Paytm Credit Card: పేటీఎం నుంచి క్రెడిట్ కార్డ్... లావాదేవీలపై క్యాష్‌బ్యాక్

Paytm First Credit Card | 'పేటీఎం ఫస్ట్ క్రెడిట్ కార్డ్' కావాలనుకునే కస్టమర్లు పేటీఎం యాప్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ క్రెడిట్ కార్డ్ తీసుకున్నవారికి యాప్‌లోనే పేటీఎం ఫస్ట్ కార్డ్ పాస్‌బుక్ అందుబాటులో ఉంటుంది.

news18-telugu
Updated: May 15, 2019, 4:36 PM IST
Paytm Credit Card: పేటీఎం నుంచి క్రెడిట్ కార్డ్... లావాదేవీలపై క్యాష్‌బ్యాక్
Paytm Credit Card: పేటీఎం నుంచి క్రెడిట్ కార్డ్... లావాదేవీలపై క్యాష్‌బ్యాక్ (image: @vijayshekhar/twitter)
news18-telugu
Updated: May 15, 2019, 4:36 PM IST
డిజిటల్ వ్యాలెట్ సంస్థ పేటీఎం... క్రెడిట్ కార్డ్ బిజినెస్‌లోకి అడుగుపెట్టింది. సిటీబ్యాంక్ ఇండియాతో ఒప్పందం కుదుర్చుకొని క్రెడిట్ కార్డ్ తీసుకొస్తోంది. 'పేటీఎం ఫస్ట్ క్రెడిట్ కార్డ్' పేరుతో యూజర్లకు అందించనుంది పేటీఎం. ఈ కార్డుతో జరిపే అన్ని లావాదేవీలపై 1 శాతం క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. క్యాష్‌బ్యాక్ ప్రతీ నెల అకౌంట్‌లోకి క్రెడిట్ అవుతుంది. 'పేటీఎం ఫస్ట్ క్రెడిట్ కార్డ్'ను ఇండియాలోనే కాదు విదేశాల్లోనూ ఉపయోగించుకోవచ్చు. 'పేటీఎం ఫస్ట్ క్రెడిట్ కార్డ్' వార్షిక ఫీజు రూ.500. ఏడాదిలో రూ.50,000 ఖర్చు చేసినవారికి వార్షిక ఫీజు మినహాయింపు ఉంటుంది. అంతేకాదు డైనింగ్, షాపింగ్, ట్రావెల్‌పై ప్రత్యేకమైన ఆఫర్లుంటాయి.

Loading...
'పేటీఎం ఫస్ట్ క్రెడిట్ కార్డ్' కావాలనుకునే కస్టమర్లు పేటీఎం యాప్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ క్రెడిట్ కార్డ్ తీసుకున్నవారికి యాప్‌లోనే పేటీఎం ఫస్ట్ కార్డ్ పాస్‌బుక్ అందుబాటులో ఉంటుంది. అందులో పేటీఎం, సిటీ బ్యాంక్ ఎక్స్‌క్లూజీవ్ ఆఫర్ల వివరాలు కూడా తెలుసుకోవచ్చు. లావాదేవీలను అందులో చూసుకోవచ్చు. పేటీఎం ఫస్ట్ కార్డ్ కస్టమర్లు క్రెడిట్ కార్డుతో కనీసం రూ.10,000 ఖర్చుచేస్తే అంతే విలువైన పేటీఎం ప్రోమో కోడ్స్ మొదటి నాలుగు నెలల్లో లభిస్తాయి.

OnePlus 7 Series: అదిరిపోయిన వన్‌ప్లస్ 7, వన్‌ప్లస్ 7 ప్రో స్మార్ట్‌ఫోన్స్


ఇవి కూడా చదవండి:

IndiGo Sale: 10 లక్షల సీట్లు... రూ.999 నుంచి టికెట్లు

Aadhaar: ఆధార్ కార్డు వాడట్లేదా? డీయాక్టివేట్ అయిపోతుంది

BSF Jobs: బీఎస్ఎఫ్‌లో 1072 ఉద్యోగాలు... మొదలైన దరఖాస్తు ప్రక్రియ
First published: May 15, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...