హోమ్ /వార్తలు /బిజినెస్ /

Paytm: పేటీఎం సంచలనం... యూపీఐ పేమెంట్స్‌పై రూ.10,000 వరకు ఇన్స్యూరెన్స్ కవరేజీ

Paytm: పేటీఎం సంచలనం... యూపీఐ పేమెంట్స్‌పై రూ.10,000 వరకు ఇన్స్యూరెన్స్ కవరేజీ

Paytm: పేటీఎం సంచలనం... యూపీఐ పేమెంట్స్‌పై రూ.10,000 వరకు ఇన్స్యూరెన్స్ కవరేజీ
(ప్రతీకాత్మక చిత్రం)

Paytm: పేటీఎం సంచలనం... యూపీఐ పేమెంట్స్‌పై రూ.10,000 వరకు ఇన్స్యూరెన్స్ కవరేజీ (ప్రతీకాత్మక చిత్రం)

Paytm | పేటీఎం సంచలనం సృష్టించింది. యూపీఐ పేమెంట్స్‌ (UPI Payments) చేసేవారికి రూ.10,000 వరకు ఇన్స్యూరెన్స్ కవరేజీ ఇస్తోంది.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad | Visakhapatnam

పేటీఎం... పరిచయం అక్కర్లేని ఆన్‌లైన్ పేమెంట్స్ ప్లాట్‌ఫామ్. పేటీఎంలో (Paytm) రీఛార్జ్‌ల దగ్గర్నుంచి ఇంటి అద్దెల వరకు... ఏ పేమెంట్స్ అయినా సులువుగా చేయొచ్చు. పేటీఎంలో యూపీఐ పేమెంట్స్ (UPI Payments) చేసేవారూ ఉన్నారు. యూపీఐ కస్టమర్లను దృష్టిలో పెట్టుకొని పేటీఎం ఓ ప్రొడక్ట్ లాంఛ్ చేసింది. హెచ్‌డీఎఫ్‌సీ ఎర్గో (HDFC ERGO) జనరల్ ఇన్స్యూరెన్స్‌తో కలిసి 'పేటీఎం పేమెంట్ ప్రొటెక్ట్' (Paytm Payment Protect) పేరుతో ఇన్స్యూరెన్స్ ప్రొడక్ట్ లాంఛ్ చేసింది. యూపీఐ పేమెంట్స్ చేసేవారికి రూ.10,000 వరకు ఇన్స్యూరెన్స్ కవరేజీ ఇస్తోంది. ఈ ప్రొడక్ట్ వివరాలు తెలుసుకోండి.

ఇటీవల యూపీఐ మోసాలు పెరిగిపోతున్న సంగతి తెలిసిందే. ఫలితంగా యూపీఐ ప్లాట్‌ఫామ్ ఉపయోగించే కస్టమర్లు దారుణంగా మోసపోతున్నారు. వారి అకౌంట్లు క్షణాల్లో ఖాళీ అవుతున్నాయి. వారికి రక్షణ కల్పించేందుకు పేటీఎం కొత్తగా 'పేటీఎం పేమెంట్ ప్రొటెక్ట్' గ్రూప్ ఇన్స్యూరెన్స్ ప్లాన్ తీసుకొచ్చింది. యూపీఐ వినియోగదారులు మొబైల్‌లో మోసపూరిత లావాదేవీలపై రూ.10,000 వరకు రక్షణ పొందొచ్చు. ఇందుకోసం కేవలం రూ.30 వార్షిక ప్రీమియం చెల్లిస్తే చాలు.

Cyber Crime: 'హాయ్‌ మమ్‌' సైబర్‌ స్కామ్‌... రూ.54 కోట్లు దోచేసిన నేరగాళ్లు... మీరు జాగ్రత్తగా ఉండండిలా

మేము వినియోగదారులను రక్షించడానికి, సైబర్ నేరాలను ఎదుర్కోవడానికి అనుకూలమైన క్లెయిమ్‌లతో బీమా కవర్‌ను అందిస్తున్నాము. HDFC ERGOతో మా భాగస్వామ్యం ఆర్థిక అవగాహనను వ్యాప్తి చేయడం, దేశంలో సురక్షితమైన డిజిటల్ చెల్లింపుల స్వీకరణను ప్రోత్సహించే లక్ష్యంతో కలిసి పనిచేస్తున్నాం.

భవేష్ గుప్తా, సీఈఓ, లెండింగ్ అండ్ హెడ్ ఆఫ్ పేమెంట్స్, పేటీఎం

అన్ని యాప్స్, వ్యాలెట్స్‌లో యూపీఐ పేమెంట్స్ చేసేవారికి ఈ కవరేజీ లభిస్తుంది. ఏడాదికి రూ.30 ప్రీమియం చెల్లిస్తే రూ.10,000 వరకు ఇన్స్యూరెన్స్ లభిస్తుంది. మొబైల్ వ్యాలెట్స్‌లో జరిగే మోసపూరిత లావాదేవీలకు కూడా ఇది వర్తిస్తుంది. త్వరలో ఏడాదికి రూ.1 లక్ష వరకు కవరేజీ ఇచ్చే ప్రొడక్ట్ లాంఛ్ చేస్తామని పేటీఎం ప్రకటించింది. డిజిటల్ చెల్లింపుల అనుభవాన్ని మరింత మెరుగుపరచడానికి మొదటిసారి ఇలాంటి ప్రొడక్ట్ తీసుకొస్తున్నామని, పేటీఎం మొబైల్ చెల్లింపులకు మార్గదర్శకంగా, విశ్వసనీయమైన, విస్తారమైన రీచ్‌తో ఉందని, HDFC ERGO సరసమైన, సమగ్ర బీమా ప్లాన్‌లను అందిస్తోందని పేటీఎం వెల్లడించింది.

Samsung Galaxy M04: సాంసంగ్ బడ్జెట్ ఫోన్ సేల్ ప్రారంభం... 8జీబీ వరకు ర్యామ్, 5,000mAh బ్యాటరీ

పేటీఎం యూజర్లు కేవలం రూ.30 చెల్లించి రూ.10,000 బీమా కవరేజీ పొందాలనికి కేవలం రెండు స్టెప్స్‌ చాలు. ముందుగా పేటీఎం యాప్ ఓపెన్ చేసి Payment Protect అని సెర్చ్ చేయాలి. పేరు, మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి Proceed to Pay పైన క్లిక్ చేసి పేమెంట్ చేస్తే చాలు. 'పేటీఎం పేమెంట్ ప్రొటెక్ట్' ఏడాది ప్లాన్ తీసుకోవచ్చు. మీరు పేమెంట్ ప్రొటెక్ట్ ప్లాన్ తీసుకున్న తేదీ నుంచి ఏడాది వరకు కవరేజీ ఉంటుంది.

First published:

Tags: Hdfc, Insurance, Paytm, UPI, Upi payments

ఉత్తమ కథలు