Home /News /business /

PAY MORE FOR LPG CYLINDER FROM TODAY AS RATES HIKED FOR 6TH STRAIGHT TIME NK

LPG Rate Hike : పెరిగిన వంటగ్యాస్ ధరలు... వరుసగా ఆరోసారి...

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

LPG Rate Today In Rupees Per Cylinder : పేద, మధ్య తరగతి ప్రజలు తినీ, తినకా డబ్బు పోగేసుకుంటూ ఉంటారు. ఇంతలో ఇలాంటి ధరల పెరుగుదలలు... ఆ డబ్బును హారతి కర్పూరం చేసేస్తున్నాయి.

    LPG Rate Today In Rupees Per Cylinder : వంటగ్యాస్ ధర మరోసారి పెరిగిందనే వార్త వింటే చాలు... పేద, మధ్యతరగతి కుటుంబాల గుండెల్లో గ్యాస్ బండలు పేలుతాయి. ప్రజలు తాము తినీ, తినకా కాస్తో, కూస్తో డబ్బును భవిష్యత్ అవసరాల కోసం పోగేసుకుంటూ ఉంటారు. ఇంతలో ఇలాంటి ధరల పెరుగుదలలు... ఆ డబ్బును హారతి కర్పూరం చేసేస్తున్నాయి. తాజాగా గతేడాది ఆగస్ట్ నుంచీ ఇప్పటివరకూ వరుసగా ఆరుసార్లు వంటగ్యాస్ ధరలు పెరిగాయి. కొత్తగా పెరిగిన ధరలు ఇవాళ్టి నుంచే అమల్లోకి వచ్చాయి. ఢిల్లీలో సిలిండర్ రేటు ఆరు నెలల్లో రూ.284 రూపాయలు పెరిగింది. ఢిల్లీలో వంటగ్యాస్ సిలిండర్‌ ధర రూ.144.5గా ఉంటే... ముంబైలో అది రూ.145 పెరిగింది. ఇండేన్ బ్రాండ్ పేరుతో వంటగ్యాస్ సప్లై చేస్తున్న ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్... ఫిబ్రవరి 12 నుంచీ... సబ్సిడీ కాని వంటగ్యాస్ ధరలు పెంచుతున్నట్లు ప్రకటించింది. అన్నంతపనీ చేసింది. ఢిల్లీలో ఇప్పుడు పెరిగిన ధరలతో సిలిండర్ రేటు రూ.858.5కి చేరగా... ముంబైలో అది రూ.829.5 అయ్యింది. దేశవ్యాప్తంగా మెట్రో నగరాల్లో పెరిగిన వంటగ్యాస్ ధరలను పరిశీలిస్తే...

































    14.2 కేజీల సిలిండర్ ధర
    మెట్రో నగరంప్రస్తుత ధరపాత ధర
    ఢిల్లీ858.50714.00
    కోల్‌కతా896.00747.00
    ముంబై829.50684.50
    చెన్నై881.00734.00

    ఈ నెల నుంచీ 19 కేజీల సిలిండర్ రేట్లు ఢిల్లీలో... రూ.1466 నుంచీ రూ.1450కి చేరాయి. ముంబైలో రూ.1190 నుంచీ రూ.1241 అయ్యాయి. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం లబ్దిదారులకు ఏడాదికి 14 సిలిండర్ల వరకూ సబ్సిడీ ధరకు ఇస్తోంది. అంతకంటే ఎక్కువ సిలిండర్లు కావాలంటే మాత్రం... సబ్సిడీ లేని ధరతో కొనుక్కోవాల్సిందే. ప్రభుత్వం ఇస్తున్న సబ్సిడీ ధర నెల నెలా మారుతోంది. అంతర్జాతీయంగా ఎల్పీజీ ధరల్లో వచ్చే మార్పుల్ని బట్టీ ఈ సబ్సిడీ కూడా మారుతోంది.
    Published by:Krishna Kumar N
    First published:

    Tags: LPG Cylinder

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు