PARENTS CAN APPLY FOR PAN CARD ON BEHALF OF THEIR CHILDREN BELOW 18 YEARS KNOW HOW SS
PAN Card: పిల్లలకు కూడా పాన్ కార్డ్ తీసుకోవచ్చు... ఎలాగో తెలుసుకోండి
PAN Card: పిల్లలకు కూడా పాన్ కార్డ్ తీసుకోవచ్చు... ఎలాగో తెలుసుకోండి
(ప్రతీకాత్మక చిత్రం)
PAN Card for Minors | పిల్లల పేరు మీద పాన్ కార్డ్ తీసుకోవచ్చన్న విషయం చాలామందికి తెలియదు. మైనర్ల పేరు మీద పాన్ కార్డ్ (PAN Card) ఎలా తీసుకోవాలి? పిల్లలకు పాన్ కార్డ్ తీసుకోవడం వల్ల లాభమేంటీ? తెలుసుకోండి.
పాన్ కార్డ్... ఆర్థిక లావాదేవీలు జరపడానికి కావాల్సిన ముఖ్యమైన డాక్యుమెంట్. భారీ స్థాయిలో లావాదేవీలు జరిపితే పాన్ కార్డును (PAN Card) ప్రూఫ్‌గా చూపించాల్సి ఉంటుంది. కొన్ని లావాదేవీలకు (Financial Transactions) పాన్ కార్డ్ తప్పనిసరి. ముఖ్యంగా 18 రకాల లావాదేవీలు జరిపినప్పుడు పాన్ కార్డ్ డాక్యుమెంట్ సబ్మిట్ చేయాలని ఆదాయపు పన్ను శాఖ వెల్లడించింది. ఆ 18 రకాల లావాదేవీలు ఏవో తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి. పాన్ కార్డును 18 ఏళ్లు దాటిన పౌరులు ఎవరైనా తీసుకోవచ్చని తెలుసు. ఆధార్ నెంబర్ ఉంటే చాలు... పాన్ కార్డును 10 నిమిషాల్లో తీసుకోవచ్చు. అయితే 18 ఏళ్ల లోపువారికి కూడా పాన్ కార్డు తీసుకునే వెసులుబాటు కల్పించింది ఆదాయపు పన్ను శాఖ.
పిల్లల పేర్ల మీదా ఆస్తులను మెయింటైన్ చేసేవాళ్లు ఉంటారు. వారి పేర్ల మీద బ్యాంక్ అకౌంట్లు కూడా తెరుస్తుంటారు. తల్లిదండ్రులు తమ పెట్టుబడులకు పిల్లల్ని నామినీగా వెల్లడిస్తే వారి పేరు మీద పాన్ కార్డ్ ఉండటం తప్పనిసరి. కాబట్టి 18 ఏళ్ల లోపు వారు కూడా పాన్ కార్డు తీసుకోవచ్చు. ఇందుకోసం కొన్ని నియమనిబంధనలు ఉన్నాయి. మైనర్లు పాన్ కార్డ్ కోసం స్వయంగా దరఖాస్తు చేయకూడదు. వారి తల్లిదండ్రులు దరఖాస్తు చేయాల్సి ఉంటుంది.
ఒకప్పుడు పాన్ కార్డ్ తీసుకోవాలంటే పెద్ద ప్రాసెస్ ఉండేది. కానీ ఇప్పుడు ఆన్లైన్లో సులువుగా పాన్ కార్డ్ కోసం దరఖాస్తు చేయొచ్చు. 18 ఏళ్లు దాటినవారు మాత్రమే కాదు... 18 ఏళ్లలోపు మైనర్ల తరఫున వారి తల్లిదండ్రులు పాన్ కార్డుకు అప్లై చేయొచ్చు. ఎలా అప్లై చేయాలో తెలుసుకోండి.
పిల్లలకు పాన్ కార్డ్ తీసుకోవాలనుకుంటే నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీ లిమిటెడ్ (NSDL) అధికారిక వెబ్సైట్ https://www.tin-nsdl.com/ ఓపెన్ చేయాలి. Services లో PAN పైన క్లిక్ చేయాలి. Application for allotment of New PAN (Form 49A) సెక్షన్లో Apply పైన క్లిక్ చేయాలి. పాన్‌కార్డ్ తీసుకోవాలనుకునే పిల్లల వివరాలతో పాటు తల్లిదండ్రుల వివరాలు ఎంటర్ చేయాలి. తల్లిదండ్రుల ఫోటో, సంతకం అప్లోడ్ చేయాలి. వీటితో పాటు ఐడీ ప్రూఫ్, అడ్రస్ ప్రూఫ్ కోసం పిల్లల ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్, పాస్‌పోర్ట్, తల్లిదండ్రుల ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్, పాస్‌పోర్ట్, ఓటర్ ఐడీలో ఏదైనా ఓ డాక్యుమెంట్ సబ్మిట్ చేయాలి.
డాక్యుమెంట్స్ సబ్మిట్ చేసిన తర్వాత చివరగా రూ.107 చెల్లించి ఫామ్ సబ్మిట్ చేయాలి. రిసిప్ట్ నెంబర్ వస్తుంది. ఈ నెంబర్‌తో అప్లికేషన్ ట్రాక్ చేయొచ్చు. వెరిఫికేషన్ తర్వాత పాన్ కార్డ్ జారీ అవుతుంది. 15 రోజుల్లో పాన్ కార్డ్ పోస్టులో వస్తుంది.
Published by:Santhosh Kumar S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.