Paytm: పేటీఎం నుంచి కొత్త ఫీచర్... ఇక పేమెంట్స్ చాలా ఈజీ

Paytm All in one QR | పేటీఎం ఆల్- ఇన్-వన్ క్యూఆర్ కోడ్‌ స్టిక్కర్లను కాలిక్యులేటర్, పవర్ బ్యాంక్, క్లాక్, పెన్ స్టాండ్స్, రేడియో లాంటివాటిపై అందిస్తోంది కంపెనీ. వ్యాపారి పేర్లు, లోగోలు, ఫోటోలతో కూడా క్యూఆర్ కోడ్ ఆర్డర్ చేయొచ్చు.

news18-telugu
Updated: January 20, 2020, 5:22 PM IST
Paytm: పేటీఎం నుంచి కొత్త ఫీచర్... ఇక పేమెంట్స్ చాలా ఈజీ
Paytm: పేటీఎం నుంచి కొత్త ఫీచర్... ఇక పేమెంట్స్ చాలా ఈజీ (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:

ఇటీవల దేశవ్యాప్తంగా ఆల్- ఇన్-వన్ క్యూఆర్ కోడ్‌ను పేటీఎం ఆవిష్కరించిన సంగతి తెలిసిందే. రాబోయే 6 నెలల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో 15 లక్షల మంది వ్యాపారులకు ఈ ఆల్- ఇన్-వన్ క్యూఆర్ కోడ్స్ అందించనుంది పేటీఎం. పేటీఎం వ్యాలెట్, రూపే కార్డ్, అన్ని యూపీఐ ఆధారిత పేమెంట్స్ యాప్ ద్వారా 0% ఫీజుతో నేరుగా తమ బ్యాంకు ఖాతాల్లోకి అపరిమిత చెల్లింపులను ఆమోదించేందుకు వ్యాపారులకు వీలు కల్పిస్తుంది. కేవలం చెల్లింపులు మాత్రమే కాకుండా వ్యాపారులతో మరింత అనుబంధం కోసం మర్చంట్ సొల్యూషన్స్‌లో పెట్టుబడి పెట్టే ఆలోచనలో కూడా కంపెనీ ఉంది. పేటీఎం ఆల్- ఇన్-వన్ క్యూఆర్ కోడ్‌ స్టిక్కర్లను కాలిక్యులేటర్, పవర్ బ్యాంక్, క్లాక్, పెన్ స్టాండ్స్, రేడియో లాంటివాటిపై అందిస్తోంది కంపెనీ. వ్యాపారి పేర్లు, లోగోలు, ఫోటోలతో కూడా క్యూఆర్ కోడ్ ఆర్డర్ చేయొచ్చు.


Paytm All in one QR, Paytm All in one QR benefits, Paytm services, Paytm QR Codes, Andhra Pradesh news, Telangana News, పేటీఎం ఆల్ ఇన్ వన్ క్యూఆర్, పేటీఎం ఆల్ ఇన్ వన్ క్యూఆర్ లాభాలు, పేటీఎం సేవలు, పేటీఎం క్యూఆర్ కోడ్స్, ఆంధ్రప్రదేశ్ వార్తలు, తెలంగాణ వార్తలు

'పేటీఎం ఫర్ బిజినెస్' మర్చంట్ యాప్‌ను సుమారు కోటి మంది పేటీఎం పార్ట్‌నర్స్ ఉపయోగిస్తున్నారు. ఈ యాప్‌లో ట్రాన్సాక్షన్స్ అన్నీ చూసుకోవచ్చు. బిజినెస్ లోన్స్, ఇన్స్యూరెన్స్ లాంటి సేవలు కూడా పొందొచ్చు. వ్యాలెట్ నుంచి అకౌంట్‌కు డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేయొచ్చు. 'పేటీఎం ఫర్ బిజినెస్' యాప్ లోనే పేటీఎం క్యూఆర్ మర్కండైజ్ ఆర్డర్ చేయొచ్చు. వాటిని డోర్ డెలివరీ ద్వారా పొందొచ్చు. వీటిలో సౌండ్ బాక్స్ సరికొత్తగా ఉంటుంది. ఎవరైనా పేమెంట్ చేస్తే సౌండ్ బాక్స్‌లో పేమెంట్ కన్ఫర్మేషన్ ఆడియో రూపంలో వస్తుంది. సౌండ్ బాక్స్ అన్ని భాషల్ని సపోర్ట్ చేస్తుంది. 'పేటీఎం బిజినెస్ ఖాతా' పేరుతో మరో కొత్త సర్వీస్ కూడా ప్రారంభమైంది. క్యాష్, క్రెడిట్‌తో పాటు కస్టమర్ల లావాదేవీలతో డిజిటల్ లెడ్జర్స్ మెయింటైన్ చేయొచ్చు.



ఇవి కూడా చదవండి:

Amazon Great Indian Sale: అమెజాన్‍లో ఈ 12 స్మార్ట్‌ఫోన్లపై డిస్కౌంట్ ఆఫర్స్



Aadhaar Services: ఈ ఒక్క యాప్ ఉంటే... 35 ఆధార్ సేవలు పొందొచ్చు

SBI offers: అమెజాన్ సేల్‌లో ఎస్‌బీఐ కార్డుపై అదిరిపోయే ఆఫర్స్
First published: January 20, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు