PAN-Aadhaar: పాన్, ఆధార్ కార్డుల కొత్త నిబంధనలివే... తెలుసుకోండి

PAN-Aadhaar New Rules | మీ దగ్గర పాన్ కార్డు లేకపోతే మీరు ఐటీ రిటర్న్స్ ఫైల్ చేసేప్పుడు ఆధార్ నెంబర్ ఎంటర్ చేస్తే చాలు... ఆదాయపు పన్ను శాఖ మీకు పాన్ కార్డు జారీ చేస్తుంది.

news18-telugu
Updated: July 9, 2019, 4:27 PM IST
PAN-Aadhaar: పాన్, ఆధార్ కార్డుల కొత్త నిబంధనలివే... తెలుసుకోండి
PAN-Aadhaar: పాన్, ఆధార్ కార్డుల కొత్త నిబంధనలివే... తెలుసుకోండి (ప్రతీకాత్మక చిత్రం)
news18-telugu
Updated: July 9, 2019, 4:27 PM IST
ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయడానికి పాన్ కార్డు లేనివాళ్లు ఆధార్ నెంబర్ ఉపయోగించుకోవచ్చని బడ్జెట్ ప్రసంగంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. దీంతో పాన్ కార్డ్, ఆధార్ కార్డ్ విషయంలో సామాన్యుల్లో కొన్ని సందేహాలున్నాయి. పాన్ కార్డు స్థానంలో ఆధార్ నెంబర్‌ ఉపయోగించే అవకాశం ఉన్నప్పుడు ఇక పాన్ కార్డు అవసరం లేనట్టేనా? పాన్ కార్డు చరిత్రలో కలిసిపోనుందా? అన్న అనుమానాలున్నాయి. అయితే పాన్, ఆధార్ నెంబర్ల పరస్పర మార్పిడి 'అదనపు సదుపాయం' మాత్రమేనని, ఆధార్ నెంబర్‌తో ఐటీ రిటర్న్స్ ఫైల్ చేసిన వారికి ఆదాయపు పన్ను శాఖ పాన్ కార్డుల్ని జారీ చేయడం కొత్త వ్యవస్థ అని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ ఛైర్మన్ ప్రమోద్ చంద్ర మోడీ తెలిపారు.

పాన్, ఆధార్ కొత్త నిబంధనలివే...


సాధారణంగా రూ.50,000 మించి నగదు లావాదేవీలకు, రూ.10 లక్షలకు పైన స్థిరాస్తి కొనుగోలు కోసం పాన్ కార్డ్ తప్పనిసరి. ఒకవేళ పాన్ కార్డు లేకపోతే ఆధార్ నెంబర్ ఉపయోగించొచ్చు.

బ్యాంకుల్లో పాన్ కార్డు అవసరమైన ప్రతీ చోటా ఆధార్ నెంబర్ ఎంటర్ చేయొచ్చు. బంగారం కొనాలన్నా, మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయాలన్నా, ఇతర ఆర్థిక వ్యవహారాల్లో పాన్ కార్డ్ స్థానంలో ఆధార్ ఉపయోగించొచ్చు. సుప్రీం కోర్టు ఆదేశాల ప్రకారం ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయాలంటే ఆధార్ నెంబర్ తప్పనిసరి. మీ దగ్గర పాన్ కార్డు లేకపోతే మీరు ఐటీ రిటర్న్స్ ఫైల్ చేసేప్పుడు ఆధార్ నెంబర్ ఎంటర్ చేస్తే చాలు... ఆదాయపు పన్ను శాఖ మీకు పాన్ కార్డు జారీ చేస్తుంది.

ప్రస్తుతం భారతదేశంలో 120 కోట్ల మందికి ఆధార్ కార్డులున్నాయి. పాన్ కార్డులు మాత్రం 41 కోట్లు మాత్రమే ఉన్నాయి. వాటిలో 22 కోట్ల పాన్ కార్డుల్ని మాత్రమే ఆధార్‌తో లింక్ చేశారు. పాన్ కార్డులు లేని వాళ్లు ఇక ఆధార్ నెంబర్ ఉపయోగించుకోవచ్చు.



Redmi 7A: రూ.5,799 ధరకే రెడ్‌మీ 7ఏ... ఎలా ఉందో చూడండి


ఇవి కూడా చదవండి:

IRCTC: హైదరాబాద్ టు కాశ్మీర్... ఐఆర్‌సీటీసీ టూర్ ప్యాకేజీ

SBI: ఎస్‌బీఐ ఇంటర్నెట్ బ్యాంకింగ్... రిజిస్టర్ చేసుకోండిలా

UPI Apps: గూగుల్ పే, ఫోన్‌పే లావాదేవీల్లో ఈ జాగ్రత్తలు పాటించండి
First published: July 9, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...