news18-telugu
Updated: August 10, 2020, 3:08 PM IST
Paytm: పేటీఎం పేమెంట్స్ కోసం కొత్త డివైజ్... నెలకు రూ.499 మాత్రమే
ప్రముఖ రీఛార్జ్, బిల్ పేమెంట్ ప్లాట్‌ఫామ్ అయిన పేటీఎం సరికొత్త ఆండ్రాయిడ్ పీఓఎస్ డివైజ్ లాంఛ్ చేసింది. చిన్నతరహా, మధ్యతరహా వ్యాపారులకు టెక్నాలజీ సొల్యూషన్స్ అందించడంలో భాగంగా కాంటాక్ట్‌లెస్ ఆర్డర్స్, పేమెంట్స్ కోసం ఈ డివైజ్‌ను రూపొందించింది. నెలకు రూ.499 అద్దె చెల్లించి ఈ డివైజ్‌ను తీసుకోవచ్చు. చిరు వ్యాపారులను దృష్టిలో పెట్టుకొని తక్కువ ధరకే ఈ డివైజ్ రూపొందించింది పేటీఎం. పేటీఎం ఆండ్రాయిడ్ పీఓఎస్ డివైజ్ స్మార్ట్‌ఫోన్ లాగానే ఉంటుంది. బరువు 163 గ్రాములు మాత్రమే. 4.5 అంగుళాల టచ్ స్క్రీన్ ఉంటుంది. బ్యాటరీ ఫుల్ డే వస్తుంది. క్యూ ఆర్ కోడ్స్ స్కాన్ చేయడంతో పాటు తక్షణమే పేమెంట్ చేసేందుకు ఇన్‌బిల్ట్ కెమెరా ఉంటుంది. 4జీ సిమ్ కార్డ్, వైఫై, బ్లూటూత్ కనెక్టివిటీస్తో పనిచేస్తుంది. మరికొన్ని నెలల్లో 2 లక్షల డివైజ్‌లను అందించాలని పేటీఎం టార్గెట్‌గా పెట్టుకుంది. వీటి ద్వారా నెలకు 2 కోట్ల పేమెంట్స్ జరగొచ్చని అంచనా.
LIC: ఎల్ఐసీ పాలసీహోల్డర్లకు గుడ్ న్యూస్... ఈ అవకాశం 2 నెలలు మాత్రమేఈ స్మార్ట్‌ఫోన్ ధర రూ.7,777 మాత్రమే... మేడ్ ఇన్ ఇండియా మొబైల్ ఫీచర్స్ ఇవే
ఈ డివైజ్ ద్వారా ఎక్కడైనా పేమెంట్స్ స్వీకరించొచ్చు. భారతదేశంలోనే మొదటి ఆండ్రాయిడ్ బేస్డ్ డివైజ్ ఇది. ఇందులో పేటీఎంకు చెందిన స్కాన్ టు ఆర్డర్ సర్వీస్ కూడా ఉంటుంది. ఈ సర్వీస్‌ను ఇప్పటికే వేలాది రెస్టారెంట్లు పొందుతున్నాయి. డెలివరీ బాయ్స్, కిరాణా షాపులు, చిరు వ్యాపారులు డిజిటల్ పేమెంట్స్ స్వీకరించేందుకు ఈ డివైజ్ ఉపయోగపడుతుంది. పేటీఎం ఫర్ బిజినెస్ యాప్‌తో స్మార్ట్ పీఓఎస్ డివైజ్ అనుసంధానించొచ్చు. దీని ద్వారా జీఎస్టీకి సంబంధించిన బిల్లులు, అన్ని ట్రాన్సాక్షన్స్, సెటిల్మెంట్స్ లాంటివన్నీ ఒకేచోట ఉంటాయి. ఇక వీటితో పాటు పేటీఎం ఫర్ బిజినెస్ యాప్ ద్వారా లోన్స్, ఇన్స్యూరెన్స్, బిజినెస్ ఖాతా లాంటివన్నీ నిర్వహించొచ్చు. ఇక ఇప్పటికే పేటీఎం సౌండ్‌బాక్స్, క్యాలిక్యులేటర్, పవర్ బ్యాంక్, క్లాక్, పెన్ స్టాండ్స్, రేడియోల్లో పేటీఎం ఆల్ ఇన్ వన్ క్యూఆర్ కోడ్స్ అందిస్తున్న సంగతి తెలిసిందే.
Published by:
Santhosh Kumar S
First published:
August 10, 2020, 3:08 PM IST