Paytm is Back: గూగుల్ ప్లేస్టోర్ లోకి పేటీఎం తిరిగి ప్రత్యక్షం...

కొన్ని గంటల పాటు గూగుల్ ప్లే స్టోర్ నుండి వైదొలిగిన తరువాత, మొబైల్ వాలెట్ అప్లికేషన్ పేటీఎం ఆండ్రాయిడ్ యాప్ మరోసారి తిరిగి అదే ప్లాట్‌ఫాంలోకి వచ్చింది. Paytm అధికారిక ట్విట్టర్ ద్వారా శుక్రవారం సాయంత్రం దాని గురించి సమాచారం ఇచ్చింది.

news18-telugu
Updated: September 18, 2020, 11:03 PM IST
Paytm is Back: గూగుల్ ప్లేస్టోర్ లోకి పేటీఎం తిరిగి ప్రత్యక్షం...
Paytm: (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
Paytm is Back: కొన్ని గంటల పాటు గూగుల్ ప్లే స్టోర్ నుండి వైదొలిగిన తరువాత, మొబైల్ వాలెట్ అప్లికేషన్ పేటీఎం ఆండ్రాయిడ్ యాప్ మరోసారి తిరిగి అదే ప్లాట్‌ఫాంలోకి వచ్చింది. Paytm అధికారిక ట్విట్టర్ ద్వారా శుక్రవారం సాయంత్రం దాని గురించి సమాచారం ఇచ్చింది. ఇంతకుముందు, గూగుల్ ప్లే స్టోర్ దాని ద్వారా గ్యాంబ్లింగ్ ఆరోపణలపై paytm యాప్ ను దాని ప్లాట్‌ఫాం నుంచి తొలగించింది. గూగుల్ ప్లే స్టోర్ గ్యాంబ్లింగ్ వంటి యాప్స్ కు మద్దతు ఇవ్వదని, జూదానికి సంబంధిత విధి విధానాలను ఉల్లంఘించినందుకు Paytm తొలగించామని తెలిపింది. కొన్ని గంటల క్రితం, గూగుల్‌తో ఈ సమస్యపై తాము పనిచేస్తున్నామని పేటీఎం వినియోగదారులకు హామీ ఇచ్చింది. వినియోగదారుల యొక్క Paytm Wallet లో ఉన్న డబ్బు పూర్తిగా సురక్షితమని కూడా తెలిపింది.

ఇదిలా ఉంటే పేటీఎం ఇటీవల 'పేటీఎం క్రికెట్ లీగ్' ను ప్రారంభించింది. ఇందులో క్రికెట్ పట్ల మక్కువ ఉన్న కస్టమర్లను ఆకర్షించేందుకు క్యాష్‌బ్యాక్‌లను గెలుచుకునేందుకు కొన్ని గేమ్స్ ను ఇందులో పొందుపరిచింది. దీని కింద, వినియోగదారులు ప్రతి లావాదేవీకి ఆటగాళ్ల స్టిక్కర్లను స్వీకరిస్తారు. దాన్ని సేకరించిన తరువాత, వారికి క్యాష్‌బ్యాక్ లభిస్తుంది.




జూదానికి సంబంధించిన కొన్ని నిబంధనలను ఉల్లంఘించారనే ఆరోపణలపై ఈ యాప్‌ను ప్లే స్టోర్ నుంచి తొలగిస్తున్నట్లు శుక్రవారం మధ్యాహ్నం గూగుల్ వారికి తెలియజేసినట్లు పేటీఎం తెలిపింది. ఈ కారణంగా, గూగుల్ ప్లే స్టోర్ నుండి పేటీఎం ఆండ్రాయిడ్ యాప్ మాయం అయ్యింది.అయితే ప్రస్తుతం Paytm యాప్ నుండి క్యాష్‌బ్యాక్ భాగం తాత్కాలికంగా తొలగించారు. Paytm నిబంధనల ప్రకారం Google విధానాలను ఉల్లంఘించబడకుండా తమ యాప్ నుంచి క్యాష్‌బ్యాక్ భాగాన్ని తాత్కాలికంగా తొలగించామని తెలిపంది.
Published by: Krishna Adithya
First published: September 18, 2020, 11:03 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading