Paytm offer: పేటీఎంలో రూ.50 లక్షల ఫ్లైట్ ఓచర్లు... గెలుచుకోండి ఇలా

Paytm Cashback Blockbuster offer | మొదటి బస్ టికెట్ బుక్ చేయగానే ఈ ఆఫర్ యాక్టివేట్ అవుతుంది. రోజుకు ఒక బస్ టికెట్‌కు మాత్రమే ఆఫర్ వర్తిస్తుంది.

news18-telugu
Updated: April 30, 2019, 6:07 PM IST
Paytm offer: పేటీఎంలో రూ.50 లక్షల ఫ్లైట్ ఓచర్లు... గెలుచుకోండి ఇలా
Paytm offer: పేటీఎంలో రూ.50 లక్షల ఫ్లైట్ ఓచర్లు... గెలుచుకోండి ఇలా (image: Paytm)
news18-telugu
Updated: April 30, 2019, 6:07 PM IST
డిజిటల్ వ్యాలెట్ సేవలు అందించే పేటీఎం... బస్ టికెట్లు బుక్ చేసేవారికి భారీ ఆఫర్లు ప్రకటించింది. 'పేటీఎం క్యాష్‌బ్యాక్ బ్లాక్ బస్టర్' పేరుతో ఆఫర్ ప్రారంభించిన పేటీఎం... రూ.50 లక్షల డిస్కౌంట్ ఓచర్లు గెలుపొందే అవకాశం కల్పిస్తోంది. 2019 జూన్ వరకు ఈ ఆఫర్ వర్తిస్తుంది. అప్పట్లోగా బస్ టికెట్లు బుక్ చేసుకునేవారు రూ.50 లక్షల విలువైన ఫ్లైట్ ఓచర్లు గెలుచుకోవచ్చు. 'పేటీఎం క్యాష్‌బ్యాక్ బ్లాక్ బస్టర్' ఆఫర్‌‌లో 10 బస్ టికెట్లు బుక్ చేసిన వారికి ఖచ్చితంగా రూ.5,500 విలువైన ఓచర్లు లభిస్తాయి. మొదటి బస్ టికెట్ బుక్ చేయగానే ఈ ఆఫర్ యాక్టివేట్ అవుతుంది. రోజుకు ఒక బస్ టికెట్‌కు మాత్రమే ఆఫర్ వర్తిస్తుంది. రూ.5,500 విలువైన ఓచర్ల వివరాలివే...

Read this: Jio offer: రూ.251 రీఛార్జ్‌పై ఐపీఎల్ టికెట్లు గెలుచుకునే అవకాశం... మరెన్నో బహుమతులు

1వ టికెట్ బుకింగ్‌పై రూ.100 ఫుడ్ ఓచర్.

2వ టికెట్ బుకింగ్‌పై రూ.200 మూవీ ఓచర్.


3వ టికెట్ బుకింగ్‌పై రూ.300 రీఛార్జ్ ఓచర్.
4వ టికెట్ బుకింగ్‌పై రూ.400 బస్ ఓచర్.
5వ టికెట్ బుకింగ్‌పై రూ.500 ఓయో ఓచర్.
Loading...
6వ టికెట్ బుకింగ్‌పై రూ.600 హోటల్ ఓచర్.
7వ టికెట్ బుకింగ్‌పై రూ.700 ఎలక్ట్రిసిటీ ఓచర్.
8వ టికెట్ బుకింగ్‌పై రూ.800 బ్యాక్‌ప్యాక్ ఓచర్.
9వ టికెట్ బుకింగ్‌పై రూ.900 ఫ్యాషన్ ఓచర్.
10వ టికెట్ బుకింగ్‌పై రూ.1,000 ఫ్లైట్ ఓచర్.

గెలుచుకున్న ఓచర్లను 90 రోజుల్లో ఉపయోగించుకోవాలి. ఇక నెలలో 3 బస్ టికెట్లు బుక్ చేసినవారికి ఫ్రీ ఫ్లైట్ టికెట్ లక్కీ డ్రా కాంటెస్ట్‌కు అర్హత లభిస్తుంది. లక్కీ డ్రాలో 100 మంది విజేతలు రూ.50 లక్షల విలువైన ఫ్లైట్ టికెట్స్ గెలుచుకోవచ్చు. ప్రతీ విజేతకు రూ.50,000 విలువైన ఫ్లైట్ టికెట్ ఓచర్లు లభిస్తాయి. ఈ ఆఫర్‌కు సంబంధించిన పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Photos: అదిరిపోయిన ఒప్పో ఎఫ్11 ప్రో అవెంజర్స్ ఎడిషన్

ఇవి కూడా చదవండి:

Aadhaar Alert: ప్లాస్టిక్ ఆధార్ కార్డ్ చెల్లదు... ఏం చేయాలో తెలుసుకోండి

Indian Railways: మీ రైలు టికెట్‌పై జర్నీ డేట్ మార్చుకోవచ్చు ఇలా

WhatsApp IPL Stickers: వాట్సప్‌లో క్రికెట్ స్టిక్కర్స్... డౌన్‌లోడ్ చేసుకోండి ఇలా
First published: April 30, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...