Paytmలో భారీ మోసం.. నకిలీ ఆర్డర్లతో రూ.10 కోట్ల టోకరా..

Paytm: క్యాష్‌బ్యాక్స్ రూపంలో ఏకంగా రూ.5 నుంచి రూ.10 కోట్ల వరకు మోసం జరిగినట్లు కంపెనీ వెల్లడించింది.

news18-telugu
Updated: May 16, 2019, 7:06 AM IST
Paytmలో భారీ మోసం.. నకిలీ ఆర్డర్లతో రూ.10 కోట్ల టోకరా..
పేటీఎం
  • Share this:
ఈ-కామర్స్ సంస్థ పేటీఎంలో భారీ మోసం చోటుచేసుకుంది. క్యాష్‌బ్యాక్స్ రూపంలో ఏకంగా రూ.5 నుంచి రూ.10 కోట్ల వరకు మోసం జరిగినట్లు కంపెనీ వెల్లడించింది. గ్లోబల్ ప్రొఫెషనల్ సర్వీసెసర్ సంస్థ ఈవై (ఎర్నెస్ట్ అండ్ యంగ్) రూపొందించిన ప్రత్యేకమైన టూల్ సాయంతో ఈ మోసాన్ని గుర్తించినట్లు కంపెనీ పేర్కొంది. ‘ప్లాట్‌ఫామ్‌లోకి కొందరు చిన్న వర్తకులకు భారీగా క్యాష్‌బ్యాక్ లభిస్తున్న విషయాన్ని గుర్తించాం. అందుకే అంతర్గత విచారణ చేపట్టాం. ఇందులో రూ.10 కోట్ల మోసం బయటపడింది’ అని పేటీఎం వ్యవస్థాపకుడు విజయ్‌ శేఖర్‌ శర్మ తెలిపారు. ఈ మోసంలో కింది స్థాయి ఉద్యోగుల పాత్ర ఉన్నట్లు తేలిందని ఆయన వెల్లడించారు. ఈ నేపథ్యంలో వంద మంది విక్రేతలను తమ ప్లాట్‌ఫామ్ నుంచి తొలగించామని, అలాగే కొందరు ఉద్యోగులను తీసేశామని పేర్కొన్నారు.

నకిలీ ఆర్డర్లు సృష్టించి క్యాష్‌బ్యాక్‌ ద్వారా వచ్చిన సొమ్మును ఉద్యోగులు తమ సొంత ఖాతాల్లోకి మళ్లించారని వివరించారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు చోటుచేసుకోకుండా మరిన్ని కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ క్రమంలో ఈవైతో తమ అనుబంధం కొనసాగుతుందన్నారు. ఇందుకోసం మానవ వనరులతో పాటు, కృత్రిమ మేథను కూడా ఉపయోగిస్తామన్నారు.
First published: May 16, 2019, 7:06 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading