గతంలో పాన్ కార్డ్ భారీ ఆర్థిక లావాదేవీలు జరిపేవారు మాత్రమే తీసుకునేవారు. కానీ ఇప్పుడు పాన్ కార్డ్ (PAN Card) సామాన్యులకు కూడా అవసరం అవుతోంది. ఎక్కువ లావాదేవీలు జరిపేవారికి పాన్ కార్డ్ తప్పనిసరి. 18 ఆర్థిక లావాదేవీలకు పాన్ కార్డును సబ్మిట్ చేయాలని ఆదాయపు పన్ను శాఖ చెబుతోంది. ఆ 18 రకాల లావాదేవీల గురించి తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి. అయితే పాన్ కార్డ్ మొదట తీసుకున్నప్పుడు ఉన్న ఫోటో ఎప్పటికీ అలాగే ఉంటుంది. ఫోటో పాతబడిపోవడంతో మార్చుకోవాలని అనుకుంటూ ఉంటారు పాన్ కార్డ్ హోల్డర్లు. పాన్ కార్డుపై ఫోటోను మార్చడం పెద్ద కష్టమైన పనేమీ కాదు. చాలా సింపుల్‌గా ఫోటో అప్డేట్ చేయొచ్చు. ఫోటో మాత్రమే కాదు... సంతకం కూడా మార్చొచ్చు. ఎలాగో తెలుసుకోండి.
PAN Card: పిల్లలకు కూడా పాన్ కార్డ్ తీసుకోవచ్చు... ఎలాగో తెలుసుకోండి
Step 1- ముందుగా నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీ లిమిటెడ్ (NSDL) ఆన్లైన్ సర్వీసెస్ వెబ్సైట్ https://www.onlineservices.nsdl.com/paam/endUserRegisterContact.html ఓపెన్ చేయాలి.
Step 2- అప్లికేషన్ టైప్‌లో Changes or corrections in the existing PAN Data సెలెక్ట్ చేయాలి.
Step 3- కేటగిరీలో ఇండివిజ్యువల్ ఆప్షన్స్ సెలెక్ట్ చేయాలి.
Step 4- ఆ తర్వాత పేరు, పుట్టిన తేదీ, ఇమెయిల్ ఐడీ, మొబైల్ నెంబర్, పాన్ నెంబర్ లాంటి వివరాలు ఎంటర్ చేయాలి.
Step 5- క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి సబ్మిట్ చేయాలి.
Step 6- ఆ తర్వాత కేవైసీ ఆప్షన్ సెలెక్ట్ చేయాలి.
Step 7- ఫోటో మార్చాలనుకుంటే Photo Mismatch ఆప్షన్ సెలెక్ట్ చేయాలి.
Step 8- ఆ తర్వాత వివరాలన్నీ ఎంటర్ చేయాలి.
Step 9- ఐడీ ప్రూఫ్, అడ్రస్ ప్రూఫ్, డేట్ ఆఫ్ బర్త్‌కు సంబంధించిన డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి.
Step 10- డిక్లరేషన్ బాక్స్ టిక్ చేసి సబ్మిట్ చేయాలి.
Step 11- సంతకం మార్చాలనుకుంటే Signature Mismatch సెలెక్ట్ చేసి పైన చెప్పిన స్టెప్స్ ఫాలో కావాలి.
Step 12- మీ అడ్రస్ ఇండియాలో ఉంటే రూ.101, విదేశాల్లో ఉంటే రూ.1011 ఛార్జీలు చెల్లించాలి.
Step 13- ట్రాన్సాక్షన్ పూర్తైన తర్వాత 15 అంకెల అక్నాలెడ్జ్మెంట్ నెంబర్ జనరేట్ అవుతుంది.
Step 14- అక్నాలెడ్జ్మెంట్ నెంబర్‌తో స్టేటస్ చెక్ చేయొచ్చు.
PAN Card: నకిలీ పాన్ కార్డును ఎలా గుర్తించాలో తెలుసా? ఈ టిప్స్ ఫాలో అవండి
పాన్ కార్డుపై పేరు, పుట్టిన తేదీ లాంటి వివరాలు అప్డేట్ చేయడానికి పైన చెప్పిన స్టెప్స్ ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఆన్లైన్లోనే పాన్ కార్డ్ వివరాలు అప్డేట్ చేసే వెసులుబాటు ఉంది. కావాల్సిన డాక్యుమెంట్స్ అప్లోడ్ చేస్తే చాలు. మీ పాన్ కార్డ్ వివరాలు అప్డేట్ చేసిన తర్వాత సాధారణంగా అప్లికేషన్ ప్రాసెస్ పూర్తవడానికి రెండువారాల సమయం పడుతుంది. ఆ తర్వాత పాన్ కార్డ్ మీ రిజిస్టర్డ్ అడ్రస్‌కు పోస్టు ద్వారా వస్తుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: PAN, PAN card, Personal Finance