• HOME
  • »
  • NEWS
  • »
  • BUSINESS
  • »
  • PAN CARD WILL BECOME INOPERATIVE FROM APRIL 1 IF YOU DO NOT LINK YOUR AADHAAR NUMBER BEFORE MARCH 31 KNOW HOW TO LINK PAN CARD AND AADHAAR NUMBER SS

PAN Card: ఏప్రిల్ 1 నుంచి మీ పాన్ కార్డ్ పనిచేయదు... వెంటనే ఇలా చేయండి

PAN Card: ఏప్రిల్ 1 నుంచి మీ పాన్ కార్డ్ పనిచేయదు... వెంటనే ఇలా చేయండి

PAN Card: ఏప్రిల్ 1 నుంచి మీ పాన్ కార్డ్ పనిచేయదు... వెంటనే ఇలా చేయండి (ప్రతీకాత్మక చిత్రం)

PAN Aadhaar Linking | మీ దగ్గర పాన్ కార్డ్ ఉందా? ఏప్రిల్ 1 నుంచి మీ పాన్ కార్డ్ పనిచేయకపోవచ్చు. వెంటనే మీ పాన్, ఆధార్ నెంబర్ లింక్ చేయండి. ఎలాగో తెలుసుకోండి.

  • Share this:
    మీ పాన్ కార్డుకు ఆధార్ నెంబర్ లింక్ చేయకపోతే ఏప్రిల్ 1 నుంచి మీ పాన్ కార్డ్‌కు ఎలాంటి విలువ ఉండదు. పాన్ నెంబర్, ఆధార్ నెంబర్ లింక్ చేయాలని కేంద్ర ప్రభుత్వం చాలాకాలంగా కోరుతున్న సంగతి తెలిసిందే. అనేకసార్లు చివరి తేదీని కూడా పొడిగించింది. ప్రస్తుతం పాన్, ఆధార్ నెంబర్లను లింక్ చేయడానికి 2021 మార్చి 31 చివరి తేదీ. అప్పట్లోగా మీ పాన్ నెంబర్, ఆధార్ నెంబర్ లింక్ చేయాల్సిందే. లేకపోతే మీ దగ్గర పాన్ కార్డ్ ఉన్నా లావాదేవీల కోసం వాడుకోలేరు. ఒకవేళ మీరు ఇప్పటికే మీ పాన్ కార్డ్, ఆధార్ నెంబర్ లింక్ చేసినట్టైతే స్టేటస్ తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి. మీ పాన్ నెంబర్, ఆధార్ నెంబర్ లింక్ అయిందో లేదో తెలుస్తుంది.

    ఒకవేళ మీరు గడువు తర్వాత పాన్ నెంబర్, ఆధార్ నెంబర్ లింక్ చేసినట్టైతే రూ.1,000 లేట్ ఫీజు చెల్లించాల్సి ఉంటుందని లోక్‌సభలో ప్రవేశపెట్టిన ఫైనాన్స్ బిల్ 2021 లో నిబంధనను విధించింది కేంద్ర ప్రభుత్వం. దీంతో పాటు ఆదాయపు పన్ను చట్టం ప్రకారం ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయడానికి పాన్ కార్డ్ తప్పనిసరి. పాన్ కార్డ్ లేనివాళ్లు సెక్షన్ 139ఏఏ ప్రకారం తమ ఆధార్ నెంబర్‌ను తప్పనిసరిగా వెల్లడించాలి. మరి మీరు ఇప్పటివరకు పాన్ నెంబర్, ఆధార్ నెంబర్ లింక్ చేయకపోతే ఈ స్టెప్స్ ఫాలో అవండి.

    PAN-Aadhaar Link Status: మీ ఆధార్ నెంబర్ పాన్ కార్డుతో లింకైందా? 30 సెకన్లలో తెలుసుకోండి ఇలా

    PAN Card: పాన్ కార్డులో తప్పులున్నాయా? ఈ యాప్‌లో అప్లై చేయండి ఇలా

    ముందుగా https://www.incometaxindiaefiling.gov.in/ వెబ్‌సైట్ ఓపెన్ చేయండి.
    హోమ్ పేజీలో Link Aadhaar లింక్ పైన క్లిక్ చేయండి.
    కొత్త పేజీ ఓపెన్ అవుతుంది.
    అందులో మీ పాన్ నెంబర్, ఆధార్ నెంబర్, ఆధార్ కార్డులో ఉన్న పేరు ఎంటర్ చేయాలి.
    ఆ తర్వాత క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి Link Aadhaar పైన క్లిక్ చేయాలి.
    మీ పాన్‌ కార్డుతో ఆధార్ నెంబర్ వెంటనే లింక్ అవుతుంది.

    ఎస్ఎంఎస్ ద్వారా కూడా మీ ఆధార్ నెంబర్‌ను పాన్ కార్డుతో లింక్ చేయొచ్చు. ఇందుకోసం సూచించిన ఫార్మాట్‌లో ఎస్ఎంఎస్ పంపాలి. UIDPAN<space><12 అంకెల ఆధార్><space><10 అంకెల పాన్> అని టైప్ చేసి 567678 లేదా 56161 నెంబర్లకు ఎస్ఎంఎస్ పంపాలి. ఉదాహరణకు మీ ఆధార్ నెంబర్ 111111111111, మీ పాన్ నెంబర్ AAAAA2222A అనుకుంటే మీరు UIDPAN 111111111111 AAAAA2222A అని టైప్ చేయాల్సి ఉంటుంది.

    e-PAN Card Download: పాన్ కార్డు మర్చిపోయారా? ఇ-పాన్ డౌన్‌లోడ్ చేయడం ఈజీ

    PAN card: మీ దగ్గర పాన్ కార్డ్ ఉందా? ఈ చిన్న మిస్టేక్‌తో రూ.10,000 ఫైన్ కట్టాల్సి రావొచ్చు

    బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయడానికి, మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయడానికి, స్టాక్ మార్కెట్‌లో ఇన్వెస్టింగ్ కోసం డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేయడానికి పాన్ కార్డ్ తప్పనిసరి. రూ.50,000 కన్నా ఎక్కువ లావాదేవీలకు తప్పనిసరిగా పాన్ నెంబర్ ఇవ్వాలి.
    Published by:Santhosh Kumar S
    First published:

    అగ్ర కథనాలు