హోమ్ /వార్తలు /బిజినెస్ /

Aadhaar Link: వెంటనే ఆధార్ కార్డుతో లింక్ చేసుకోండి.. లేదంటే ఆ సర్వీసులు పొందలేరు!

Aadhaar Link: వెంటనే ఆధార్ కార్డుతో లింక్ చేసుకోండి.. లేదంటే ఆ సర్వీసులు పొందలేరు!

 Aadhaar Link: వెంటనే ఆధార్ కార్డుతో లింక్ చేసుకోండి.. లేదంటే ఆ సర్వీసులు పొందలేరు!

Aadhaar Link: వెంటనే ఆధార్ కార్డుతో లింక్ చేసుకోండి.. లేదంటే ఆ సర్వీసులు పొందలేరు!

Aadhaar Card | మీరు పాన్ కార్డు కలిగి ఉన్నారా? అయితే వెంటనే ఆధార్ కార్డుతో లింక్ చేసుకోండి. లేదంటే మాత్రం ఇబ్బందులు పడాల్సి వస్తుంది. గడువు దగ్గరకు వస్తోంది.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad | Visakhapatnam

Pan Card | మీరు పాన్ కార్డు కలిగి ఉన్నారా? అయితే కచ్చితంగా ఒక పని పూర్తి చేసుకోవాలి. లేదంటే మాత్రం ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఏంటి ఆ పని అని అనుకుంటున్నారా? ఈ నెల చివరి కల్లా కచ్చితంగా పాన్ కార్డును ఆధార్ (Aadhaar) కార్డుతో లింక్ చేసుకోవాలి. లేదంటే మాత్రం మీ పాన్ కార్డు (Pan) చెల్లుబాటు కాదు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే చాలా సార్లు గడువు పొడిగించింది. అందువల్ల మీరు ఇంకా ఈ రెండు డాక్యుమెంట్లను అనుసంధానం చేసుకోకపోతే.. వెంటనే ఆ పని పూర్తి చేసుకోవడం ఉత్తమం.

దేశంలో దాదాపు 61 కోట్ల మంది పాన్ కార్డులు కలిగి ఉన్నారు. అయితే వీటిల్లో 48 కోట్ల పాన్ కార్డులు ఆధార్ కార్డుతో లింక్ అయ్యాయి. అంటే ఇంకా 13 కోట్ల పాన్ కార్డులు ఆధార్ కార్డుతో అనుసంధానం కాలేదని చెప్పుకోవాలి. మార్చి 31లోపు వీటిని ఆధార్ కార్డుతో లింక్ చేసుకోవాలి. అనుసంధానం చేసుకోకపోతే మాత్రం పాన్ కార్డు చెల్లుబాటు కాదు.

రైతులకు శుభవార్త.. బ్యాంక్ అకౌంట్లలోకి రూ.42 వేలు, ఇలా పొందండి!

మీ వద్ద పాన్ కార్డు ఉన్నా కూడా పాన్ కార్డు లేనట్లే అవుతుంది. అప్పుడు జరిమానాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. బ్యాంక్ అకౌంట్ తెరవలేకపోవచ్చు. ఇంకా ఐటీఆర్ దాఖలు చేయలేం. ఇలా చాలా సర్వీసులు స్తంభించిపోతాయి. అలాగే టీడీఎస్ కట్ అయ్యేటప్పుడు ఎక్కువగా కట్ అవుతుంది. పాన్ కార్డు ఉంటే తక్కువ కట్ అవుతుంది. ఇలా ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది.

రూ.200 పొదుపుతో రూ.2 కోట్లు వెనకేయండిలా!

అందువల్ల మీరు పాన్ కార్డు కలిగి ఉన్నట్లు అయితే వెంటనే పాన్ కార్డును ఆధార్ కార్డుతో లింక్ చేసుకోండి. లేదంటే మాత్రం కష్టాలు తప్పవు. మీరు సులభంగానే ఆధార్ పాన్ లింక్ చేసుకోవచ్చు. దీని కోసం ఇన్‌కమ్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్‌ వెబ్‌సైట్‌లోకి వెళ్లాల్సి ఉంటుంది. అక్కడ పాన్ ఆధార్ కార్డు లింక్ ఉంటుంది. దీనిపై క్లిక్ చేసి ఆధార్ కార్డుతో పాన్ కార్డు అనుసంధానం చేసుకోవచ్చు. అంతేకాకుండా మీరు మీ పాన్ కార్డును ఆధార్ కార్డుతో లింక్ చేసుకున్నారా? లేదా? అనే విషయాన్ని కూడా మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. అందువల్ల మీరు ఇంకా లింక్ చేసుకోకపోతే ఇప్పుడైనా ఆధార్ పాన్ లింక్ చేసుకోండి. ఇప్పటికే లింక్ చేసుకున్నట్లు అయితే లింక్ అయ్యాయా? లేదా? అని స్టేటస్ చెక్ చేసుకోండి. కాగా ఆధార్ కార్డుతో పాన్ కార్డు లింక్ చేసుకునే వారు ఒక విషయం గుర్తించుకోవాలి. రెండింటిలోనూ వివరాలు ఒకేలా ఉండాలి. వేర్వేరుగా ఉంటే అనుసంధానం కావు.

First published:

Tags: Aadhaar Card, Income tax, ITR Filing, PAN card, UIDAI

ఉత్తమ కథలు