Home /News /business /

PAYTM HAS TIED UP WITH PIRAMAL FINANCE NOW YOU CAN TAKE A LOAN FROM PAYTM LIKE THIS UMG GH

Paytm: ఇకపై పేటీఎంలో లోన్ ఫెసిలిటీ.. ఎంత వరకు ఎలిజిబిలిటీ అంటే..!

 పిరమల్ ఫైనాన్స్ తో జతకట్టిన పేటీఎం.. ఇకపై పేటీఎంలో నుంచి ఎంత  లోన్ తీసుకోవచ్చంటే !

పిరమల్ ఫైనాన్స్ తో జతకట్టిన పేటీఎం.. ఇకపై పేటీఎంలో నుంచి ఎంత లోన్ తీసుకోవచ్చంటే !

పేమెంట్ ప్లాట్‌ఫామ్‌గా ప్రారంభమైన పేటీఎం (Paytm), వివిధ విభాగాలకు సేవలను విస్తరించింది. ఈ క్రమంలో దేశంలోని చిన్న నగరాలు, పట్టణాలకు మర్చంట్ లోన్స్ బిజినెస్‌(Business)ను విస్తరించడానికి కంపెనీ కొత్త ప్రణాళికలు రచిస్తోంది. ఇందులో భాగంగా పిరమల్ క్యాపిటల్ & హౌసింగ్(Housing Loan) ఫైనాన్స్‌తో పార్ట్నర్‌షిప్ కుదుర్చుకుంటున్నట్లు పేటీఎం ప్రకటించింది.

ఇంకా చదవండి ...
  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India
పేమెంట్(Payment) ప్లాట్‌ఫామ్‌గా ప్రారంభమైన పేటీఎం (Paytm), వివిధ విభాగాలకు సేవలను విస్తరించింది. ఈ క్రమంలో దేశంలోని చిన్న నగరాలు, పట్టణాలకు మర్చంట్ లోన్స్ బిజినెస్‌ను విస్తరించడానికి కంపెనీ కొత్త ప్రణాళికలు రచిస్తోంది. ఇందులో భాగంగా పిరమల్ క్యాపిటల్ & హౌసింగ్(Housing Loan) ఫైనాన్స్‌తో పార్ట్నర్‌షిప్ కుదుర్చుకుంటున్నట్లు పేటీఎం ప్రకటించింది. పిరమల్ క్యాపిటల్ & హౌసింగ్ ఫైనాన్స్ అనేది పిరమల్ ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్ అనుబంధ సంస్థ. ఈ విభాగానికి భారతదేశం అంతటా 300కి పైగా శాఖలు ఉన్నాయి. ఇప్పుడు పేటీఎం నుంచి వ్యాపారులు 6-24 నెలల కాలవ్యవధితో రూ. 10 లక్షల వరకు రుణాలను పొందగలరని, పిరమల్ ఫైనాన్స్‌తో కలిసి త్వరలో పర్సనల్ లోన్(Loan) బిజినెస్‌ను కూడా విస్తరిస్తామని పేటీఎం తెలిపింది.

దేశవ్యాప్తంగా పెద్ద, చిన్న నగరాల నుంచి పెద్ద సంఖ్యలో వ్యాపారులను పేటీఎం సంపాదించుకుంది. పిరమల్ ఫైనాన్స్ సహాయంతో చిన్న వ్యాపారాల యజమానులకు లోన్ అందించే పరిధిని విస్తరిస్తున్నాం. వ్యాపార ఆదాయం ఆధారంగా, క్రెడిట్ ఆంక్షలతో లోన్లు అందించాలని యోచిస్తున్నాం. ఈ భాగస్వామ్యంలో త్వరలో వ్యక్తిగత రుణాలను చేర్చి, వ్యాపారాన్ని విస్తరించనున్నాం. ఈ విషయంలో రిస్క్, కస్టమర్ సెగ్మెంట్‌పై పిరమల్ ఫైనాన్స్ మాకు సాయం చేస్తుంది’ అని పేటీఎం హోమ్ బ్రాండ్‌ One 97 కమ్యూనికేషన్స్ ఒక ప్రకటనలో తెలిపింది.

