మీ దగ్గర పాన్ కార్డు ఉందా? మీ పాన్ కార్డును ఆధార్ నెంబర్‌తో లింక్ చేశారా? చేయకపోతే త్వరలో మీ పాన్ కార్డు చెల్లకపోవచ్చు. మీది మాత్రమే కాదు... ఇలా ఆధార్ నెంబర్ లింక్ చేయని 17 కోట్ల పాన్ కార్డులు చెల్లకపోవచ్చు. భారతదేశంలో 48 కోట్ల పాన్ కార్డులు జారీ అయ్యాయి. అందులో ఇప్పటివరకు 17 కోట్లకు పైనే పాన్ కార్డులకు ఆధార్ నెంబర్ లింక్ చేయలేదు. పాన్ కార్డ్-ఆధార్ నెంబర్లను లింక్ చేయాలంటూ ఆదాయపు పన్ను శాఖ చాలా కాలంగా కోరుతోంది. ఇప్పటికే 8 సార్లు గడువు పెంచింది. 2020 మార్చి 31 వరకు గడువు పొడిగిస్తూ చివరిసారి ఆదేశాలు జారీ చేసింది. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఇన్నిసార్లు గడువు పొడిగించినా ఇంకా ఆధార్ లింక్ చేయని పాన్ కార్డులు 17 కోట్ల పైనే ఉండటం విశేషం. మరి మీరు ఇప్పటివరకు మీ ఆధార్ నెంబర్‌ను పాన్ కార్డుతో లింక్ ఎలా చేయాలో తెలుసుకోవడానికి
ఇక్కడ క్లిక్ చేయండి. ఒకవేళ మీరు ఇప్పటికే ఆధార్ నెంబర్-పాన్ నెంబర్ లింక్ చేసినట్టైతే స్టేటస్ తెలుసుకోవడానికి
ఇక్కడ క్లిక్ చేయండి.
ఫైనాన్స్ బిల్- 2019 సవరణ ప్రకారం ఆధార్ లింక్ చేయని పాన్ కార్డులు చెల్లవని ఆదాయపు పన్ను శాఖ నిర్ణయం తీసుకునే అవకాశముంది. ఒకవేళ ఈ పాన్ కార్డులు చెల్లవని ఆదాయపు పన్ను శాఖ ప్రకటించిందంటే ఆ కార్డులను ఎక్కడ వాడాలన్నా సాధ్యం కాదు. 2020 జనవరి వరకు 30.75 పాన్ కార్డుల్ని ఆధార్ నెంబర్‌తో లింక్ చేశారని, ఇంకా ఆధార్ లింక్ చేయని పాన్ కార్డులు 17.58 కోట్లు ఉన్నాయని ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ లోక్‌సభకు వెల్లడించారు. పాన్ నెంబర్, ఆధార్ నెంబర్ పరస్పరం మార్చుకోగలిగే అవకాశాన్ని కేంద్రం కల్పించినా, ఈ రెండు కార్డులు లింక్ చేయడం తప్పనిసరి. ఒకవేళ మీరు ఈ రెండు లింక్ చేయకపోతే ఎక్కడైనా ఆర్థిక లావాదేవీల కోసం పాన్ కార్డు బదులు ఆధార్ నెంబర్ వెల్లడిస్తే మీకు ఆదాయపు పన్ను శాఖ కొత్త పాన్ కార్డ్ జారీ చేస్తుంది. ఆదాయపు పన్ను మోసాలు, మనీ లాండరింగ్, కార్డుల డూప్లికేషన్ లాంటివి అరికట్టేందుకు పాన్ నెంబర్, ఆధార్ నెంబర్ లింక్ చేయడం తప్పనిసరి చేసింది ఆదాయపు పన్ను శాఖ.
ఇవి కూడా చదవండి:
ePAN Card: ఐదు నిమిషాల్లో ఇ-పాన్ కార్డు తీసుకోవచ్చు ఇలా
PAN Card: రెండు పాన్ కార్డులు ఉన్నాయా? ఇలా చేయండి
PAN Card: ఏఏ ట్రాన్సాక్షన్స్కి పాన్ కార్డు అవసరమో తెలుసా?Published by:Santhosh Kumar S
First published:February 10, 2020, 18:20 IST