హోమ్ /వార్తలు /బిజినెస్ /

Paytm: స్టాక్ మార్కెట్‌లో లిస్ట్ అయిన పేటీఎం... ఫౌండర్ విజయ్ శేఖర్ శర్మ భావోద్వేగం

Paytm: స్టాక్ మార్కెట్‌లో లిస్ట్ అయిన పేటీఎం... ఫౌండర్ విజయ్ శేఖర్ శర్మ భావోద్వేగం

Paytm: స్టాక్ మార్కెట్‌లో లిస్ట్ అయిన పేటీఎం... ఫౌండర్ విజయ్ శేఖర్ శర్మ భావోద్వేగం
(PTI Photo/Shashank Parade)

Paytm: స్టాక్ మార్కెట్‌లో లిస్ట్ అయిన పేటీఎం... ఫౌండర్ విజయ్ శేఖర్ శర్మ భావోద్వేగం (PTI Photo/Shashank Parade)

Paytm IPO | పేటీఎం ఐపీఓ స్టాక్ మార్కెట్‌లో లిస్ట్ కావడంతో ఫౌండర్ విజయ్ శేఖర్ శర్మ (Vijay Shekhar Sharma) భావోద్వేగానికి గురయ్యారు.

  ఇన్వెస్టర్లు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న పేటీఎం ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్ (IPO) ఇండియన్ స్టాక్ మార్కెట్‌లో గురువారం లిస్ట్ అయింది. భారతదేశంలో ఇప్పటివరకు వచ్చిన ఐపీఓల్లో ఇదే అతిపెద్దది. 2.5 బిలియన్ డాలర్లు అంటే రూ.18,300 కోట్ల ఐపీఓ ఇది. ఇంత భారీ ఐపీఓ ఇవాళ లిస్ట్ అయింది. లిస్టింగ్ సమయంలో పేటీఎం ఫౌండర్, సీఈఓ విజయ్ శేఖర్ శర్మ భావోద్వేగానికి గురయ్యారు. "నేను కన్నీళ్లతో ఉన్నాను. నేను 'భారత భాగ్య విధాత' అని చెప్పినప్పుడల్లా పొంగిపోతుంటాను. ఈ రోజు మనలో ఎవరూ ఎప్పుడూ ఊహించని రోజు. ఇక్కడికి చేరుకుంటామని మనలో చాలామంది నమ్మలేదు. బోర్డు మెంబర్స్, షేర్ హోల్డర్స్ దేశంలోనే అదృష్టవంతులు" అని విజయ్ శేఖర్ శర్మ అన్నారు.

  పేటీఎం 2000 సంవత్సరంలో ప్రారంభమైంది. వన్97 పేటీఎం పేరెంట్ కంపెనీ. మొదట వ్యాల్యూ యాడెడ్ సర్వీసెస్ మార్కెట్‌లో అడుగుపెట్టింది. 2010 లో మొబైల్ రీఛార్జ్ ప్లాట్‌ఫామ్‌గా ఏర్పాటైంది. ఆ తర్వాత పేమెంట్స్, క్రెడిట్, ఇన్స్యూరెన్స్, ఇ-కామర్స్ లాంటి సేవల్లో అడుగుపెట్టింది. మరిన్ని వ్యాపారాల్లో అడుగుపెట్టేందుకు పేటీఎం ప్రణాళికలు రూపొందిస్తోంది.

  EPFO Investments: రికార్డ్ సృష్టించిన ఈపీఎఫ్‌ఓ... పెట్టుబడులపై 14.6 శాతం రిటర్న్స్

  పేటీఎం ఐపీఓ వస్తుందని వార్తలు వచ్చినప్పటి నుంచి ఇన్వెస్టర్లు ఆతృతగా ఎదురుచూశారు. రూ.18,300 కోట్ల ఐపీఓ అని ప్రకటించినప్పుడు భారతదేశంలోనే ఇది అతిపెద్ద ఐపీఓగా వర్ణించారు. ఇందులో రూ.8,300 కోట్లు ఫ్రెష్ ఇష్యూ కాగా, రూ.10,000 కోట్లు ఆఫర్ ఫర్ సేల్. అంటే ప్రస్తుత షేర్ హోల్డర్లు రూ.10,000 కోట్ల వాటాలను అమ్ముకుంటున్నారు. 100 మంది ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లకు రూ.8,235 కోట్ల షేర్లను కేటాయించింది పేటీఎం.

  పేటీఎం ఐపీఓకు ఇన్వెస్టర్ల నుంచి స్పందన కాస్త తక్కువగానే వచ్చింది. 1.89 సార్లు మాత్రమే సబ్‌స్క్రైబ్ అయింది. అయితే భారీ ఐపీఓ కావడంతో సబ్‌స్క్రిప్షన్ తక్కువగా కనిపించింది. పేటీఎం ఐపీఓ గురువారం 9 శాతం తక్కువకే లిస్ట్ అయింది. ఇష్యూ ధర రూ.2,150 కాగా ఎన్ఎస్ఈలో రూ.1,950 దగ్గర బీఎస్ఈలో రూ.1,955 దగ్గర లిస్ట్ అయింది.

  SBI Savings Account: మీ ఇంటి నుంచే ఎస్‌బీఐ అకౌంట్ ఓపెన్ చేయండి... ప్రాసెస్ ఇదే

  ఓ దశలో పేటీఎం షేర్ ధర రూ.1,586.35 వరకు పడిపోయింది. మధ్యాహ్నం 12.30 గంటలకు రూ.1,668 దగ్గర పేటీఎం షేర్ ట్రేడ్ అవుతోంది. లిస్టింగ్ రోజున ఇన్వెస్టర్లకు పేటీఎం ఐపీఓ నష్టాలను మిగిల్చింది. వ్యాల్యుయేషన్స్ ఎక్కువగా ఉండటమే షేర్ ధర పడిపోవడానికి కారణమని అంటున్నారు విశ్లేషకులు. ఇన్వెస్టర్లకు నష్టాలు వచ్చినా పేటీఎం వ్యాల్యుయేషన్ రూ.1 లక్ష కోట్లు దాటడం విశేషం.

  Published by:Santhosh Kumar S
  First published:

  Tags: IPO, Paytm, Stock Market

  ఉత్తమ కథలు