మీరు మీ పాన్ నెంబర్, ఆధార్ నెంబర్ లింక్ చేశారా? ఇంకా లింక్ చేయకపోతే 2020 మార్చి 31 వరకు గడువు ఉంది. ఆదాయపు పన్ను విభాగం లెక్కల ప్రకారం భారతదేశంలో ఇప్పటివరకు 48 కోట్ల పాన్ కార్డులు జారీ అయ్యాయి. మరి వీటిలో ఎన్ని పాన్ కార్డులకు ఆధార్ నెంబర్లు లింక్ చేశారో తెలుసా? 30.75 కోట్ల పాన్ కార్డులు మాత్రమే. అంటే ఇంకా ఆధార్ లింక్ చేయని పాన్ కార్డులు 17.58 కోట్లు ఉన్నాయి. ఈ పాన్ కార్డులకు ఆధార్ నెంబర్ లింక్ చేయడానికి 2020 మార్చి 31 వరకు మాత్రమే గడువు ఉంది. ఇప్పటికే 8 సార్లు గడువు పెంచిన ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ మరోసారి గడువు పెంచే అవకాశం కనిపించట్లేదు. మరి అప్పటివరకు కూడా పాన్-ఆధార్ నెంబర్లు లింక్ చేయకపోతే ఏం జరుగుతుంది? మార్చి 31 తర్వాత పాన్ కార్డులు పనిచేయవా? మళ్లీ కొత్త పాన్ కార్డులకు దరఖాస్తు చేసుకోవాల్సిందేనా? మరి పాత కార్డులు ఏమవుతాయి? ఇలాంటి అనుమానాలు, సందేహాలు చాలామందిలో ఉన్నాయి.
మార్చి 31 లోగా ఆధార్ నెంబర్ లింక్ చేయని పాన్ కార్డులు చెల్లకుండా పోతాయి. అంటే మార్చి 31 తర్వాత వాటిని ఎక్కడా ఉపయోగించడానికి వీలు లేదు. కారణం ఆధారం నెంబర్ లింక్ చేయకపోవడమే. ఎక్కడైనా ఆ పాన్ కార్డ్ ఉపయోగించాలని చూసినా అది చెల్లదు. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్-CBDT ఆదాయపు పన్ను నిబంధనలు-1962 లో సవరణలు చేసింది. రూల్ నెంబర్ 114ఏఏలో సబ్ సెక్షన్ 114ఏఏఏ నిబంధనను పొందుపర్చింది. దీని ప్రకారం 2017 జూలై 1 కన్నా ముందు పాన్ కార్డులు తీసుకున్నవారు తప్పనిసరిగా 2020 మార్చి 31 లోగా తమ ఆధార్ నెంబర్లను వెల్లడించాలి. లేకపోతే మార్చి 31 తర్వాత వారి పాన్ కార్డులు చెల్లవు. వాళ్లు ఆధార్ నెంబర్ వెల్లడించనంత వరకు ఈ పాన్ కార్డులు చెల్లనివిగా ఉండిపోతాయి. ఆ తర్వాత మీరు ఎప్పుడు మీ ఆధార్ నెంబర్ను లింక్ చేస్తే అప్పటి నుంచే ఆ పాన్ కార్డులు చెల్లుతాయి. పాన్ కార్డులు చెల్లకపోతే మీరు చాలావరకు ట్రాన్సాక్షన్స్ చేయడం సాధ్యం కాదు. ఏఏ ట్రాన్సాక్షన్స్కి పాన్ కార్డు తప్పనిసరో తెలుసుకునేందుకు
ఇక్కడ క్లిక్ చేయండి.
మరి మీ దగ్గర పాన్ కార్డు ఉన్నట్టైతే తప్పనిసరిగా ఆధార్ నెంబర్ను లింక్ చేయాల్సిందే. లేకపోతే మీ పాన్ కార్డు నిరుపయోగంగా పడి ఉంటుంది తప్ప ఎక్కడా వాడటం సాధ్యం కాదు. పాన్-ఆధార్ లింక్ చేయడానికి మార్చి 31 వరకు మాత్రమే గడువు ఉంది. పాన్-ఆధార్ ఎలా లింక్ చేయాలో
ఇక్కడ క్లిక్ చేయండి. మీరు గతంలోనే పాన్-ఆధార్ లింక్ చేసినట్టైతే స్టేటస్ ఓసారి చెక్ చేసుకోండి. లింకింగ్ ప్రాసెస్ పూర్తైందో లేదో తెలుసుకోవచ్చు. పాన్-ఆధార్ లింక్ స్టేటస్ కోసం
ఇక్కడ క్లిక్ చేయండి.
ఇవి కూడా చదవండి:
PAN card rule: మీరు ఆఫీసులో పాన్ నెంబర్ ఇవ్వకపోతే జీతంలో కోత తప్పదు
ePAN Card: ఐదు నిమిషాల్లో ఇ-పాన్ కార్డు తీసుకోవచ్చు ఇలా
PAN Card: రెండు పాన్ కార్డులు ఉన్నాయా? ఇలా చేయండిPublished by:Santhosh Kumar S
First published:February 18, 2020, 12:16 IST