PAN-AADHAR link: పాన్ కార్డుతో ఆధార్ లింక్... డెడ్‌లైన్ మార్చి 31

PAN-AADHAR link | పాన్ కార్డు ఉన్న ప్రతీ ఒక్కరూ ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 139 ఏఏ (2) ప్రకారం ఆధార్ తీసుకోవాలి. ఆధార్ నెంబర్‌ను పాన్‌తో లింక్ చేయాలి. ఐటీ రిటర్న్స్‌ సమయంలో ఆధార్ నెంబర్ తప్పనిసరి.

news18-telugu
Updated: February 10, 2019, 11:22 AM IST
PAN-AADHAR link: పాన్ కార్డుతో ఆధార్ లింక్... డెడ్‌లైన్ మార్చి 31
PAN-AADHAR link: పాన్ కార్డుతో ఆధార్ లింక్... డెడ్‌లైన్ మార్చి 31
news18-telugu
Updated: February 10, 2019, 11:22 AM IST
మీ దగ్గర పాన్ కార్డు ఉందా? పాన్ కార్డును ఆధార్ నెంబర్‌తో లింక్ చేశారా? ఇంకా చేయకపోతే వెంటనే చేయండి. మార్చి 31 వరకే ఆఖరి గడువు. ఇప్పటివరకు కేవలం 23 కోట్ల మంది పాన్ కార్డు హోల్డర్లు మాత్రమే ఆధార్‌ను లింక్ చేశారట. అంటే మొత్తం పాన్ కార్డ్ హోల్డర్లలో ఇది సగం మాత్రమే. ఇప్పటివరకు ఆదాయపు పన్ను శాఖ 42 కోట్ల పాన్ కార్డులను జారీ చేస్తే అందులో 23 కోట్ల మంది మాత్రమే తమ పాన్ కార్డును ఆధార్‌తో లింక్ చేశారని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్(CBDT) ఛైర్మన్ సుశీల్ చంద్ర వెల్లడించారు.

పాన్ కార్డుతో ఆధార్‌ను లింక్ చేయడం ద్వారా నకిలీ పాన్ కార్డులు బయటపడ్తాయి. అలాంటి పాన్ కార్డుల్ని రద్దు చేస్తాం. ఒకవేళ ఆధార్‌తో లింక్ చేయకపోయినా పాన్ కార్డులను రద్దు చేస్తాం. ఆధార్‌ పాన్‌తో లింక్ చేసి ఉంటుంది. పాన్ బ్యాంకు అకౌంట్లకు లింక్ చేసి ఉంటుంది. తద్వారా ఓ వ్యక్తికి సంబంధించిన ఆదాయ, వ్యయాల గురించి తెలుసుకోవచ్చు. అంతేకాదు సంక్షేమ పథకాలకు లబ్ధిదారులను ఎంపిక చేయొచ్చు.
అసోచాం ఈవెంట్‌లో సుశీల్ చంద్ర, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్(CBDT) ఛైర్మన్


గతేడాది ఆధార్‌పై కీలక తీర్పు చెప్పిన సుప్రీం కోర్టు... పాన్ కార్డుతో ఆధార్ నెంబర్‌ను అనుసంధానించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయడంలోనూ ఆధార్ తప్పనిసరని చెప్పింది. పాన్ కార్డు ఉన్న ప్రతీ ఒక్కరూ ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 139 ఏఏ (2) ప్రకారం ఆధార్ తీసుకోవాలి. ఆధార్ నెంబర్‌ను పాన్‌తో లింక్ చేయాలి. ఐటీ రిటర్న్స్‌ సమయంలో ఆధార్ నెంబర్ తప్పనిసరి.



గతేడాది 5.44 కోట్ల మంది ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయగా ఈసారి, 6.31 కోట్ల మంది రిటర్న్స్ ఫైల్ చేశారు. 95 లక్షల మంది కొత్త ట్యాక్స్ పేయర్స్ చేరారు. నాన్-ఫైలర్స్‌ని గుర్తించే పనిలో ఉన్నాం. ఇందుకోసం థర్డ్ పార్టీ నుంచి సమాచారం సేకరిస్తున్నాం.
అసోచాం ఈవెంట్‌లో సుశీల్ చంద్ర, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్(CBDT) ఛైర్మన్


ఎవరైనా భారీ లావాదేవీలు జరిపి ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయకపోతే నాన్-ఫైలర్స్ మానిటరింగ్ సిస్టమ్(NMS) ద్వారా వారికి ఐటీ శాఖ నుంచి నోటీస్ వెళ్తుంది. 21 రోజుల్లో సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది. గత నెలలో నాన్-ఫైలర్స్ మానిటరింగ్ సిస్టమ్ ద్వారా 33,000 మంది ట్యాక్స్ పేయర్స్ కొత్తగా చేరారు.
Loading...
Photos: రూ.50 కోట్లతో 6 రోల్స్ రాయిస్ కార్లు... తలపాగాతో మ్యాచింగ్...

ఇవి కూడా చదవండి:

SBI Alert: కార్డు మోసాలు జరుగుతున్నాయి... ఇలా జాగ్రత్తపడండి

Paytm SIP Offer: డబ్బులు లేవా? అయినా పెట్టుబడి పెట్టొచ్చు... ఎలాగో తెలుసుకోండి

చిట్టీలు వేస్తున్నారా? చిట్ ఫండ్‌లో డబ్బులు కడుతున్నారా? అయితే జాగ్రత్త
First published: February 10, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...