పెట్రోల్ కొంటారా? పేటీఎం సూపర్ ఆఫర్!

పెట్రోల్ ధరలు భగ్గుమంటున్నాయి. సెంచరీ వైపు పరుగులు తీస్తూ వాహనదారులకు చుక్కలు చూపిస్తున్నాయి. అందుకే వాహనదారులకు పేటీఎం ఓ మంచి ఆఫర్ ప్రకటించింది.

news18-telugu
Updated: September 14, 2018, 4:10 PM IST
పెట్రోల్ కొంటారా? పేటీఎం సూపర్ ఆఫర్!
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
హైదరాబాద్‌లో శుక్రవారం లీటర్ పెట్రోల్ ధర. రూ.86.18. ఆగస్ట్ 31న రూ.83.30 మాత్రమే ఉంది. అప్పట్నుంచి పెట్రోల్ ధరలు రోజురోజుకీ పెరిగిపోతూనే ఉన్నాయి. మరి మీరు కూడా పెరిగిపోతున్న పెట్రోల్, డీజిల్ ధరల షాక్‌తో కోలుకోలేకపోతున్నారా? మీ కోసం పేటీఎం సూపర్ ఆఫర్ ప్రకటించింది. పెట్రోల్, డీజిల్ కొనేవారికి ఏకంగా రూ.7,500 క్యాష్‌ బ్యాక్ లభిస్తుంది. ఇప్పుడు మొదలయ్యే ఈ ఆఫర్‌ను 2019 ఆగస్ట్ 1 వరకు ఉపయోగించుకోవచ్చు.

పేటీఎం ఆఫర్ ఎలా వినియోగించుకోవాలి?

మీ నెంబర్‌తో పేటీఎంలో రిజిస్టర్ కావాలి.
మీ పేటీఎం వ్యాలెట్‌లో క్యాష్ జమ చేయాలి.
పెట్రోల్ బంకు దగ్గర పేటీఎంతో పేమెంట్ చేసినప్పుడు రూ.7500 క్యాష్ బ్యాక్ ఆఫర్ మెసేజీ వస్తుంది.
పేటీఎం యాప్‌లో 'క్యాష్‌బ్యాక్ ఆఫర్స్' సెక్షన్‌లో ఆఫర్ యాక్టివేట్ చేసుకోవాలి.
ఆ తర్వాత పెట్రోల్ బంకులో మిగతా ట్రాన్సాక్షన్స్ అన్నీ అదే నెంబర్‌ నుంచి చేయాలి.

11, 21, 31, 41వ ట్రాన్సాక్షన్స్ పూర్తి చేసుకున్న తర్వాత 48 గంటల్లో ప్రోమో కోడ్ లభిస్తుంది.
ప్రోమో కోడ్‌ని పేటీఎం యాప్‌లో రీడీమ్ చేసుకోవచ్చు.
మినిమమ్ ట్రాన్సాక్షన్ రూ.50 ఉండాలి.
రూ.7,500 వరకు క్యాష్‌ బ్యాక్ పొందొచ్చు.

ఇవి కూడా చదవండి:

పెట్రోల్ పొదుపు చేయడానికి 20 మార్గాలు

పెట్రోల్ బండి కన్నా ఇ-వెహికిల్ బెటరా?

పర్సనల్ లోన్: ఈ 5 విషయాలు గుర్తుంచుకోండి!

మీరు ఖచ్చితంగా తీసుకోవాల్సిన పాలసీలివి!
Published by: Santhosh Kumar S
First published: September 14, 2018, 4:10 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading