కొత్త ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ 1న మొదలవుతోంది. కొత్త ఆర్థిక సంవత్సరంలో కొత్త రూల్స్ కూడా అమల్లోకి రానున్నాయి. ఆర్థిక లావాదేవీలు జరిపేవారికి, బ్యాంకుల్లో ట్రాన్సాక్షన్స్ చేసేవారికి, వీటితో పాటు ఇన్స్యూరెన్స్ తీసుకునేవారికి, ఈపీఎఫ్ అకౌంట్లో డబ్బులు దాచుకునేవారికి... ఇలా అన్ని వర్గాలనూ ఈ కొత్త రూల్స్ ప్రభావితం చేయబోతున్నాయి. అందుకే ఈ కొత్త రూల్స్ తెలుసుకోవడం అవసరం. లేకపోతే ఇబ్బందులు పడాల్సి వస్తుంది. మరి ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రాబోయే కొత్త రూల్స్ ఏంటో, అవి మీపై ఎలా ప్రభావం చూపిస్తాయో తెలుసుకోండి.
Auto Pay: క్రెడిట్, డెబిట్ కార్డులతో ఆటో పేమెంట్స్ చేసేవారికి ఏప్రిల్ 1 నుంచి కొత్త రూల్స్ అమల్లోకి రాబోతున్నాయి. మొబైల్ రీఛార్జ్, పోస్ట్‌పెయిడ్ బిల్స్, పవర్ బిల్స్ పేమెంట్స్‌తో పాటు అమెజాన్ ప్రైమ్, డిస్నీ+ హాట్‌స్టార్, సోనీ లివ్ లాంటి ఓటీటీ సబ్స్క్రిప్షన్స్కి కూడా ఆటో పేమెంట్ ఫీచర్ తప్పనిసరి. ఈ కొత్త ఫీచర్ ఎలా పనిచేస్తుందో తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.
PAN Aadhaar Link: మీ పాన్ కార్డ్, ఆధార్ నెంబర్ లింక్ చేశారా? లింక్ చేయకపోతే ఏప్రిల్ నుంచి ఫైన్ చెల్లించాల్సి ఉంటుంది. పాన్, ఆధార్ లింక్ చేయడానికి మార్చి 31 చివరి తేదీ. అప్పట్లోగా లింక్ చేయకపోతే ఏప్రిల్ 1 తర్వాత రూ.1,000 జరమానా చెల్లించాల్సి ఉంటుంది. మరి మీ పాన్, ఆధార్ కార్డ్ లింక్ అయిందో లేదో తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.
Mashak Rakshak Policy: దోమల కారణంగా వచ్చే రోగాలకు చికిత్స పొందేందుకు ఇన్స్యూరెన్స్ కంపెనీలు మషక్ రక్షక్ పాలసీని ఏప్రిల్ 1 నుంచి అందించనున్నాయి. మీకు ఇప్పటికే హెల్త్ ఇన్స్యూరెన్స్ పాలసీ ఉన్నా దానికి అదనంగా ఈ పాలసీ తీసుకోవచ్చు. ఈ పాలసీ వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
Mineral Water: మినరల్ వాటర్ కొనేవారికి అలర్ట్. ఏప్రిల్ 1 నుంచి మినరల్ వాటర్ బాటిల్‌పై బీఐఎస్ సర్టిఫికేషన్ మార్క్ తప్పనిసరి. మీరు వాటర్ బాటిల్ కొంటే FSSAI లైసెన్స్ నెంబర్, బీఐఎస్ సర్టిఫికేషన్ మార్క్ ఉందో లేదో చెక్ చేయండి. ఈ రూల్ ఎందుకో తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.
Milk Price: ఏప్రిల్ 1 నుంచి పాల ధరలు పెంచుతున్నట్టు సంగం డెయిరీ ప్రకటించింది. పాల ధరలు పెరగడానికి కారణాలేంటో వివరించింది. పూర్తి వివరాలు ఇక్కడ క్లిక్ చేసి తెలుసుకోండి.
Term Insurance Plan: ఏప్రిల్ 1 నుంచి టర్మ్ ఇన్స్యూరెన్స్ ప్రీమియం రేట్స్ పెరగనున్నాయి. కరోనా వైరస్ సంక్షోభం కారణంగా డెత్ క్లెయిమ్స్ పెరిగాయి. దీంతో ప్రీమియం రేట్స్ పెంచాలని ఇన్స్యూరెన్స్ కంపెనీలు నిర్ణయించాయి. ప్రైవేట్ లైఫ్ ఇన్స్యూరెన్స్ కంపెనీలు ప్రీమియం పెంచుతున్నాయి కానీ ఎల్ఐసీలో ఎలాంటి పెంపు లేదు.
