హోమ్ /వార్తలు /బిజినెస్ /

Mutual Fund: పాపులర్ మ్యూచువల్ ఫండ్ మళ్లీ ప్రారంభం... నెలకు రూ.1,000 ఇన్వెస్ట్ చేయొచ్చు

Mutual Fund: పాపులర్ మ్యూచువల్ ఫండ్ మళ్లీ ప్రారంభం... నెలకు రూ.1,000 ఇన్వెస్ట్ చేయొచ్చు

Mutual Fund | మీరు మ్యూచువల్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారా? పరాగ్ పారిఖ్ ఫండ్ హౌజ్‌కు (Parag Parikh) చెందిన పాపులర్ మ్యూచువల్ ఫండ్ మళ్లీ ప్రారంభమైంది. నెలకు రూ.1,000 ఇన్వెస్ట్ చేయొచ్చు. ఈ ఫండ్ వివరాలు తెలుసుకోండి.

  మ్యూచువల్ ఫండ్స్‌లో రెగ్యులర్‌గా ఇన్వెస్ట్ చేసేవారికి పరాగ్ పారిఖ్ మ్యూచువల్ ఫండ్స్ పేరు వినే ఉంటారు. ఈ మ్యూచువల్ ఫండ్ హౌజ్‌కు చెందిన ఓ మ్యూచువల్ ఫండ్ బాగా పాపులర్ అయింది. పరాగ్ పారిఖ్ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్‌కు (Parag Parikh Flexi Cap Fund) బాగా పేరొచ్చింది. అయితే ఈ ఫండ్‌లోకి ఇన్వెస్ట్‌మెంట్స్ తీసుకోవడాన్ని ఆపేసింది ఫండ్ హౌజ్. గుడ్ న్యూస్ ఏంటంటే... ఈ మ్యూచువల్ ఫండ్‌లోకి మళ్లీ ఇన్వెస్ట్‌మెంట్స్‌ని (Mutual Fund Investments) ఆహ్వానిస్తోంది కంపెనీ. మార్చి 15 నుంచి ఫ్రెష్ ఇన్వెస్ట్‌మెంట్స్ తీసుకుంటోంది. అయితే ఎప్పటివరకు ఇన్వెస్ట్‌మెంట్స్ తీసుకుంటారన్న స్పష్టత లేదు. పరాగ్ పారిఖ్ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ 2013లో ప్రారంభమైంది. గతంలో పరాగ్ పారిఖ్ లాంగ్ టర్మ్ ఈక్విటీ ఫండ్‌ పేరుతో అందుబాటులో ఉండేది. అప్పట్లో రూ.152 కోట్లు మేనేజ్ చేసేది. కానీ ఇప్పుడు రూ.20,000 కోట్లు మేనేజ్ చేస్తోంది.

  పరాగ్ పారిఖ్ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ గత ఏడేళ్లుగా వార్షికంగా 14 శాతం రిటర్న్స్ ఇవ్వడం విశేషం. గత ఐదేళ్ల కాలంలో చూస్తే 17.3 శాతం, గత మూడేళ్లలో 24.4 శాతం రిటర్న్స్ ఇచ్చింది ఈ ఫండ్. సమంజసమైన వ్యాల్యుయేషన్లలో లభించే మంచి క్వాలిటీ ఉన్న కంపెనీల్లో ఈ ఫండ్ ఇన్వెస్ట్ చేస్తుంది. పరాగ్ పారిఖ్ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ భారతీయ స్టాక్ మార్కెట్లతో పాటు అంతర్జాతీయ మార్కెట్లలో కూడా ఇన్వెస్ట్ చేస్తుంది. 25 నుంచి 30 శాతం వరకు అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్లలో ఇన్వెస్ట్ చేస్తుంది.

  March Deadlines: అలర్ట్... మార్చి 31 లోపు పూర్తి చేయాల్సిన 6 ముఖ్యమైన పనులు ఇవే

  అయితే ప్రస్తుతం పరాగ్ పారిఖ్ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్‌లో ఫ్రెష్‌గా తీసుకుంటున్న ఇన్వెస్ట్‌మెంట్స్‌ని కేవలం భారతీయ మార్కెట్లలో ఇన్వెస్ట్ చేయనుంది. అంతర్జాతీయ మార్కెట్లలో పెట్టుబడులకు సంబంధించి అనుమతులు రావాల్సి ఉంది. పరాగ్ పారిఖ్ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్‌లో కనీసం రూ.1,000 నుంచి ఇన్వెస్ట్ చేయొచ్చు. సిస్టమెటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ (SIP) చేయాలనుకుంటే నెలకు కనీసం రూ.1,000 చొప్పున జమ చేయొచ్చు. క్వార్టర్లీ సిప్ ఆప్షన్ కూడా ఉంది. మూడు నెలలకు ఓసారి కనీసం రూ.3,000 ఇన్వెస్ట్ చేయొచ్చు.

  Old Vehicle: పాత బండి, కార్ వాడుతున్నారా? ఏప్రిల్ 1 నుంచి షాక్ తప్పదు

  మ్యూచువల్ ఫండ్‌లో దీర్ఘకాలం పెట్టుబడులు పెడితే మంచి రిటర్న్స్ వస్తాయి. మార్కెట్లలో వందల్లో మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి. వాటిలో మంచి ఫండ్ ఎంచుకుంటేనే మంచి రిటర్న్స్ వస్తాయి. మ్యూచువల్ ఫండ్ ఎంచుకోవడానికి ఫైనాన్షియల్ అడ్వైజర్, మ్యూచువల్ ఫండ్ అడ్వైజర్ సలహాలు తీసుకోవచ్చు.

  First published:

  Tags: Investment Plans, Mutual Funds, Personal Finance

  ఉత్తమ కథలు