Passport: పాస్‌పోర్ట్‌కు అప్లై చేస్తున్నారా? ఈ నకిలీ సైట్లతో జాగ్రత్త

Passport Seva | ఎట్టిపరిస్థితుల్లో ఈ వెబ్‌సైట్లు ఓపెన్ చేయొద్దని, బ్యాంక్ అకౌంట్ వివరాలు వెల్లడించొద్దని హెచ్చరిస్తోంది విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ.

news18-telugu
Updated: July 11, 2019, 2:31 PM IST
Passport: పాస్‌పోర్ట్‌కు అప్లై చేస్తున్నారా? ఈ నకిలీ సైట్లతో జాగ్రత్త
Passport: పాస్‌పోర్ట్‌కు అప్లై చేస్తున్నారా? ఈ నకిలీ సైట్లతో జాగ్రత్త (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
పాస్‌పోర్ట్... విదేశాలకు వెళ్లడానికి కావాల్సిన ముఖ్యమైన డాక్యుమెంట్. ఇటీవల పాస్‌పోర్ట్‌కు దరఖాస్తు చేస్తున్నవారి సంఖ్య పెరిగిపోతోంది. దీంతో నకిలీ వెబ్‌సైట్లు కూడా పుట్టుకొస్తున్నాయి. పాస్‌పోర్ట్ సేవలు అందిస్తామంటూ డజన్లకొద్దీ వెబ్‌సైట్లు ఆన్‌లైన్‌లో కనిపిస్తున్నాయి. ఈ వెబ్‌సైట్లు దరఖాస్తుదారుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నట్టు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ దృష్టికి వచ్చింది. అందుకే పౌరులను అప్రమత్తం చేస్తోంది విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ. నకిలీ వెబ్‌సైట్లను నమ్మొద్దని హెచ్చరిస్తోంది. పాస్‌పోర్ట్ సేవలు పొందడానికి అధికారిక వెబ్‌సైట్‌ మాత్రమే ఉపయోగించాలని కోరుతోంది. పాస్‌పోర్ట్ సేవల పేరుతో పుట్టుకొచ్చిన నకిలీ వెబ్‌సైట్ల వివరాలను వెల్లడించింది. ఎట్టిపరిస్థితుల్లో ఈ వెబ్‌సైట్లు ఓపెన్ చేయొద్దని, బ్యాంక్ అకౌంట్ వివరాలు వెల్లడించొద్దని హెచ్చరిస్తోంది. ఈ నకిలీ వెబ్‌సైట్లు .org, .in, .com డొమైన్‌తో ఉంటాయి. ప్రభుత్వ వెబ్‌సైట్ మాత్రం .gov.in డొమైన్‌తో ఉంటుంది.

విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ గుర్తించిన నకిలీ వెబ్‌సైట్లు ఇవే...



www.indiapassport.org
www.indiapassport.org
www.passport-seva.in
www.online-passportindia.com
www.passportindiaportal.inwww.passport-india.in
www.applypassport.org

ఈ వెబ్‌సైట్ల ద్వారా మీరు పాస్‌పోర్ట్ పొందడానికి ప్రయత్నిస్తే నిండా మునగాల్సిందే. అందుకే ప్రభుత్వ వెబ్‌సైట్ www.passportindia.gov.in ఉపయోగించుకోవాలి. లేదా mPassport Seva మొబైల్ యాప్‌ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ప్రభుత్వం పాస్‌పోర్ట్ కోసం తీసుకునే ఛార్జీల వివరాలివే.

కొత్త పాస్‌పోర్ట్ (36 పేజీలు) లేదా రెన్యువల్- రూ.1500
కొత్త పాస్‌పోర్ట్ (60 పేజీలు) లేదా రెన్యువల్- రూ.2000
18 ఏళ్లలోపై మైనర్లకు కొత్త పాస్‌పోర్ట్ (36 పేజీలు) లేదా రెన్యువల్- రూ.1000
పాస్‌పోర్ట్ (36 పేజీలు) రీప్లేస్‌మెంట్- రూ.3000
పాస్‌పోర్ట్ (60 పేజీలు) రీప్లేస్‌మెంట్- రూ.3500
పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికెట్- రూ.500
పాస్‌పోర్ట్ తత్కాల్‌లో పొందాలంటే అదనంగా రూ.2000 చెల్లించాల్సి ఉంటుంది.

Redmi 7A: రూ.5,799 ధరకే రెడ్‌మీ 7ఏ... ఎలా ఉందో చూడండి


ఇవి కూడా చదవండి:

Paytm: ఇక పేటీఎం నుంచి స్కూల్ అడ్మిషన్లు, స్కాలర్‌షిప్స్

IRCTC: హైదరాబాద్ టు కాశ్మీర్... ఐఆర్‌సీటీసీ టూర్ ప్యాకేజీ

PAN-Aadhaar: పాన్, ఆధార్ కార్డుల కొత్త నిబంధనలివే... తెలుసుకోండి
Published by: Santhosh Kumar S
First published: July 11, 2019, 2:31 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading