Paytm: పేటీఎం నుంచి త్వరలో మరో సర్వీస్... షేర్స్ కొనొచ్చు, అమ్మొచ్చు

Paytm Money | స్టాక్ బ్రోకింగ్ మొదలైతే డెరివేటీవ్స్, ఈటీఎఫ్, ఎక్స్‌ఛేంజ్ ట్రేడెడ్ ప్రొడక్ట్స్‌కు వేదిక కానుంది పేటీఎం మనీ.

news18-telugu
Updated: April 4, 2019, 11:18 AM IST
Paytm: పేటీఎం నుంచి త్వరలో మరో సర్వీస్... షేర్స్ కొనొచ్చు, అమ్మొచ్చు
Paytm: పేటీఎం నుంచి త్వరలో మరో సర్వీస్... షేర్స్ కొనొచ్చు, అమ్మొచ్చు
news18-telugu
Updated: April 4, 2019, 11:18 AM IST
పేటీఎం కొత్తకొత్త సేవలతో తన పరిధిని విస్తరించుకుంటోంది. పేటీఎం యాప్‌లో మొబైల్ రీఛార్జ్, బిల్ పేమెంట్స్, మూవీ టికెట్స్, ఫుడ్ ఆర్డరింగ్, బస్ టికెట్స్ ఇలా అనేక సేవలు లభిస్తాయి. ఇక పేటీఎం మనీ యాప్‌లో మ్యూచువల్ ఫండ్స్ కొనొచ్చు. ఇప్పుడు పేటీఎం మనీని మరింత విస్తరిస్తోంది ఆ సంస్థ. త్వరలో పేటీఎం మనీలో స్టాక్ బ్రోకింగ్ ప్రారంభం కానుంది. ఇందుకోసం సెక్యూరిటీస్ & ఎక్స్‌ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (SEBI) నుంచి అనుమతి లభించింది. బాంబే స్టాక్ ఎక్స్‌ఛేంజ్(BSE), నేషనల్ స్టాక్ ఎక్స్‌ఛేంజ్(NSE) సభ్యత్వం లభించింది. ఇక పేటీఎం మనీ ప్లాట్‌ఫామ్‌లో స్టాక్ బ్రోకింగ్ ప్రారంభం కావడం లాంఛనమే.

Read this: TikTok Ban: టిక్‌టాక్ యూజర్లకు షాక్... యాప్‌ను బ్యాన్ చేయాలన్న మద్రాస్ హైకోర్టు

ప్రస్తుతం మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్‌మెంట్స్‌ ఆఫర్ చేస్తోంది పేటీఎం. 25 అసెట్ మేనేజ్‌మెంట్ కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకుంది. దాంతో పాటు పేటీఎం లైఫ్ ఇన్స్యూరెన్స్ లిమిటెడ్, పేటీఎం జనరల్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ ద్వారా ఇన్స్యూరెన్స్ పాలసీలను అమ్ముతోంది. స్టాక్ బ్రోకింగ్ మొదలైతే డెరివేటీవ్స్, ఈటీఎఫ్, ఎక్స్‌ఛేంజ్ ట్రేడెడ్ ప్రొడక్ట్స్‌కు వేదిక కానుంది పేటీఎం మనీ. అయితే స్టాక్ బ్రోకింగ్ సర్వీస్ ఇప్పటికిప్పుడే మొదలుకాదు. ఇందుకు కొన్ని నెలల సమయం పట్టే అవకాశముంది.

Royal Enfield: బుల్లెట్ ట్రయల్స్ 350, 500 బైకుల్ని లాంఛ్ చేసిన రాయల్ ఎన్‌ఫీల్డ్



ఇవి కూడా చదవండి:

WhatsApp: వాట్సప్‌లో కొత్తగా గ్రూప్ ఇన్విటేషన్ ఫీచర్... సెట్టింగ్స్ ఇవే
Loading...
Whatsapp tipline: వాట్సప్‌లో 'చెక్‌పాయింట్ టిప్‌లైన్' ఫీచర్... ఫేక్ న్యూస్‌కు ఇలా చెక్ పెట్టండి
First published: April 4, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...