హ్యాకర్ల దెబ్బకు కింభో వెనక్కి...!

news18
Updated: June 11, 2018, 6:41 PM IST
హ్యాకర్ల దెబ్బకు కింభో వెనక్కి...!
patanjali kimbho app screen shot
  • News18
  • Last Updated: June 11, 2018, 6:41 PM IST
  • Share this:
కింభో..!  పతంజలి ఆధ్వర్యంలో వచ్చిన సోషల్ మెసేజింగ్ యాప్..!  ఒక్క రోజుల్లోనే ఎన్నో సంచనాలు.... మరెన్నో వివాదాలు దీన్ని చుట్టుముట్టాయి. ఇకపై భారత్ మాట్లాడుతుంది అనే ట్యాగ్‌లైన్‌తో కింభో మార్కెట్‌లోకి వచ్చింది.   ప్లేస్టోర్ నుంచి పెద్ద మొత్తంలో దీన్ని డౌన్‌లోడ్ చేసుకున్నారు. నకిలీ కింభో యాప్‌లు కూడా కుప్పలు తెప్పలుగా వెలిశాయి. ఐతే ఇందులో సెక్యూరిటీ లోపాలు ఉన్నాయని హ్యాకర్లు వెల్లడించడం.. ఆ వెంటనే ప్లే స్టోర్ నుంచి  మాయమవడం వెంటవెంటనే జరిగిపోయాయి.

కింభోలో లోపాలు:

కింభో యాప్‌ స్క్రీన్ షాట్లలో పాకిస్తాన్ నటి మావ్రా హొకేన్ ఫొటో వాడడంపై దుమారం రేగింది. స్వదేశీ మంత్రం జపిస్తూ పాకిస్తానీ మోడల్ ఫొటో ఎలా పెడతారని నెజిట్లు ఏకి పారేశారు. అంతేకాదు బోలో యాప్‌ను చూసి కాపీ కొట్టారనే  విమర్శలూ వచ్చాయి. దాన్ని ఉన్నది ఉన్నదిట్లుగా దింపారి..కాపీ క్యాట్ అంటూ నెటిజన్లు చురకలంటించారు. ఇక ముఖ్యంగా కింభో భద్రతా విపత్తని అంతర్జాతీయ సైబర్ నిపుణలు, హ్యాకర్లు విమర్శించారు. యూజర్ల డేటాను తాము యాక్సెస్ చేయ గలుగుతున్నామని వెల్లడించారు. దీంతో యాప్‌పై దుమారం  రేగింది.



ఇలా అన్ని విషయాల్లోనూ  సోషల్ మీడియాలో కింభో యాప్ ట్రోల్ కావడంతో పతంజలి గ్రూప్ వెనక్కితీసుకుంది. గూగుల్ ప్లే స్టోర్‌తో పాటు యాపిల్ ఐఓఎస్ నుంచి తొలగించింది. ఐతే దీనిపై పతంజలి గ్రూప్ వివరణ  ఇచ్చింది. టెస్ట్ రన్‌లో భాగంగానే లాంచ్ చేశామని.. ఊహించిన దాని కంటే ఎక్కువ స్పందన వచ్చిందని తెలిపింది.  అందుకే సర్వర్లు అప్‌గ్రేడ్ చేస్తున్నామని తెలిపింది. పూర్తిస్థాయిలో సిద్ధమయ్యాక అధికారికంగా లాంచ్ చేస్తామని వెల్లడించింది. అప్పటి వరకు కింభో యాప్ ప్లే స్టోర్‌లలో లభ్యం కాదని తెలిపింది. నకిలీ కింభో యాప్‌లకుత తాము బాధ్యత వహించబోమని పతంజలి ప్రతినిధి తిజారావాలా ట్విటర్‌లో వెల్లడించారు.
Published by: Shiva Kumar Addula
First published: June 1, 2018, 12:36 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading