పెట్రోల్ ధరలు పెరుగుతుంటాయి. తగ్గుతుంటాయి. తగ్గినా పెద్దగా లాభం ఉండదు. పెరిగితే సామాన్యులకు ఇంకా భారం తప్పదు. మరి ఈ పెట్రోల్ కష్టాల నుంచి బయటపడేదెలా? ఏముంది కాస్త తెలివిగా ఖర్చు చేయడమే. మీలాంటివారి కోసమే
పేటీఎం మంచి ఆఫర్ ప్రకటించింది. ఏడాది పాటు పెట్రోల్ కొంటే రూ.7,500 క్యాష్‌బ్యాక్ పొందొచ్చు. వాస్తవానికి ఈ ఆఫర్ 2018 ఆగస్ట్ 1న ప్రారంభమైంది. 2019 ఆగస్ట్ 1న ముగుస్తుంది. చాలామందికి ఈ ఆఫర్ గురించి తెలియక సరిగ్గా వాడుకోవట్లేదు. అయితే రూ.7,500 క్యాష్‌బ్యాక్ పొందేందుకు కొన్ని నియమనిబంధనలు ఉన్నాయి. అవేంటో తెలుసుకొని మీరు మీ
పేటీఎం నుంచి ట్రాన్సాక్షన్స్ చేస్తే రూ.7,500 క్యాష్‌బ్యాక్ పొందొచ్చు.
ఇది కూడా చదవండి:
SANKRANTI 2019: వాట్సప్‌లో సంక్రాంతి స్టిక్కర్లు ఇలా పంపండిపేటీఎంతో పెట్రోల్ కొనుగోలుపై రూ.7,500 క్యాష్ బ్యాక్ పొందేందుకు నియమనిబంధనలు ఇవే...
మీరు పెట్రోల్ బంకుల్లో పేటీఎం వ్యాలెట్‌తో లావాదేవీలు చేయాలి.
కనీస లావాదేవీ రూ.50 కన్నా ఎక్కువ ఉండాలి.
ఈ ఆఫర్ 2018 ఆగస్ట్ 1న ప్రారంభమై 2019 ఆగస్ట్ 1న ముగుస్తుంది.
1వ ట్రాన్సాక్షన్ చేసినప్పుడు ఎలక్ట్రిసిటీ బిల్లుపై రూ.50 క్యాష్‌బ్యాక్. అదనంగా పేటీఎం పేమెంట్ బ్యాంక్ ఉపయోగిస్తే రూ.10 క్యాష్‌బ్యాక్.2వ ట్రాన్సాక్షన్ తర్వాత సినిమాలపై రూ.100 తగ్గింపు.
3వ ట్రాన్సాక్షన్ తర్వాత ఓయో బుకింగ్‌పై రూ.350 క్యాష్‌బ్యాక్.
4వ ట్రాన్సాక్షన్తో డీటీహెచ్ రీఛార్జ్‌పై రూ.25 క్యాష్‌బ్యాక్.
5వ ట్రాన్సాక్షన్ తర్వాత మూవీ బుకింగ్‌పై రూ.200 తగ్గింపు.
6వ ట్రాన్సాక్షన్ తర్వాత రూ.25 క్యాష్‌బ్యాక్.
10వ ట్రాన్సాక్షన్, ఆ తర్వాత ప్రతీ 10వ ట్రాన్సాక్షన్‌పై ఫ్లైట్, బస్ టికెట్ బుకింగ్‌పై రూ.1350 క్యాష్‌బ్యాక్. ఆఫర్ సమయంలో ఒక యూజర్ 2 సార్లు మాత్రమే ఉపయోగించుకోవచ్చు.
ఫ్లైట్ టికెట్ బుకింగ్‌పై రూ.500 క్యాష్‌బ్యాక్. ఒక యూజర్‌కు 2 సార్లు మాత్రమే.
బస్ టికెట్ బుకింగ్‌పై రూ.125 క్యాష్‌బ్యాక్. ఒక యూజర్‌కు 2 సార్లు మాత్రమే.
ప్రతీ 10వ బుకింగ్‌పై ప్రోమోకోడ్ వేరుగా వస్తుంది.
పెట్రోల్, సినిమా టికెట్, బస్ టికెట్, ఫ్లైట్ టికెట్ బుకింగ్ కోసం
పేటీఎం వ్యాలెట్ నుంచే లావాదేవీలు జరపడం తప్పనిసరి. అందుకే పెట్రోల్ కొనే ముందు ఈ నియమనిబంధనల్ని అర్థం చేసుకోవడం మంచిది.
ఇవి కూడా చదవండి:
AADHAR NEWS: ఆధార్ కార్డు పోయిందా? ఇలా రీప్రింట్ చేసుకోవచ్చు
TRAI Good News: నెలకు రూ.153 చెల్లిస్తే 100 ఫ్రీ లేదా పే ఛానెళ్లు
REDMI 6 PRO: రూ.11,499 విలువైన ఫోన్ రూ.1,058 ధరకే... ఎలా కొనాలో తెలుసుకోండి
SBI CARD: ఎస్బీఐ ఏటీఎం కార్డు నుంచి డేటా కొట్టేస్తారు జాగ్రత్త