క్రెడిట్ స్కోర్... ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ ఎక్కువగా చేసుకునేవారికి, క్రెడిట్ కార్డులు, లోన్స్ తీసుకునేవారికి క్రెడిట్ స్కోర్ మాట వింటే కాస్త గుబులే. క్రెడిట్ స్కోర్ బాగుండాలని కోరుకుంటారు. క్రెడిట్ స్కోర్ సరిగ్గా మెయింటైన్ చేసేందుకు ఆర్థిక క్రమశిక్షణను పాటిస్తుంటారు. ఏ లోన్ తీసుకోవాలనుకున్నా క్రెడిట్ స్కోర్ బాగుండాలి. బ్యాంకులు లోన్ లేదా క్రెడిట్ కార్డ్ ఇచ్చే ముందే క్రెడిట్ స్కోర్ ఎంత ఉందో పరిశీలిస్తుంటాయి. అయితే ఎప్పటికప్పుడు క్రెడిట్ స్కోర్ ఎంత ఉందో తెలుసుకోవడం కూడా మంచిది. గతంలో అంటే క్రెడిట్ స్కోర్ తెలుసుకునేందుకు డబ్బులు చెల్లించాల్సి వచ్చేది. ఇప్పుడు అనేక సంస్థలు ఉచితంగానే క్రెడిట్ స్కోర్ అందిస్తున్నాయి. అలాంటి సంస్థల్లో పేటీఎం కూడా చేరిపోయింది. పేటీఎం కూడా తమ యూజర్లకు ఉచితంగా క్రెడిట్ స్కోర్ అందిస్తున్నాయి. మరి మీరు కూడా మీ క్రెడిట్ స్కోర్ ఎంతో తెలుసుకోవాలంటే... పేటీఎంలో ఇలా చెక్ చేసుకోండి.
Read this: Credit Card Benefits: మీ దగ్గర క్రెడిట్ కార్డ్ ఉందా? 10 లాభాలు ఇవే...
మీ ఫోన్‌లో ఉన్న పేటీఎం యాప్ ఓపెన్ చేయండి.
లెఫ్ట్ టాప్‌లో త్రీ లైన్స్ క్లిక్ చేయండి.
ఆప్షన్స్‌లో 'My Credit Score' ట్యాబ్ పైన క్లిక్ చేయండి.
మీ పేరు, ఫోన్ నెంబర్, ఇమెయిల్ ఐడీ లాంటి వివరాలు సరిగ్గా ఉన్నాయో లేదో చూసుకోండి.
మీ వివరాలను యాక్సెస్ చేసేందుకు పేటీఎంకు అనుమతి ఇవ్వాల్సి ఉంటుంది.
చివరగా సబ్మిట్ బటన్ క్లిక్ చేస్తే మీ క్రెడిట్ స్కోర్ ఎంతో కనిపిస్తుంది.
కేవలం క్రెడిట్ స్కోర్ మాత్రమే కాదు... మీరు ఇప్పటివరకు తీసుకున్న క్రెడిట్ కార్డులు, లోన్ల వివరాలు కూడా ఉంటాయి.
Read this: క్రెడిట్ కార్డులు ఎక్కువున్నాయా? సిబిల్ స్కోర్‌కు ముప్పేనా?
పేటీఎం ఉచితంగా అందిస్తున్న సర్వీస్ ఇది. మీరు ఎన్నిసార్లైనా మీ క్రెడిట్ స్కోర్ చెక్ చేసుకోవచ్చు. అయితే తరచూ చెక్ చేసుకోవడం వల్ల క్రెడిట్ స్కోర్ ఏమీ మారదు. మీ క్రెడిట్ స్కోర్ తక్కువగా ఉంటే ఎలా పెంచుకోవాలో టిప్స్ కూడా ఇస్తుంది పేటీఎం. అంతేకాదు... పేటీఎం పోస్ట్ పెయిడ్ ఆఫర్ కూడా అందిస్తోంది. మీకు గరిష్టంగా రూ.30,000 వరకు పోస్ట్ పెయిడ్ ఎలిజిబిలిటీ లభిస్తుంది.
Photos: హీరో నుంచి 3 కొత్త ప్రీమియం బైక్స్... అదిరిపోయే ఫీచర్స్
ఇవి కూడా చదవండి:
Credit Score: క్రెడిట్ స్కోర్ తగ్గిందా? ఇలా పెంచుకోవచ్చు
Credit Card Limit: క్రెడిట్ లిమిట్ ఎప్పుడు పెంచుకోవాలో తెలుసా?
Credit Card: క్రెడిట్ కార్డు వాడేప్పుడు ఈ 8 తప్పులు చేస్తున్నారా?
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Credit cards, Paytm, Personal Finance