Covid-19 Insurance: కరోనా నుంచి కోలుకున్న వారికి షాక్.. వారికి ఇన్సూరెన్స్ పాలసీలు ఇవ్వమంటున్న కంపెనీలు.. ఎందుకంటే..

ప్రతీకాత్మక చిత్రం

కరోనా నుంచి కోలుకున్న వారికి బీమా కంపెనీలు షాక్ ఇస్తున్నాయి. వారికి పాలసీ ఇవ్వడానికి ఆయా కంపెనీలు అసలు ఒప్పుకోవడం లేదు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

  • Share this:
కోవిడ్–19 చాలా మందికి ఆర్థిక పాఠాలు నేర్పించింది. ముఖ్యంగా బీమా ప్రాముఖ్యతను మహమ్మారి తెలియజేసింది. ఆపత్కాలంలో పరిస్థితులను ఎదుర్కొనేందుకు ఎలా సిద్దంగా ఉండాలో తెలిపింది. దీంతో ప్రతి ఒక్కరు హెల్త్, టర్మ్ ఇన్సూరెన్స్​ కోసం ఆరాతీస్తున్నారు. గతంలో కంటే పాలసీలు తీసుకున్న వారి సంఖ్య దాదాపు 25 శాతం పెరగడమే ఇందుకు నిదర్శనం. అయితే ఆయా కంపెనీలు మాత్రం అన్ని జాగ్రత్తలను తీసుకొని పాలసీదారులను చేర్చుకుంటున్నాయి. వారికి కొత్త కండీషన్లు పెడుతున్నాయి. నిజానికి ఏ బీమా సంస్థలైనా పాలసీ తీసుకుంటామంటే.. పరుగెత్తుకుంటూ వస్తాయి. అలాంటిది కరోనా మహమ్మారి పరిస్థితులను తలకిందులు చేసింది. కరోనా నుంచి కోలుకున్న వారికి పాలసీ ఇవ్వడానికి కంపెనీలు ససేమిరా అంటున్నాయి. వైరస్​ నుంచి కోలుకున్న తర్వాత బీమా పాలసీ తీసుకోవడానికి వెళ్లిన చాలా మందికి ఈ సమస్య ఎదురవుతోంది. ఈ విషయంలో బీమా సంస్థలను కూడా తప్పు పట్టలేని పరిస్థితులు ఉన్నాయి. కరోనా కారణంగా క్లెయిమ్​ల​ సంఖ్య పెరిగిందని, దీని వల్ల బారీగా నష్టం వాటిల్లుతోందని ఇన్సూరెన్స్​ కంపెనీలు గగ్గోలు పెడుతున్నాయి.
కరోనా నేపథ్యంలో RBI కీలక నిర్ణయాలు.. వైద్యరంగానికి రూ. 50 వేల కోట్ల నిధులు.. పూర్తి వివరాలివే..
Trains Cancel: రైల్వే ప్రయాణికులకు అలర్ట్.. ఈ నెలలో ఆ 25 రైళ్లు రద్దు.. పూర్తి వివరాలివే

అందువల్లే కరోనా నుంచి కోలుకున్నప్పటికీ, వారికి ఇతర అనారోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉందనే ఉద్దేశంతో పాలసీలు ఇవ్వడానికి వెనకడుగు వేస్తున్నాయి. దీంతో టర్మ్​ పాలసీలతో పాటు ఆరోగ్య బీమా, జీవిత బీమా పాలసీల విషయంలోనూ సంస్థలు లేనిపోని షరతులు విధిస్తున్నాయి. పాలసీ ఫారమ్​ను అంగీకరించడానికి ఆరు నెలల వరకు కూల్​ ఆఫ్​ వ్యవధిని విధిస్తున్నాయి.

ఆరోగ్య బీమా విషయంలో..
ఆరోగ్య బీమా పాలసీ కోరే వ్యక్తి హెల్త్ హిస్టరీని కంపెనీలు క్షుణ్నంగా తనిఖీ చేస్తున్నాయి. కోవిడ్-19 నుంచి కోలుకున్న సందర్భంలో ఇచ్చిన డిశ్చార్జ్​ డాక్సుమెంట్స్​ను పరిశీలించి​ నిర్ణయం తీసుకుంటున్నాయి. పాలసీ కోరోవారు రిక్వెస్ట్​ ఫారమ్ నింపిన తర్వాత, ఇన్సూరెన్స్​ బృందం వారి వద్దకు వెళ్లి మరీ ఆరోగ్యం గురించి తెలుసుకోవడం విశేషం. ఆరోగ్య రికార్డుల ఆధారంగా, వారి రిక్వెస్ట్​ ఫారమ్‌ను అంగీకరించాలా? తిరస్కరించాలా? లేదా వాయిదా వేయాలా? అనే విషయాలపై నిర్ణయం తీసుకుటున్నాయి. కోవిడ్–19 నుంచి కోలుకున్నప్పటికీ మళ్లీ వైద్య పరీక్షలు చేయించుకోవాలని బీమా సంస్థలు కోరుతున్నాయి.

అయితే ఈ ప్రక్రియ పూర్తయినా, వారి రిక్వెస్ట్​ ఫారమ్​ను అంగీకరించడానికి ‘కూల్- ఆఫ్ పీరియడ్’ను విధిస్తున్నాయి. కోవిడ్​ బాధితులు వైరస్​ నుంచి కోలుకున్నప్పటికీ వారిలో అది దీర్ఘకాలిక సమస్యలకు దారితీస్తోంది. కండరాల బలహీనత, ఊపిరితిత్తులు సరిగా పనిచేయకపోవడం వంటి సమస్యలు తలెత్తుతున్నాయి. అంతేకాకుండా, మానసిక సమస్యలు కూడా తలెత్తే అవకాశాలున్నట్లు కొన్ని పరిశోధనలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో కొత్త పాలసీలు ఇచ్చేందుకు.. అందులోనూ కరోనా నుంచి కోలుకున్న వారి విషయంలో బీమా సంస్థలు వెనకడుగు వేస్తున్నాయి. క్లెయిమ్​ల సంఖ్య పెరిగితే సంస్థలు మూతపడే అవకాశం ఉందని, కాబట్టి ముందు జాగ్రత్తగా ఇలాంటి చర్యలు తప్పడం లేదని బీమా సంస్థలు చెబుతున్నాయి.
Published by:Nikhil Kumar S
First published: