స్థానిక ఉత్పత్తులను ప్రోత్సహించాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. లోకల్‌కు వోకల్‌గా మారి గ్లోబల్ బ్రాండ్‌గా మార్చాలని దేశప్రజలకు సూచించారు. ఈ నేపథ్యంలో ప్రముఖ ఆయుర్వేద ఔషధాల తయారీ సంస్థ పతంజలి.. స్వదేశీ ఉత్పత్తుల కోసం ప్రత్యేక ఈ కామర్స్ ఫ్లాట్‌ఫామ్‌ని తీసుకురాబోతోంది. OrderMe పేరుతో ఈకామర్స్ పోర్టల్‌ను లాంచ్ చేయనుంది. మరో 15 రోజుల్లోనే దేశ ప్రజలను అందుబాటులోకి తీసుకొస్తామని పతంజలి ఆయుర్వేద సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ఆచార్య బాలకృష్ణ పేర్కొన్నారు.
OrderMe ద్వారా పతంజలి ఉత్పత్తులతో పాటు సమీప దుకాణాల్లోని స్వదేశీ ఉత్పత్తులను నేరుగా ఇంటికి చేరవేస్తామని పతంజలి తెలిపింది. ఆర్డర్ చేసిన 2 గంటల్లోనే సరుకులను డెలివరీ చేస్తామని వెల్లడించింది. అంతేకాదు దాని ద్వారా రోజు 24గంటల పాటు ఫ్రీ మెడికల్ అడ్వైస్‌ను కూడా ప్రజలకు అందుబాటులో ఉంచుతామని సంస్థ ప్రతినిధులు తెలిపారు. సుమారు 1500 మంది డాక్టర్ల ద్వారా ఉచితంగానే సలహాలు, సూచనలు తీసుకొచ్చని చెప్పారు. యోగా క్లాసులు కూడా అందిస్తామని పేర్కొన్నారు.
Published by:Shiva Kumar Addula
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.