Special Trains: కరోనా వైరస్ సంక్షోభం కారణంగా గతేడాది రైళ్లను భారతీయ రైల్వే నిలిపివేసిన సంగతి తెలిసిందే. మార్చి నెలాఖరు వరకే ప్రకటించిన ప్రత్యేక రైళ్లను పొడిగించింది భారతీయ రైల్వే. తెలుగు రాష్ట్రాల్లో అందుబాటులోకి రానున్న ప్రత్యేక రైళ్ల వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
Price Hike: మీ ఇంట్లోకి టీవీ, ఫ్రిజ్ కొనాలనుకుంటున్నారా? ఏప్రిల్ 1 నుంచి ధరలు పెరగనున్నాయి. టీవీ, ఫ్రిజ్ మాత్రమే కాదు చాలావరకు వస్తువుల ధరలు పెరగనున్నాయి. ఆ జాబితా కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
Bank Account: భారత ప్రభుత్వం 8 ప్రభుత్వ రంగ బ్యాంకుల్ని విలీనం చేసి 3 బ్యాంకులుగా మార్చిన సంగతి తెలిసిందే. దీంతో పాత బ్యాంకులకు చెందిన పాస్‌బుక్స్, చెక్ బుక్స్ ఏప్రిల్ 1 నుంచి పనిచేయవు. విజయా బ్యాంక్, దేనా బ్యాంక్, ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, యూనైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, అలహాబాద్ బ్యాంక్ కస్టమర్లు ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి. మరి ఆ బ్యాంకుల కస్టమర్స్ ఏం చేయాలో తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.
April Bank Holidays: ఏప్రిల్‌లో బ్యాంకులు 12 రోజులు తెరుచుకోవు. ఏప్రిల్‌లో మొత్తం 30 రోజులు ఉంటే అందులో 12 రోజులు బ్యాంకులకు సెలవులే. ఆ సెలవుల జాబితా కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
EPF: ప్రతీ ఏటా ఈపీఎఫ్ అకౌంట్లో రూ.2,50,000 పైనే జమ చేసేవారు వడ్డీపై పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఆ వడ్డీని కేంద్ర ప్రభుత్వం ఆదాయంగా పరిగణిస్తుంది. కాబట్టి ఇన్కమ్ ట్యాక్స్ శ్లాబ్స్ ప్రకారం పన్నులు చెల్లించాలి. ఈ రూల్ 2021 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తుంది. అయితే ప్రతీ నెల రూ.2,00,000 కన్నా తక్కువ వేతనం పొందుతున్నవారికి ఈ మార్పు వల్ల వచ్చే నష్టమేమ లేదు.
ITR Forms: ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ కోసం ఇకపై ప్రీ-ఫిల్డ్ ఫామ్స్ రానున్నాయి. దీని వల్ల పన్ను చెల్లింపుదారులు సులువుగా రిటర్న్స్ ఫైల్ చేయొచ్చు.
LTC Scheme: కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో లీవ్ ట్రావెల్ కన్సెషన్-LTC వోచర్ స్కీమ్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఎల్టీసీ స్కీమ్‌లో ఇచ్చిన మినహాయింపులు మార్చి 31న ముగుస్తాయి. ఏప్రిల్ 1 నుంచి ఎలాంటి మినహాయింపులు ఉండవు.
TDS: ఆదాయపు పన్ను చట్టంలో కొత్తగా 206ఏబీ సెక్షన్ చేర్చింది ఆదాయపు పన్ను శాఖ. ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయనివారు టీడీఎస్‌పై ఎక్కువ రేట్ వసూలు చేసే నిబంధన ఇది.
Tax Filing: ఏప్రిల్ 1 తర్వాత 75 ఏళ్ల పైన ఉన్నవారు ఆదాయపు పన్ను రిటర్న్స్ ఫైల్ చేయాల్సిన అవసరం లేదు. పెన్షన్ ద్వారా, ఫిక్స్డ్ డిపాజిట్‌పై వడ్డీ ద్వారా ఆదాయాన్ని పొందుతున్నవారికి ఇది వర్తిస్తుంది. వారికి పన్నులను బ్యాంకులనే నేరుగా డిడక్ట్ చేస్తుంది ప్రభుత్వం.
Salary: కొత్త వేతన కోడ్ ఏప్రిల్ 1న అమల్లోకి రానుంది. కొత్త నిబంధనల ప్రకారం అలవెన్సులు 50 శాతం మించి ఉండకూడదు. ప్రస్తుతం బేసిక్ వేతనం 35 నుంచి 45 శాతం నుంచే ఉంటుంది. దీంతో బేసిక్ పే పెంచాల్సిన అవసరం ఉంది. బేసిక్ పే పెరిగితే అందులో 12 శాతం పీఎఫ్ అకౌంట్లో జమ చేయాలి. కాబట్టి పీఎఫ్‌లో జమ చేసే మొత్తం కూడా పెరుగుతుంది. మొత్తంగా ఉద్యోగుల టేక్ హోమ్ సాలరీ తగ్గుతుంది.
Gratuity: ఒక కంపెనీలో ఐదేళ్లు వరుసగా సేవలు అందించిన ఉద్యోగులకు గ్రాట్యుటీ లభిస్తుంది. గ్రాట్యుటీకి సంబంధించి కొత్త రూల్స్ అమల్లోకి రానున్నాయి. ఇకపై ఒక ఏడాది పనిచేసినా గ్రాట్యుటీ ఇవ్వాలి.
All India Tourist Permit: టూరిజంను ప్రమోట్ చేయడం కోసం కేంద్ర ప్రభుత్వం ఆల్ ఇండియా టూరిస్ట్ పర్మిట్‌ను అందిస్తోంది. టూర్ ఆపరేటర్స్ ఆన్లైన్లో దరఖాస్తు చేసిన 30 రోజుల్లో పర్మిట్ లభస్తుంది. ఈ కొత్త రూల్స్ 2021 ఏప్రిల్ 1న అమల్లోకి వస్తాయి.
Published by:Santhosh Kumar S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.