309 క్రియాశీల శాఖలను కలిగి ఉన్న పిరమల్ ఫైనాన్స్ కూడా వ్యాపారాన్ని విస్తరించే పనిలో ఉంది. 1000 పట్టణాలు, నగరాల్లో సేవలు ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకుంది. గత సంవత్సరం పిరమల్ ఫైనాన్స్ DHFLను కొనుగోలు చేసింది. పాత DHFL బ్రాంచ్‌లను మల్టీ-ప్రొడక్ట్ బ్రాంచ్‌లుగా మార్చడానికి కూడా సంస్థ కృషి చేస్తోంది.

పిరమల్ ఫైనాన్స్ భాగస్వామ్యంపై మాట్లాడారు పేటీఎం లెండింగ్ CEO, పేమెంట్స్ హెడ్ భావేష్ గుప్తా. అన్ని లెండింగ్ ప్రొడక్ట్స్‌లో వేగవంతమైన వృద్ధిని కొనసాగిస్తున్నామని చెప్పారు. డిజిటల్ క్రెడిట్ యాక్సెస్‌తో చిన్న నగరాలు, పట్టణాల్లో MSMEలను శక్తివంతం చేస్తున్నామని, పిరమల్ ఫైనాన్స్‌తో ఒప్పదంతో మరింత మంది వ్యాపారులను ఫార్మల్ క్రెడిట్ ఎకానమీ పరిధిలోకి తీసుకువస్తామని వివరించారు.

ఇదీ చదవండి: Success Story: జేజేఈ మెయిన్ టాపర్‌గా అసోం అమ్మాయి.. ప్రిపరేషన్‌లో ఆమె చెప్తున్న మాటలు వింటే మైండ్ పోద్ది !


పేటీఎం ఫర్ బిజినెస్ యాప్‌లో వ్యాపారులు (మర్చంట్స్) లోన్‌ ఎలా పొందవచ్చు..?

- పేటీఎం ఫర్ బిజినెస్ యాప్ హోమ్ స్క్రీన్‌లో "బిజినెస్ లోన్" ఐకాన్‌పై క్లిక్ చేసి, కావాల్సిన లోన్ మొత్తాన్ని ఎంటర్ చేయండి.

- లోన్ మొత్తం, పంపిణీ చేయాల్సిన మొత్తం, చెల్లించాల్సిన మొత్తం, రోజువారీ వాయిదా, లోన్ గడువు వంటి వివరాలను చెక్ చేయండి.

- వివరాలను నిర్ధారించి, చెక్ బాక్స్‌పై క్లిక్ చేసి, 'Get Started'పై క్లిక్ చేయండి.

- లోన్ అప్లికేషన్ ప్రాసెస్‌ను త్వరగా పూర్తి చేయడానికి CKYC నుంచి KYC వివరాలను ఇవ్వడానికి వ్యాపారులు ఓకే చెప్పాలి.



- తదుపరి స్క్రీన్‌లో పాన్, పుట్టిన తేదీ, ఇమెయిల్ అడ్రస్ వంటి వ్యక్తిగత వివరాలను నిర్ధారించండి.

- ఆ తర్వాత రుణ అర్హత కోసం క్రెడిట్ స్కోర్, KYC వివరాల ధ్రువీకరణ పూర్తి చేయాలి.

- అప్లికేషన్ వెరిఫై అయిన తర్వాత వ్యాపారి ఎంచుకున్న బ్యాంక్ అకౌంట్‌లో లోన్ మొత్తం తక్షణమే డిస్ట్రిబ్యూట్ అవుతుంది.
Published by:Mahesh
First published:

Tags: Business, Finance, Housing Loans, Paytm payment bank

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు