news18-telugu
Updated: October 31, 2020, 11:53 AM IST
Paytm: పేటీఎం యూజర్లకు శుభవార్త... టోల్ ప్లాజాల్లో ఆటోమేటిక్ క్యాష్‌లెస్ చెల్లింపులు
ప్రముఖ డిజిటల్ చెల్లింపుల ప్లాట్‌ఫామ్ పేటీఎంకి చెందిన పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ (పిపిబిఎల్) తమ యూజర్లకు గుడ్ న్యూస్ తెలిపింది. దేశవ్యాప్తంగా ఉన్న 211 టోల్ ప్లాజాల్లో ఆటోమేటిక్ క్యాష్‌లెస్ చెల్లింపులను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. ఈ నూతన సేవలతో ఇకపై పేటీఎం యూజర్లు తమ ఫాస్ట్ ట్యాగ్ చెల్లింపుల కోసం ఇతర బ్యాంకుల్లా ప్రత్యేక ప్రీపెయిడ్ ఖాతా సృష్టించాల్సిన అవసరం లేదు. దీనితో దేశంలోనే అతిపెద్ద ఫాస్ట్‌ట్యాగ్‌లను జారీ చేసే బ్యాంకుగా అవతరించిన పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ తన ట్యాగ్‌లతో 5 మిలియన్ వాహనాలను కలిగి ఉంది. అంతేకాక, నేషనల్ ఎలక్ట్రానిక్ టోల్ కలెక్షన్ (ఎన్‌ఇటిసి) ప్రోగ్రాం కింద ఏర్పాటైన అతిపెద్ద ఆర్జిత బ్యాంకుగా కూడా అవతరించింది. త్వరలోనే మరో 100 టోల్ ప్లాజాలను సొంతం చేసుకోవడంతో పాటు రాబోయే 3 నెలల్లో ఫాస్ట్ ట్యాగ్ అమ్మకాలలో 100% వృద్ధిని సాధించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని పేటీఎం ప్రకటించింది. వాహన యజమానులు తమ వెహికిల్ రిజిస్ట్రేషన్ నంబర్ & సర్టిఫికేట్ వంటి కనీస డాక్యుమెంటేషన్‌తోనే ఫాస్ట్ ట్యాగ్‌ను కొనుగోలు చేయవచ్చని తెలిపింది. అంతేకాక, కొనుగోలుదారుడు అందజేసిన రిజిస్టర్డ్ చిరునామా వద్ద ఫాస్ట్ ట్యాగ్ ఉచితంగా పంపిణీ చేయబడుతుందిని పేర్కొంది. టోల్ చెల్లింపు సమయంలో పేటీఎం వ్యాలెట్ నుండి వినియోగదారుడి డబ్బు ఆటో డెబిట్ అవుతుందని, దీని కోసం ఇతర బ్యాంకుల్లా ప్రత్యేక ప్రీపెయిడ్ అకౌంట్ సృష్టించాల్సిన అవసరం లేదని పేర్కొంది.
November 2020 Bank Holidays: అలర్ట్... నవంబర్‌లో బ్యాంకులకు 8 సెలవులు... ఎప్పుడెప్పుడో తెలుసుకోండిNew Rules: అలర్ట్... నవంబర్ 1 నుంచి ఈ రూల్స్ మారతాయి
2000కు పైగా అవగాహన శిబిరాల ఏర్పాటు
టోల్ ప్లాజాలలో ఈ క్యాష్‌లెస్ చెల్లింపు విధానంపై ప్రజలకు అవగాహన కల్పించడానికి, వాహన యజమానులు ట్యాగ్‌లను కొనుగోలు చేయడంలో సహాయపడటానికి పేటీఎం సంస్థ దేశవ్యాప్తంగా మొత్తం 2000కి పైగా ప్రత్యేక శిబిరాలను ఏర్పాటు చేసింది. వీటిని టోల్ ప్లాజాలు, రెసిడెన్షియల్ పార్కింగ్ స్థలాలు, ఇంధన స్టేషన్లు, దేశవ్యాప్తంగా ఉన్న ఇతర వాణిజ్య ప్రాంతాలలో ఏర్పాటు చేసింది. ఈ క్యాష్‌లెస్ పేమెంట్ సేవలపై పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ సీఈఓ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ సతీష్ కుమార్ గుప్తా మాట్లాడుతూ “దేశంలో డిజిటల్ టోల్ చెల్లింపులను స్వీకరించడానికి, రహదారిపైన సులభమైన ప్రయాణాన్ని అందించడానికి, వాహనదారుల సమయాన్ని -ఆదా చేయడానికి మేము కట్టుబడి ఉన్నాము. దేశంలో అతిపెద్ద ఫాస్ట్ ట్యాగ్ జారీ చేసే బ్యాంకుగా మా బ్యాంకు అవతరించడానికి మాకు సహాయపడిన వినియోగదారులకు కృతజ్ఙతలు. భారత ప్రభుత్వం ప్రారంభించిన ‘డిజిటల్ ఇండియా’ మిషన్‌ను ముందుకు తీసుకెళ్లడానికి, దేశంలో నగదు రహిత చెల్లింపులను ప్రోత్సహించడానికి మా ప్రయత్నాలను కొనసాగిస్తాం" అని పేర్కొన్నారు.
Published by:
Santhosh Kumar S
First published:
October 31, 2020, 11:53 AM IST