Home /News /business /

PAYTM SERVICES DOWN USERS COMPLAINTS ABOUT PAYMENT ISSUES NS

Paytm Down: పేటీఎం వినియోగదారులకు అలర్ట్.. సేవల్లో అంతరాయం.. అసలేమైందంటే?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఆన్లైన్ చెల్లింపు సేవలను అందించే పేటీఎం యాప్ యొక్క  సేవలు అనేక మంది వినియోగదారులకు నిలిచిపోయాయి. దీంతో వారంతో తీవ్ర ఇబ్బంది పడుతున్నారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Bangalore | Hyderabad | Visakhapatnam
    ఆన్లైన్ చెల్లింపు సేవలను అందించే పేటీఎం యాప్ (Paytm) యొక్క  సేవలు అనేక మంది వినియోగదారులకు నిలిచిపోయాయి. దీంతో వారంతో తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. పేటీఎం యాప్ లోకి (Paytm App Login) తాము లాగిన్ కాలేక పోతున్నామని చాలా మంది వినియోగదారులు సోషల్ మీడియా  ద్వారా వెల్లడిస్తున్నారు. పేటీఎం ద్వారా చెల్లింపులు చేస్తున్న సమయంలో అటోమెటిగ్ గా లాగ్ అవుట్ (Paytm App Logout) అవుతున్నామని చాలా మంది వినియోగదారులు చెబుతున్నారు. తిరిగి లాగిన్ చేయడానికి ప్రయత్నిస్తే అవ్వడం లేదని వారు చెబుతున్నారు. సేవల అంతరాయాల్ని గురించి తెలిపే డౌన్‌ డిక్టేటర్‌ సైతం దేశ వ్యాప్తంగా వినియోగదారులు పేటీఎం యాప్‌ నుంచి సమస్యను ఎదుర్కొంటున్నట్లు వెల్లడించింది. దేశంలో ముఖ్యంగా ముంబై, ఢిల్లీ, బెంగళూరు తదితర నగరాలలో పేటీఎం యాప్‌ డౌన్ అవుతున్నట్లు తెలిపింది. ఈ అంశంపై పేటీఎం సంస్థ సైతం స్పందించింది. యూజర్ల అంతరాయానికి చింతిస్తున్నామని సంస్థ తెలిపింది.





    తమ యాప్‌, వెబ్‌ సైట్‌లలో తలెత్తిన సాంకేతిక సమస్యను పరిష్కరించే పనిలో ఉన్నమని వెల్లడించింది సంస్థ. యాప్‌ నుంచి డబ్బులు ట్రాన్స్‌ఫర్‌ చేసే సమయంలో నెట్‌ వర్క్‌ సమస్య, మనీ స్ట్రక్‌ అవ్వడంతో పాటు ఇతర ఇబ్బందులు ఎదురవుతున్నాయని వినియోగదారులు ట్వీట్లు చేస్తున్నారని సంస్థ తెలిపింది. ఇలాంటి క్లిష్ట సమయంలో ఆ ట్వీట్‌లను పరిగణలోకి తీసుకోలేమని సంస్థ స్పష్టం చేసింది. తమకు ఫిర్యాదు చేయాలనుకుంటున్న కస్టమర్లు 'సపోర్ట్‌@పేటీఎంమనీ.కాం.'ను మెయిల్ ద్వారా సంప్రదించాలని సూచించింది సంస్థ.
    Published by:Nikhil Kumar S
    First published:

    Tags: Online payments, Paytm

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు