PAN - Aadhaar Link: పాన్ కార్డుతో ఆధార్ లింక్ చేయకపోతే ఇకపై 10వేల రూపాయల ఫైన్ వేసేందుకు రంగం సిద్ధమవుతోంది. మార్చి 31 లోపల PAN - Aadhaarకు లింక్ చేయాలని ఇఫ్పటికే ఆదాయపన్ను శాఖ డెడ్ లైన్ విధిస్తూ వస్తోంది. ఆధార్ పాన్ కార్డు లింక్ చేయని అన్ని పాన్ కార్డులను రద్దు చేస్తామని ఇప్పటికే ఇంకమ్ టాక్స్ డిపార్ట్ మెంట్ తెలిపింది. చట్ట ప్రకారం సెక్షన్ 272 బి కింద రూ. 10 వేలు ఫైన్ వేసే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. రద్దు చేసిన పాన్ కార్డుతో బ్యాంకు ఖాతాలు తెరవడం.. లావాదేవీలను కలిగి ఉంటే.. సమస్యలు తలెత్తుతున్నాయి. అయితే PAN - Aadhaar గడువు తర్వాత లింక్ చేసుకుంటే...మళ్లీ కొత్తగా పాన్ కార్డు కోసం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అప్పుడే పాన్ కార్డు పనిచేస్తుంది.
ఇదిలా ఉంటే CBDT ఆధార్, పాన్ లింక్ గడువు ఇప్పటికే పలుమార్లు పొడిగించారు. అయితే ఈ డెడ్ లైన్ను 2020 మార్చి 31 వరకు పొడిగించారు. కాగా జనవరి 27 నాటికి చూస్తే దేశంలో 30.75 కోట్లకు పైగా పాన్ కార్డులు ఆధార్ కార్డులతో లింక్ అయినట్లు ఆదాయ పన్ను శాఖ తెలిపింది.
Published by:Krishna Adithya
First published:March 02, 2020, 16:21 IST