Paytm OTP: ఓటీపీ ఎందుకలా వస్తుందంటే... క్లారిటీ ఇచ్చిన పేటీఎం

Paytm OTP | మీరు ఎప్పుడైనా పేటీఎం ఓటీపీలు గమనించారా? మెసేజ్‌లో ఓటీపీ చివర్లో ఉంటుంది. దీని వెనుక ఓ కారణం ఉంది.

news18-telugu
Updated: May 29, 2020, 1:41 PM IST
Paytm OTP: ఓటీపీ ఎందుకలా వస్తుందంటే... క్లారిటీ ఇచ్చిన పేటీఎం
Paytm OTP: ఓటీపీ ఎందుకలా వస్తుందంటే... క్లారిటీ ఇచ్చిన పేటీఎం (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
మీరు పేటీఎం ఉపయోగిస్తున్నారా? రీఛార్జ్, బిల్స్, షాపింగ్ కోసం పేటీఎం ద్వారా పేమెంట్స్ చేస్తున్నారా? పేమెంట్ చేసేప్పుడు పేటీఎం నుంచి ఓటీపీ తప్పనిసరిగా వస్తుంది. అయితే ఇతర పేమెంట్ ప్లాట్‌ఫామ్స్, బ్యాంకులతో పోలిస్తే పేటీఎం పంపే ఓటీపీ కాస్త వేరుగా ఉంటుంది. మిగతా మెసేజెస్‌లో ఓటీపీ పైన కనిపిస్తే, పేటీఎం పంపించే మెసేజ్‌లో మాత్రం ఓటీపీ చివర్లో ఉంటుంది. దీని వల్ల యూజర్లు మెసేజ్ ఓపెన్ చేసి ఓటీపీ తెలుసుకోవాల్సి వస్తుంది. ఇలా ఓటీపీ చివర్లో పెట్టడానికి ఓ కారణముందని పేటీఎం క్లారిటీ ఇచ్చింది. సైబర్ నేరగాళ్ల మోసాలకు బ్రేక్ వేయడం కోసమే ఓటీపీని ఈ ఫార్మాట్‌లో పంపిస్తున్నట్టు పేటీఎం ఫౌండర్ విజయ్ శేఖర్ శర్మ క్లారిటీ ఇచ్చారు.

ఓసారి సైబర్ నేరగాళ్ల మోసాలను పరిశీలిస్తే ఎక్కువగా ఫోన్లు చేసి ఓటీపీ తెలుసుకొని మోసాలు చేస్తుంటారు. ఫోన్ కాల్‌లో ఉండగానే ఓటీపీ చెప్పమంటారు. అసలు వచ్చిన మెసేజ్‌లో ఏమి ఉందో తెలియకుండా ఓటీపీ చెప్పి మోసపోయినవాళ్లు చాలామంది ఉన్నారు. మెసేజ్ రాగానే ఓటీపీ పైనే కనిపిస్తుంది కాబట్టి చెప్పేస్తుంటారు. అదే ఓటీపీని చివర్లో పెడితే యూజర్లు తప్పకుండా ఆ మెసేజ్ ఓపెన్ చేస్తారు. అప్పుడు ఆ ఓటీపీ దేనికి సంబంధించినదో తెలిసిపోతుంది. ఇలా ఓటీపీ చివర్లో పెట్టడం వల్ల యూజర్లో ఓటీపీ షేర్ చేయడం తగ్గిపోయిందని పేటీఎం ఫౌండర్ విజయ్ శేఖర్ శర్మ వివరించారు. మీరు మీకు వచ్చిన ఓటీపీని ఇతరులతో షేర్ చేస్తే మోసపోయే ప్రమాదం ఉంటుంది జాగ్రత్త.

ఇవి కూడా చదవండి:

WhatsApp: కొత్త స్కామ్‌తో వాట్సప్ యూజర్లే టార్గెట్... మీరు మోసపోకండి ఇలా

JioFiber: వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారా? జియో ఫైబర్ ప్లాన్స్‌పై బెనిఫిట్స్ ఇవే

WhatsApp: కొత్త స్కామ్‌తో వాట్సప్ యూజర్లే టార్గెట్... మీరు మోసపోకండి ఇలా
First published: May 29, 2020, 1:40 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading