పాన్‌-ఆధార్‌ లింకింగ్ గడువు పెంపు... డిసెంబర్ 31 వరకూ... ఇలా చెయ్యండి

PAN-Aadhaar linking : కేంద్రం తెచ్చిన రూల్స్ అందరం పాటించాల్సిందే. పాన్-ఆధార్ లింకింగ్ అనేది వాటిలో ఒకటి. చాలా మందికి టైమ్ లేకపోవడంతో లింక్ చేయలేకపోతున్నారు. కొంతమందికి ఎలా చెయ్యాలో తెలియట్లేదు. ఇప్పుడీ విషయం తేల్చేద్దాం.

Krishna Kumar N | news18-telugu
Updated: September 29, 2019, 6:12 AM IST
పాన్‌-ఆధార్‌ లింకింగ్ గడువు పెంపు... డిసెంబర్ 31 వరకూ... ఇలా చెయ్యండి
పాన్‌-ఆధార్‌ లింకింగ్ గడువు పెంపు... డిసెంబర్ 31 వరకూ... ఇలా చెయ్యండి
  • Share this:
PAN-Aadhaar linking : మనందరికీ పాన్ కార్డు ఉంటుంది, ఆధార్ కార్డూ ఉంటుంది. ఐతే... పాన్ కార్డుతోపాటూ... ఆధార్ వివరాలు కూడా ఇన్‌కంటాక్స్ అధికారుల దగ్గర ఉండాలన్నది కేంద్రం కొత్తగా తెచ్చిన రూల్. ఇందుకు సెప్టెంబర్ 30 వరకూ టైమ్ ఇచ్చినా... చాలా మంది ఇంకా ఆధార్ లింక్ చెయ్యలేదు. అందుకే డిసెంబర్ 31వరకూ టైమ్ పొడిగించింది. ఈసారి మాత్రం మరో ఛాన్స్ ఇచ్చేందుకు కేంద్రం సిద్ధంగా లేదు. అందువల్ల ఎన్ని పనులున్నా పక్కన పెట్టి... ముందు పర్మనెంట్ అకౌంట్ నంబర్ (PAN)కి ఆధార్ లింక్ చెయ్యాల్సిందే. ఆల్రెడీ చేసుకున్నవారు... ఓసారి చెక్ చేసుకుంటే మంచిదే. ఎందుకంటే... డిసెంబర్ 31 తర్వాత... లింక్ అవ్వని పాన్ కార్డులను కేంద్రం డీ-యాక్టివేట్ చేస్తుంది. అంటే ఇక ఆ పాన్ పనిచెయ్యదు. మరో కొత్త పాన్ తీసుకోవాల్సిందే. ఈ రోజుల్లో ఏ పెద్ద లావాదేవీ జరిపినా పాన్ ఇవ్వాల్సిందే కాబట్టి... ఆధార్ లింకే చేసేసుకుంటే... ఇక ఏ సమస్యా ఉండదు.

కొంతమంది తాము ఐటీ రిటర్నులు ఫైల్ చెయ్యట్లేదనీ, తాము పన్ను పరిధిలోకి రామనీ చెబుతుంటారు. అలాంటివారు కూడా పాన్-ఆధార్ లింక్ చేసుకోవాల్సిందే. లేదంటే... 2019 తర్వాత ప్రస్తుతం ఉన్న పాన్ పనికిరాకుండా పోతుంది. ఆ తర్వాత ఆర్థిక లావాదేవీ జరిపితే... పాన్ బదులు ఆధార్ నంబర్ అడుగుతారు. ఆధార్ నంబర్‌ ఇచ్చి ఆర్థిక లావాదేవీ జరిపితే... వెంటనే ఆ నంబర్‌కి సెట్ అయ్యేలా కొత్త పాన్ వచ్చేస్తుంది. దానికి ఆటోమేటిక్‌గా ఆధార్ నంబర్ లింక్ అయి ఉంటుంది. కాకపోతే... ఈ ప్రాసెస్ కాస్త లేటయ్యే అవకాశాలుంటాయి. ఇన్ని ఇబ్బందులు పడేబదులు... జస్ట్ 1 నిమిషంలో పాన్-ఆధార్ లింక్ చేసుకోవచ్చు.

pan card,how to link pan card to aadhar card,how to link pan card,aadhaar card,how to link aadhar with pan,pan card link with aadhar,aadhar card,pan link with aadhar,aadhaar,link aadhar card with pan card,aadhaar and pan,linking pan,link aadhaar with pan card,pan aadhaar linking,aadhaar card linking,how to link pan card with aadhar card,pan aadhaar link,aadhaar pan linking,pan,పాన్, ఆధార్ లింకింగ్,ఆధార్ పాన్ గడువు పెంపు,పాన్ కార్డు,ఆధార్ కార్డు,పాన్ వివరాలు, ఆధార్ వివరాలు,
పాన్‌-ఆధార్‌ లింకింగ్ గడువు పెంపు... డిసెంబర్ 31 వరకూ...


పాన్-ఆధార్ లింక్ కోసం ఇలా చెయ్యండి :
- www1.incometaxindiaefiling.gov.in/e-FilingGS/Services/LinkAadhaarHome.html లోకి వెళ్లండి.
- అక్కడ అడిగిన ఆప్షన్లలో మీ పాన్‌ నంబర్‌, ఆధార్‌ నంబర్‌ ఎంటర్ చెయ్యండి.
- మూడో ఆప్షన్‌ (Name as per AADHAAR)లో ఆధార్ కార్డులో మీ పేరు ఎలా ఉందో, అలాగే టైప్ చెయ్యండి.- కింద I have only year of birth in Aadhaar Card అని ఉన్న దగ్గర బాక్స్‌ క్లిక్‌ చెయ్యండి.
- తర్వాత I agree to validate my Aadhaar details with UIDAI ముందు ఉన్న బాక్స్ క్లిక్ చెయ్యండి.
- తర్వాత కాప్చా కోడ్‌ను కింద ఇచ్చిన బాక్సులో ఎంటర్ చెయ్యండి.
- నెక్ట్స్ కింద ఉన్న Link Aadhaar ఆప్షన్‌ క్లిక్‌ చేయండి.

ఇప్పుడు మీ వివరాలు... ఐటీ శాఖకు వెళ్తాయి. రెండ్రోజుల్లో మీ పాన్‌కి ఆధార్ లింక్ అవుతుంది.

పాన్‌-ఆధార్‌ లింకింగ్ గడువు పెంపు... డిసెంబర్ 31 వరకూ...


ఆధార్ లింక్ అయ్యిందో లేదో తెలుసుకోవడానికి మీరు కింది లింక్ క్లిక్ చేసి చూడవచ్చు.
www1.incometaxindiaefiling.gov.in/e-FilingGS/Services/AadhaarPreloginStatus.html

- లింక్ ఓపెన్ అయ్యాక... పాన్, ఆధార్ నంబర్ ఎంటర్ చేసి... View Link Aadhaar Status ఆప్షన్ క్లిక్ చెయ్యండి. లింక్ అయ్యిందో లేదో చెబుతుంది. చూశారా ఎంత ఈజీయో. ఇంక లేటెందుకు... పూర్తి చేసేయండి.
First published: September 29, 2019, 6:12 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading