-19, Lockdown, Paytm, Rtc, Tsrtc

  ఉత్తమ కథలు