news18-telugu
Updated: July 1, 2019, 1:24 PM IST
Good News: ఎలాంటి ట్రాన్సాక్షన్ ఛార్జీలు లేవు... ప్రకటించిన పేటీఎం
(ప్రతీకాత్మక చిత్రం)
పేటీఎం యూజర్లకు శుభవార్త. వ్యాలెట్, యూపీఐ, నెట్ బ్యాంకింగ్, కార్డ్ పేమెంట్లపై ఎలాంటి ట్రాన్సాక్షన్ ఛార్జీలు, ఫీజులు లేవని పేటీఎం ప్రకటించింది. జూలై 1 నుంచి క్రెడిట్ కార్డ్ పేమెంట్లపై 1%, డెబిట్ కార్డులపై 0.9%, యూపీఐ, నెట్ బ్యాంకింగ్‌పై రూ.12-15 వరకు ట్రాన్సాక్షన్ ఛార్జీలు ఉంటాయని రెండుమూడు రోజులుగా వార్తలు రావడం పేటీఎం యూజర్లలో ఆందోళనకు కారణమైంది. ఇన్నాళ్లూ ఎలాంటి ఛార్జీలు లేకుండా ఉపయోగించిన ఈ సేవలకు, ఇకపై ఫీజులు చెల్లించాల్సి వస్తుందన్న కలవరం మొదలైంది. అయితే ప్రత్యామ్నాయంగా అనేక యాప్స్, ప్లాట్‌ఫామ్స్ ఈ సేవలు అందిస్తున్నాయి. పేటీఎం యూజర్లు ఇతర ప్లాట్‌ఫామ్స్ వైపు వెళ్లే పరిస్థితి నెలకొంది. దీంతో పేటీఎం మాతృసంస్థ అయిన వన్97 కమ్యూనికేషన్స్ లిమిటెడ్ స్పందించింది. కస్టమర్లు ఎలాంటి పేమెంట్ పద్ధతి ఉపయోగించినా ట్రాన్సాక్షన్ ఫీజు ఉండదని ట్విట్టర్లో స్పష్టం చేసింది. పేటీఎం కస్టమర్లు గతంలో లాగానే ఎలాంటి ఫీజు లేకుండా ఈ సేవల్ని ఉపయోగించుకోవచ్చని తెలిపింది.
ఇప్పుడే కాదు భవిష్యత్తులో కూడా ఎలాంటి ఫీజు విధించమని స్పష్టం చేసింది పేటీఎం. ప్రస్తుతం ప్రచారంలో ఉన్న ఊహాగానాలను కొట్టిపారేసింది. కస్టమర్లు ఎలాంటి ఫీజు లేకుండా తమ ప్లాట్ఫామ్లో సేవల్ని ఉపయోగించుకోవచ్చని చెబుతోంది. అయితే విద్యాసంస్థలు, యుటిలిటీ సర్వీస్ ప్రొవైడర్స్ కొన్ని క్రెడిట్ కార్డ్ ఛార్జీలను భరించడానికి సిద్ధంగా లేవు. దీంతో ఆ భారం కస్టమర్లపై పడుతోంది. అందుకే అలాంటి సందర్భాల్లో డెబిట్ కార్డ్స్ లేదా యూపీఐ ఉపయోగించి ఈ ఛార్జీలను తప్పించుకోవచ్చని సూచిస్తోంది పేటీఎం.
Motorola One Vision: మోటోరోలా వన్ విజన్... ఎలా ఉందో చూడండి
ఇవి కూడా చదవండి:
Good News: వాట్సప్ వాడితే ఆరోగ్యానికి మంచిదే... ఎలాగో తెలుసా?
IRCTC: హైదరాబాద్-గోవా టూర్... తక్కువ ధరకే ప్యాకేజీ
Tata Sky: టాటాస్కై సెట్-టాప్ బాక్సుల ధరలు తగ్గాయి
Published by:
Santhosh Kumar S
First published:
July 1, 2019, 1:24 PM IST