Home /News /business /

PAN AADHAAR LINKING LINK YOUR AADHAAR NUMBER WITH PAN CARD TODAY KNOW HOW TO LINK YOUR AADHAR NUMBER WITH PAN CARD SS

PAN-Aadhaar Link: పాన్-ఆధార్ లింక్ చేయడానికి ఈ రోజే లాస్ట్ డేట్

PAN-Aadhar Link: మీ పాన్-ఆధార్‌ లింకైందా? ఇలా తెలుసుకోండి

PAN-Aadhar Link: మీ పాన్-ఆధార్‌ లింకైందా? ఇలా తెలుసుకోండి

PAN-Aadhaar Link | పాన్ కార్డు ఉన్న ప్రతీ ఒక్కరూ ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 139 ఏఏ (2) ప్రకారం ఆధార్ తీసుకోవాలి. ఆధార్ నెంబర్‌ను పాన్‌తో లింక్ చేయాలి.

    మీరు మీ ఆధార్ నెంబర్‌ను పాన్ కార్డుతో లింక్ చేశారా? ఇంకా చేయకపోతే వెంటనే చేయండి. గడువు దగ్గరకొచ్చింది. మార్చి 31లోగా పాన్-ఆధార్‌ లింక్ చేయాలని ఆదాయపు పన్ను శాఖ చాలాకాలంగా చెబుతోంది. కొద్దిరోజుల క్రితం లెక్కలు తీస్తే ఇప్పటి వరకు జారీ చేసిన 42 కోట్ల పాన్ కార్డుల్లో కేవలం 23 కోట్ల పాన్ కార్డులకు మాత్రమే ఆధార్‌ లింకైంది. అంటే దాదాపు సగం మంది తమ పాన్ నెంబర్‌ను ఆధార్‌తో లింక్ చేయాల్సి ఉంది. ప్రభుత్వం గతేడాది యాక్టీవ్‌గా లేని 11.44 లక్షల పాన్ కార్డుల్ని రద్దు చేసింది.

    Read this: PAN-Aadhar Link: మీ పాన్-ఆధార్‌ లింకైందా? 30 సెకన్లలో తెలుసుకోండి

    పాన్‌ కార్డుతో ఆధార్ ఎందుకు లింక్ చేయాలి?


    ఇప్పటివరకు కేంద్రం జారీ చేసిన పాన్ కార్డుల్లో నకిలీవి కూడా ఉన్నాయి. ఒకరు రెండుమూడు పాన్ కార్డులు తీసుకున్న ఘటనలున్నాయి. అందుకే పాన్ నెంబర్‌ను ఆధార్‌తో లింక్ చేస్తే నకిలీ కార్డులు బయటపడ్తాయి. వాటిని రద్దు చేయాలని కేంద్రం ఆలోచిస్తోంది. దాంతో పాటు రెండుమూడు పాన్ కార్డులు తీసుకున్నవారి వివరాలూ తెలుస్తాయి. వారికి ఒకే పాన్ కార్డ్ కేటాయించే అవకాశముంది. పాన్ కార్డులు బ్యాంకు అకౌంట్లతో లింకై ఉంటాయి కాబట్టి ఓ వ్యక్తి ఆదాయం, ఖర్చులు తెలుసుకోవచ్చు. సంక్షేమ పథకాలకు లబ్ధిదారులను ఎంపిక విషయంలోనూ ఇది ఉపయోగపడుతుంది.

    Read this: Link PAN: బ్యాంక్ అకౌంట్‌కి పాన్ లింక్ చేస్తేనే ఐటీఆర్ రీఫండ్

    ఆధార్‌పై కీలక తీర్పు చెప్పిన సుప్రీం కోర్టు సైతం పాన్ కార్డుతో ఆధార్ నెంబర్‌ను అనుసంధానించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయడంలోనూ ఆధార్ తప్పనిసరని చెప్పింది. పాన్ కార్డు ఉన్న ప్రతీ ఒక్కరూ ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 139 ఏఏ (2) ప్రకారం ఆధార్ తీసుకోవాలి. ఆధార్ నెంబర్‌ను పాన్‌తో లింక్ చేయాలి. ఐటీ రిటర్న్స్‌ సమయంలో ఆధార్ నెంబర్ తప్పనిసరి. అంతేకాదు... బ్యాంక్ అకౌంట్‌కి పాన్ లింక్ చేస్తేనే ఐటీఆర్ రీఫండ్ వస్తుందని కూడా ఆదాయపు పన్ను శాఖ తేల్చి చెప్పింది. మార్చి 1 నుంచే ఈ నిబంధన అమలులోకి వచ్చేసింది.

    Read this: PAN Card: మీ దగ్గర రెండో పాన్ కార్డ్ ఉందా? ఇలా సరెండర్ చేయండి

    పాన్‌తో ఆధార్ ఎలా లింక్ చేయాలి?


    ముందుగా incometaxindiaefiling.gov.in వెబ్‌సైట్ ఓపెన్ చేయండి.
    'Linking Aadhaar' లింక్ కనిపిస్తుంది. దానిపైన క్లిక్ చేస్తే మరో పేజీ ఓపెన్ అవుతుంది.
    మీ పేరు, పుట్టిన తేదీ లాంటి వివరాలు మీ ఆధార్‌ కార్డుపై ఉన్నట్టుగా ఎంటర్ చేయాలి.
    ఆధార్ నెంబర్, క్యాప్చా కోడ్ ఎంటర్ చేయాలి.
    'Link Aadhaar' పైన క్లిక్ చేస్తే మీ పాన్‌ కార్డుతో ఆధార్ నెంబర్ లింక్ అవుతుంది.

    Photos: ఈ 50 లగ్జరీ కార్లు చూస్తే కళ్లు చెదిరిపోవాల్సిందే...

    ఇవి కూడా చదవండి:

    PAN Card: మీ పాన్ కార్డులో తప్పులున్నాయా? ఇలా సరిదిద్దుకోవచ్చు

    SBI Schemes: ఎస్‌బీఐలో డబ్బులు దాచుకుంటారా? ఎక్కువ వడ్డీ ఇచ్చే స్కీమ్స్ ఇవే...

    WhatsApp 2019 Features: ఈ ఏడాది వాట్సప్‌లో ఆకట్టుకుంటున్న 12 ఫీచర్లు ఇవే...
    First published:

    Tags: Aadhaar, PAN, Personal Finance

    తదుపరి వార్తలు