
(ప్రతీకాత్మక చిత్రం)
ఆధార్‌తో పాన్ కార్డు అనుసంధానం చేయని వారికి కేంద్రం పెద్ద షాక్ ఇవ్వనుంది. మార్చి 31లోగా మీ పాన్ కార్డుతో ఆధార్ కార్డు జత చేయకపోతే, ఇక మీ పాన్ కార్డు పని చేయదని ఆదాయ పన్ను శాఖ వెల్లడించింది.

ఆధార్‌తో పాన్ కార్డు అనుసంధానం చేయని వారికి కేంద్రం పెద్ద షాక్ ఇవ్వనుంది. మార్చి 31లోగా మీ పాన్ కార్డుతో ఆధార్ కార్డు జత చేయకపోతే, ఇక మీ పాన్ కార్డు పని చేయదని ఆదాయ పన్ను శాఖ వెల్లడించింది.

ఇప్పటికే పాన్ మరియు ఆధార్లను అనుసంధానించడానికి గడువు చాలాసార్లు పొడిగించింది. అయితే ప్రస్తుతం ఈ గడువు 2020 మార్చి 31 తో ముగియనుంది.

2020 జనవరి 27 నాటికి మొత్తం 30.75 కోట్లకు పైగా పాన్ నెంబర్లను ఆధార్ కార్డుతో అనుసంధానించారు. అయితే, 17.58 కోట్ల పాన్లను ఆధార్ ఐడితో అనుసంధానం జరగాల్సి ఉంది.

అయితే మార్చి 31, 2020 ఆధార్ లింకింగ్ చెయ్యకపోతే, ఆ వ్యక్తి పాన్ నెంబర్ చట్ట ప్రకారం పరిగణించబడదు అని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్స్ (సిబిడిటి) తెలిపింది.

పాన్ తో ఆధార్ కార్డు లింకింగ్ అయిందో లేదో తెలుసుకోవాలంటే ఇలా చేయాలి.. ముందుగా www.incometaxindiaefiling.gov.in వెబ్‌సైట్‌కి వెళ్ళాలి..

ఆ పేజ్‌లో ఎడమ వైపు ఉన్న క్విక్ లింక్స్‌లోని 'లింక్ ఆధార్' ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.. ఆ తరువాత ఒక పేజ్ ఓపెన్ అవుతుంది. పేజ్ పైభాగంలో 'క్లిక్ హియర్ టు వ్యూ ద స్టేటస్..' అనే హైపర్ లింక్ కనిపిస్తుంది. దీనిపై క్లిక్ చేయాలి.. తర్వాతి పేజ్‌లో మీరు మీ పాన్, ఆధార్ వివరాలు ఎంటర్ చేయాల్సి వస్తుంది.

మీ వివరాలు ఎంటర్ చేసిన తర్వాత 'వ్యూ లింక్ ఆధార్ స్టేటస్'పై క్లిక్ చేయాలి.. దీంతో మీ ఆధార్, పాన్ లింక్ అయ్యాయో లేదో తెలుస్తుంది. మీ పాన్ నెంబర్ ఆధార్‌తో లింక్ అయ్యి ఉంటే పేజ్‌లో 'మీ పాన్ ఆధార్‌తో లింక్ అయ్యింది' అని సూచిస్తుంది.
Published by:Krishna Adithya
First published:February 15, 2020, 18:58 IST