news18
Updated: November 26, 2020, 6:09 PM IST
ప్రతీకాత్మక చిత్రం
- News18
- Last Updated:
November 26, 2020, 6:09 PM IST
ప్రముఖ డిజిటల్ చెల్లింపుల ప్లాట్‌ఫామ్ పేటీఎం, Contactless Credit Cards ను రూపొందించడానికి ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ)తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. దీనిలో భాగంగా Paytm SBI కార్డ్ సెలెక్ట్, Paytm SBI కార్డ్ అనే రెండు మోడళ్లలో క్రెడిట్ కార్డులను అందుబాటులోకి తెచ్చింది. వీటిని ప్రధానంగా ఆన్లైన్లో షాపింగ్ చేసే టైర్ -2, టైర్ -3 నగరాల్లో నివసించే వినియోగదారులను ఉద్దేశించి రూపొందించింది. Paytm యాప్ ద్వారా సులభంగా ఈ క్రెడిట్ కార్డులను దరఖాస్తు చేసుకోవచ్చు.
అయితే, పేటీఎం ఎస్బీఐసెలెక్ట్ కార్డు కోసం వార్షిక రుసుము కింద రూ .1499, పేటీఎం ఎస్బీఐ కార్డు కోసం వార్షిక రుసుము కింద రూ .499 చెల్లించాల్సి ఉంటుంది. కాగా, Paytm SBI సెలెక్ట్ కార్డుపై 2 లక్షల వరకు ఖర్చు చేస్తే వార్షిక రుసుము మాఫీ అవుతుంది. Paytm SBI కార్డ్ హోల్డర్లకు వార్షిక రుసుము మినహాయింపు ఉండదు.
ఈ కార్డులతో వచ్చే ప్రయోజనాలివే..
కొత్తగా ప్రారంభించిన పేటీఎం ఎస్బీఐ కార్డు, పేటీఎం ఎస్బీఐ సెలెక్ట్ కార్డును ఉపయోగించి వినియోగదారులు పేటీఎం యాప్‌లో ప్రయాణ టిక్కెట్లను, పేటీఎం మాల్ యాప్ ద్వారా చేసే ఆన్లైన్ షాపింగ్ పై క్యాష్‌బ్యాక్‌లు లభిస్తాయి. అంతేకాక, ఈ రెండు కార్డులను ఉపయోగించి వినియోగదారులు మూవీ టికెట్లను కూడా బుక్ చేసుకోవచ్చు. ఇందుకు గాను వారికి 5 శాతం క్యాష్ బ్యాక్ లభిస్తుంది. అదేవిధంగా పేటీఎం మాల్ ద్వారా ఏవైనా వస్తులను కొనుగోలు చేస్తే 2 శాతం క్యాష్ బ్యాక్ పొందవచ్చు. ఈ రెండు కార్డులు Safty features తో అందుబాటులో ఉంటాయి. సైబర్ ఫ్రాడ్ ఇన్సూరెన్స్ కవరేజీని దీనిలో అందిస్తారు. దీనికి ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.
మెంబర్షిప్ ఉచితమే...
కాగా, వినియోగదారులు పేటీఎం ఎస్బీఐ కార్డ్ సెలెక్ట్‌పై రూ .2 లక్షలు, పేటీఎం ఎస్బీఐ కార్డుపై రూ .1 లక్ష వరకు కవరేజీ పొందవచ్చు. అంతేకాక, ఈ రెండు క్రెడిట్ కార్డులను తీసుకున్న వారికి రూ.750 విలువ గల పేటీఎం ఫస్ట్ మెంబర్షిప్ ఉచితంగా లభిస్తుంది. మరో రూ.750 క్యాష్ బ్యాక్ రూపంలో లభిస్తుంది. పేటీఎం యాప్ లో చేసే ఇతర ఖర్చులపై 2 శాతం క్యాష్ బ్యాక్ 1 శాతం వరకు ఫ్యూయల్ సర్ చార్జి డిస్కౌంట్, ఎయిర్ ట్రావెల్ బెనిఫిట్స్ లభిస్తాయి. రూ.4 లక్షల ఖర్చుపై రూ.2 వేల గిఫ్ట్ వోచర్, రూ.6 లక్షల ఖర్చుపై రూ.4 వేల గిఫ్ట్ వోచర్ లభిస్తుంది.
అయితే, Paytm SBI కార్డులు ఇస్తున్న క్యాష్‌బ్యాక్‌లు ఇతర క్రెడిట్ కార్డులక భిన్నంగా ఉన్నాయి. సాధారణంగా, వివిధ ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులకు చెందిన క్రెడిట్ కార్డులతో చేసే చెల్లింపులపై క్యాష్ బ్యాక్స్ లభిస్తాయి. అయితే, ఆ క్యాష్ బ్యాక్ లు తదుపరి బిల్లింగ్ స్టేట్మెంట్లో సర్దుబాటు అవుతాయి. కాగా, Paytm SBI కార్డ్ విషయంలో మాత్రం ఆయా బ్రాండ్ల నుండి గిఫ్ట్ వోచర్ల రూపంలో క్యాష్ బ్యాక్స్ లభిస్తాయి. కాబట్టి, మీరు క్యాష్‌బ్యాక్ వోచర్‌ను రీడీమ్ చేయడానికి అదనపు షాపింగ్ చేయాల్సి ఉంటుంది. ఇది Paytm SBI కార్డ్ వినియోగదారులకు ప్రతికూల అంశంగా చెప్పవచ్చు.
Published by:
Srinivas Munigala
First published:
November 26, 2020, 6:06 PM IST