హోమ్ /వార్తలు /బిజినెస్ /

Nagar Kurnool: బొప్పాయి సాగు బాగుబాగు.., ఏడాదికి రెండు పంటలతో రైతుకు మంచి లాభాలు

Nagar Kurnool: బొప్పాయి సాగు బాగుబాగు.., ఏడాదికి రెండు పంటలతో రైతుకు మంచి లాభాలు

X
బొప్పాయి

బొప్పాయి సాగుతో రైతులకు లాభాలు

వాణిజ్య పంటల సాగుతో అన్నదాత (Farmers) కు ఆశించిన లాభాలు రావడం లేదు. దీంతో అధిక దిగుబడి, లాభాలు వచ్చే పంటలపై దృష్టిపెడుతున్నారు. అయితే సాంప్రదాయ పంటల కంటే పండ్ల తోటల సాగులో లాభాలు ఉంటాయని ఆ దిశగా ఆసక్తి చూపుతున్నారు రైతులు.

  • News18 Telugu
  • Last Updated :
  • Nagarkurnool, India

Naveen Kumar, News18, Nagarkurnool 

వాణిజ్య పంటల సాగుతో అన్నదాత (Farmers) కు ఆశించిన లాభాలు రావడం లేదు. దీంతో అధిక దిగుబడి, లాభాలు వచ్చే పంటలపై దృష్టిపెడుతున్నారు. అయితే సాంప్రదాయ పంటల కంటే పండ్ల తోటల సాగులో లాభాలు ఉంటాయని ఆ దిశగా ఆసక్తి చూపుతున్నారు రైతులు. ఇందులో భాగంగానే నాగర్‌ కర్నూల్ జిల్లా ( Nagar Kurnool) పెద్ద కొత్తపల్లి మండలం చంద్రకల్ గ్రామానికి చెందిన రైతు శేఖరయ్య బొప్పాయి పంట సాగు చేస్తున్నారు. ఈ పంట వేసిన అనంతరం 5 నెలల్లోనే పూతకు వచ్చి ఆరో నెలలో కాయలు కాయడం మొదలవుతుందని రైతు వివరించాడు. త్వరగా పంట చేతికి రావడంతో మంచి లాభాలు కూడా గడించవచ్చని చెప్పుకొచ్చాడు.

రైతు శేఖరయ్య ప్రస్తుతం ఆరు ఎకరాల్లో బొప్పాయి పంటను సాగు చేశాడు. మొక్కలు నాటేందుకు రూ. 13 లక్షల వరకు ఖర్చు వచ్చిందని తెలిపారు. పంట నాటిన సమయం నుంచి క్రమ పద్ధతి ద్వారా శాస్త్రవేత్తలు సూచించిన విధంగా ఎరువులు మందులు డిఏపి వాడాడు. ప్రతి నెలా క్రమం తప్పకుందాం కావాల్సిన ఎరువులు అందించాడు. వీటితో పాటు డ్రిప్ సిస్టం ద్వారా బొప్పాయి తోటకు నీటిని సరఫరా చేశారు. తద్వారా ఐదు నెలల్లోనే పంట పూతకు వచ్చింది. 8 నెలలకు పంట చేతికి వచ్చిందన్నాడు. మార్కెట్లో బొప్పాయి పండ్లకు మంచి డిమాండ్ ఉండడంతో కిలో రూ. 30 నుంచి రూ. 40 వరకు ధర పలుకుతుందని తాము తోట వద్ద రూ. 25కు విక్రయిస్తున్నట్లు రైతు శేఖరయ్య తెలిపాడు.

ఇది చదవండి: ఆధునిక పద్ధతుల్లో మిర్చి సాగు చేస్తున్న రైతు.., ఎకరాకు 30 క్వింటాళ్ల దిగుబడి ఎలాగో తెలుసా?

గత ఐదు సంవత్సరాల నుంచి పండ్ల తోట సాగు చేస్తున్నామని గతేడాది మామిడి తోటను సాగు చేయడం ద్వారా కాస్త నష్టాలు రావడంతో ఈ ఏడాది బొప్పాయి తోటను ఎంచుకున్నామని వివరించాడు. మామిడి తోటలో వచ్చిన నష్టాలను బొప్పాయి సాగు ద్వారా పూడ్చుకోవచ్చనే ఉద్దేశంతో సాగు చేశామని చెప్పుకొచ్చాడు.

అయితే పంటలో ఆశించిన మేర దిగుబడులు వచ్చినప్పటికీ ఈ ఏడూ వర్షాభావ పరిస్థితులు అధికంగా ఉండడంవల్ల బొప్పాయి చెట్లు దెబ్బతిని కొంత నష్టం వస్తుందని అన్నారు. వర్షాలు అధికంగా లేకపోతే మంచి ఆదాయం వచ్చేదని చెప్పారు. తాము పండించిన పంటను తోట వద్దనే విక్రయిస్తూ ఉన్నామని ఇతర పండ్ల వ్యాపారులకు హోల్సేల్ ధరకు అమ్ముతున్నట్లు రైతు శేఖరయ్య తెలిపాడు.

First published:

Tags: Local News, Nagarkarnol district, Telangana

ఉత్తమ కథలు