Home /News /business /

PAN AADHAAR LINKING WILL ATTRACT UP TO RS 1000 FINE FROM APRIL 1 KNOW ABOUT PENALTY RULES SS

PAN Card: పాన్ కార్డ్ హోల్డర్లకు అలర్ట్... రేపటి నుంచి కొత్త ఛార్జీలు

PAN Card: పాన్ కార్డ్ హోల్డర్లకు అలర్ట్... రేపటి నుంచి కొత్త ఛార్జీలు
(ప్రతీకాత్మక చిత్రం)

PAN Card: పాన్ కార్డ్ హోల్డర్లకు అలర్ట్... రేపటి నుంచి కొత్త ఛార్జీలు (ప్రతీకాత్మక చిత్రం)

PAN Card | పాన్ కార్డ్, ఆధార్ నెంబర్ లింక్ చేయనివారు రేపటి నుంచి జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. కొత్త పెనాల్టీ రూల్స్ రేపటి నుంచి అమల్లోకి రానున్నాయి. పాన్, ఆధార్ లింక్ చేయకపోతే ఏం జరుగుతుందో తెలుసుకోండి.

    మీ దగ్గర పాన్ కార్డ్ ఉందా? మీ ఆధార్ నెంబర్‌ను (Aadhaar Number) పాన్ కార్డుకు లింక్ చేయలేదా? పాన్ ఆధార్ లింక్ (PAN Aadhaar Link) చేయడానికి 2022 మార్చి 31 చివరి తేదీ. ఇప్పటికే అనేకసార్లు పాన్ ఆధార్ లింక్ చేయడానికి గడువు పొడిగించింది ఆదాయపు పన్ను శాఖ. చివరి సారిగా 2022 మార్చి 31 వరకు గడువు పొడిగించింది. అంటే ఇంకొన్ని గంటల్లో గడువు ముగియనుంది. మరి గడువులోగా పాన్ కార్డ్ లింక్ చేయకపోతే ఏమవుతుంది? ఆదాయపు పన్ను శాఖ మళ్లీ గడువు పొడిగిస్తుందా? దీనిపై ఆదాయపు పన్ను శాఖ క్లారిటీ ఇచ్చింది. మార్చి 31 లోగా పాన్, ఆధార్ లింక్ చేయకపోతే రూ.1,000 వరకు జరిమానా చెల్లించాల్సి వస్తుందని ఆదాయపు పన్ను శాఖ క్లారిటీ ఇచ్చింది. అంతేకాదు... 2023 మార్చి వరకు ఆ పాన్ కార్డ్ ఐటీఆర్ ఫైలింగ్ కోసం ఉపయోగించవచ్చని కూడా తెలిపింది.

    ఆదాయపు పన్ను తాజా సర్క్యులర్ ప్రకారం 2022 మార్చి 31 తర్వాత కూడా పాన్, ఆధార్ లింక్ చేయొచ్చు. కానీ... పెనాల్టీ చెల్లించాల్సి ఉంటుంది. 2022 ఏప్రిల్ 1 నుంచి 2023 మార్చి 31 వరకు ఎప్పుడు పాన్ ఆధార్ లింక్ చేసినా జరిమానా తప్పదు. మొదటి మూడు నెలలు రూ.500, ఆ తర్వాత తొమ్మిది నెలలు రూ.1,000 జరిమానా చెల్లించాలి.

    Old Vehicle: మీ దగ్గర పాత బైక్, పాత కార్ ఉందా? రేపటి నుంచి కొత్త ఛార్జీలు


    పాన్, ఆధార్ లింక్ చేయకపోయినా వచ్చే ఏడాది వరకు పాన్ కార్డ్ చెల్లుతుంది. అన్ని లావాదేవీలకు పాన్ కార్డ్ ఉపయోగించవచ్చు. 2023 మార్చి 31 లోగా కూడా పాన్ ఆధార్ లింక్ చేయకపోతే పాన్ కార్డ్ చెల్లదు. ఆ తర్వాత లావాదేవీల్లో పాన్ కార్డ్ ఉపయోగించడం కుదరదు. డూప్లికేట్ పాన్ కార్డుల్ని తొలగించడం, పన్ను ఎగవేతల్ని అడ్డుకోవడం కోసం పాన్ కార్డ్, ఆధార్ నెంబర్లను లింక్ చేయాలని కోరుతోంది ఆదాయపు పన్ను శాఖ. 2022 జూన్ 24 నాటికి 43.34 మంది పాన్ కార్డ్ హోల్డర్స్ తమ ఆధార్ నెంబర్ లింక్ చేశారు. ఇంకా కోట్లాది మంది తమ పాన్, ఆధార్ లింక్ చేశారు. మీరు పాన్, ఆధార్ లింక్ చేయాలంటే ఈ స్టెప్స్ ఫాలో అవండి.

    Pension Scheme: ఈ స్కీమ్‌లో చేరడానికి ఈరోజే లాస్ట్ డేట్... నెలకు రూ.9,250 పెన్షన్ ఇచ్చే పథకం

    ఆదాయపు పన్ను శాఖ వెబ్‌సైట్ https://www.incometax.gov.in/ ఓపెన్ చేయండి.
    హోమ్ పేజీలోనే Link Aadhaar లింక్ పైన క్లిక్ చేయాలి.
    మొదట పాన్ నెంబర్ ఎంటర్ చేయాలి.
    రెండో కాలమ్‌లో ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి.
    ఆ తర్వాత ఆధార్ కార్డులో ఉన్నట్టుగా పేరు టైప్ చేయాలి.
    తర్వాత మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి.
    ఒకవేళ మీ ఆధార్ కార్డుపై పుట్టిన సంవత్సరం మాత్రమే ఉంటే I have only year of birth in Aadhaar card సెలెక్ట్ చేయాలి.
    ఆ తర్వాత I agree to validate my Aadhaar details సెలెక్ట్ చేయాలి.
    తర్వాత Link Aadhaar క్లిక్ చేస్తే మీ మొబైల్ నెంబర్‌కు ఓటీపీ వస్తుంది.
    ఓటీపీ ఎంటర్ చేసి Validate పైన క్లిక్ చేయాలి.
    మీ పాన్ కార్డ్, ఆధార్ నెంబర్ లింక్ అవుతుంది.
    ఒకవేళ మీ పాన్, ఆధార్ నెంబర్ ముందే లింక్ అయితే Your PAN is already linked to given Aadhaar అనే మెసేజ్ కనిపిస్తుంది.
    Published by:Santhosh Kumar S
    First published:

    Tags: Aadhaar Card, PAN card, Personal Finance

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు