Paytm Postpaid యూజర్లకు శుభవార్త...బిల్లుల చెల్లింపుపై బంపర్ ఆఫర్...

ఇకపై యూజర్లు బడ్జెట్ గురించి చింతించకుండా ఏ వస్తువునైనా ఈక్వేటెడ్ మంత్లీ ఇన్‌స్టాల్‌మెంట్స్‌(ఈఎంఐ) ఆప్షన్ల ద్వారా కొనుగోలు చేయవచ్చు. ఈ ఆప్షన్తో మీరు కొన్న వస్తువుకు అయిన ఖర్చును సులభమైన వాయిదా పద్ధతిలో తిరిగి చెల్లించవచ్చు.

news18-telugu
Updated: November 25, 2020, 1:31 PM IST
Paytm Postpaid యూజర్లకు శుభవార్త...బిల్లుల చెల్లింపుపై బంపర్ ఆఫర్...
ప్రతీకాత్మకచిత్రం
  • Share this:
భారత్ లోని లీడింగ్ పేమెంట్ సర్వీస్ ప్రొవైడర్ గా రాణిస్తున్న పేటీఎం సంస్థ తన పోస్ట్‌పెయిడ్ వినియోగదారులకు శుభవార్త చెప్పింది. పోస్ట్పెయిడ్ కస్టమర్ల కోసం సరికొత్త సర్వీసులను అందుబాటులోకి తెచ్చింది. ఇకపై యూజర్లు బడ్జెట్ గురించి చింతించకుండా ఏ వస్తువునైనా ఈక్వేటెడ్ మంత్లీ ఇన్‌స్టాల్‌మెంట్స్‌(ఈఎంఐ) ఆప్షన్ల ద్వారా కొనుగోలు చేయవచ్చు. ఈ ఆప్షన్తో మీరు కొన్న వస్తువుకు అయిన ఖర్చును సులభమైన వాయిదా పద్ధతిలో తిరిగి చెల్లించవచ్చు. దీనికి పేటీఎం మీ నుండి నామమాత్రపు వడ్డీని మాత్రమే వసూలు చేస్తుంది. బిల్లు ఉత్పత్తి చేసిన మొదటి ఏడు రోజుల్లో వినియోగదారులు పోస్ట్‌పెయిడ్ బిల్లును సౌకర్యవంతమైన ఈఎంఐలుగా మార్చుకోవచ్చని డిజిటల్ చెల్లింపు సంస్థ పేటీఎం తెలిపింది.

దీంతో పేటీఎం మాల్, ఉబెర్, మైంట్రా, లెన్స్ కార్ట్, గానా, పెప్పర్ ఫ్రై, హంగర్ బాక్స్, పతంజలి వంటి వాటికి సంబంధించిన వస్తువులు, సేవలకు పొందడానికి సులభమైన ఈఎంఐ ఆప్షన్లను ఎంచుకోవచ్చు. అదనంగా, పేటీఎం పోస్ట్‌పెయిడ్ వినియోగదారులు కిరాణా దుకాణాల నుండి, రిలయన్స్ ఫ్రెష్, హల్దిరామ్, అపోలో ఫార్మసీ, క్రోమా, షాపర్స్ స్టాప్ వంటి ఇతర రిటైలర్ల నుండి కూడా మీ గృహ అవసరాలకు సులభమైన ఈఎంఐ ఎంపికలతో వస్తువులను కొనుగోలు చేయవచ్చు.

బిల్లును మొదటి 7 రోజుల్లో ఈఎంఐకి మార్చుకోవచ్చు..
కోవిడ్–19 మహమ్మారితో వినియోగదారుల ఆర్థిక లోటు పెరగడంతో ఈ సౌకర్యవంతమైన EMI చెల్లింపు విధానం వినియోగదారులకు ఉపశమనం కలిగిస్తుందని పేటీఎం పేర్కొంది. కాగా, పేటీఎం ప్రస్తుతం రూ .1 లక్ష వరకు క్రెడిట్ పరిమితిని అందిస్తుంది. తీసుకున్న మొత్తాన్ని ఈఎంఐ రూపంలో సకాలంలో తిరిగి చెల్లిస్తే ఈ లిమిట్ను మరింత పెంచుతామని పేటీఎం తెలిపింది.

ప్రస్తుతానికి, 7 మిలియన్లకు పైగా వినియోగదారులు Paytm పోస్ట్‌పెయిడ్ సేవలను ఉపయోగిస్తున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరి నాటికి మొత్తం 15 మిలియన్ల వినియోగదారులను పేటీఎం పోస్ట్ పేయిడ్ సర్వీసుల్లో భాగం చేయాలని కంపెనీ భావిస్తోంది.

పోస్ట్ పెయిడ్ సర్వీసులు లైట్, డిలైట్, ఎలైట్ అనే మూడు వేర్వేరు స్లాబ్లలో లభిస్తాయి. పోస్ట్‌పెయిడ్ లైట్ యూజర్లు రూ. 20,000 వరకు క్రెడిట్ తీసుకోవచ్చు. ఇది క్రెడిట్ స్కోరు లేని వినియోగదారుల కోసం ప్రత్యేకంగా రూపొందించబడింది. కాగా, ఎటువంటి అదనపు ఛార్జీలు వసూలు చేయకుండా డెలైట్, ఎలైట్ యూజర్లకు లక్ష రూపాయల వరకు క్రెడిట్ లిమిట్ పొందే అవకాశాన్ని కల్పిస్తుంది పేటీఎం సంస్థ. కాగా, నెలవారీ ఈఎంఐ చెల్లింపులను యూపీఐ, డెబిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్ వంటి మోడ్‌లతో చెల్లింపు చేసే అవకాశాన్ని కల్పిస్తుంది పేటీఎం.
Published by: Krishna Adithya
First published: November 25, 2020, 1:31 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading