ఆధార్ లింక్ చేయని పాన్ కార్డుల్ని జూన్ 30 వరకే ఉపయోగించగలరు. ఆ తర్వాత ఆధార్ లింక్ చేయని పాన్ కార్డులన్నీ చెల్లనివే. పాన్ కార్డుకు ఆధార్ నెంబర్ లింక్ చేయాలని కేంద్ర ప్రభుత్వం చాలాకాలంగా కోరుతున్న సంగతి తెలిసిందే. పాన్-ఆధార్ లింక్ చేయడానికి అనేకసార్లు గడువు పొడిగించింది. చివరిసారి 2021 మార్చి 31 వరకు అవకాశం ఇచ్చింది. ఆ గడువు ముగియడంతో 2021 జూన్ 30 వరకు గడువు పొడిగిస్తూ మరో అవకాశం ఇచ్చింది. అంటే మరో రెండు వారాల గడువు మాత్రమే ఉంది. అప్పట్లోగా పాన్ కార్డ్, ఆధార్ నెంబర్ లింక్ చేయాల్సిందే. లేకపోతే ఆ పాన్ కార్డు చెల్లదు. 2021 జూలై 1 తర్వాత కూడా లింక్ చేయొచ్చు. కానీ ఆదాయపు పన్ను చట్టం, 1961 లోని కొత్త సెక్షన్ 234హెచ్ ప్రకారం రూ.1,000 జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు ఇప్పటికే మీ పాన్ కార్డ్, ఆధార్ నెంబర్ లింక్ చేసినట్టైతే స్టేటస్ ఇక్కడ క్లిక్ చేసి తెలుసుకోండి.
పాన్, ఆధార్ నెంబర్ లింక్ చేయకపోతే పాన్ కార్డ్ ఇనాపరేటీవ్‌గా మారుతుంది. అంటే పాన్ కార్డ్ చెల్లదు. 2021 జూలై 1 నుంచి ఆధార్ నెంబర్ లింక్ చేయని పాన్ కార్డును ఎక్కడా ఉపయోగించకూడదు. పాన్ కార్డు లేకపోతే బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయడం సాధ్యం కాదు. మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులు పెట్టడం వీలు కాదు. స్టాక్ మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేయడానికి డీమ్యాట్ అకౌంట్ కావాలి. కానీ ఆధార్ లింక్ చేయని పాన్ కార్డుతో డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేయలేరు. ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయాలన్నా పాన్ కార్డ్ తప్పనిసరి. రూ.50,000 కన్నా ఎక్కువ లావాదేవీలు జరపాలన్నా పాన్ కార్డు కావాల్సిందే. అందుకే జూన్ 30 లోపు పాన్, ఆధార్ నెంబర్ లింక్ చేయడం మంచిది.
Online Gold: ఆన్‌లైన్‌లో నగలు కొనేముందు ఈ 9 టిప్స్ గుర్తుంచుకోండి
SBI Offer: ఎస్‌బీఐలో ఆ అకౌంట్ ఉన్నవారికి రూ.2,00,000 ఉచిత ఇన్స్యూరెన్స్
పాన్ కార్డ్, ఆధార్ నెంబర్ లింక్ చేయడానికి 4 పద్ధతులు ఉన్నాయి. ఎస్ఎంఎస్ ద్వారా, ఆన్‌లైన్‌లో వెంటనే పాన్ ఆధార్ లింక్ చేయొచ్చు. ఇవి కాకుండా ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేసేప్పుడు, పాన్ కార్డ్ దరఖాస్తులో కూడా పాన్, ఆధార్ నెంబర్ లింక్ చేసే అవకాశం ఉంది.
SMS: ఎస్ఎంఎస్ ద్వారా పాన్, ఆధార్ నెంబర్ లింక్ చేయడానికి ఆదాయపు పన్ను శాఖ సూచించిన ఫార్మాట్‌లో ఎస్ఎంఎస్ పంపాల్సి ఉంటుంది. UIDPAN అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి 12 అంకెల ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి స్పేస్ ఇచ్చి 10 డిజిట్ పాన్ నెంబర్ ఎంటర్ చేసి 567678 లేదా 56161 నెంబర్లకు ఎస్ఎంఎస్ పంపాలి. ఉదాహరణకు మీ ఆధార్ నెంబర్ 123456789876, మీ పాన్ నెంబర్ BBBBB1111H అనుకుందాం. UIDPAN 123456789876 BBBBB1111H అని టైప్ చేసి ఎస్ఎంఎస్ పంపాలి.
LIC Policy: మీ జీతంలో కొంత పొదుపు చేయండి... మెచ్యూరిటీ తర్వాత రూ.70 లక్షలు మీవే
SBI Alert: మీకు బ్యాంక్ అకౌంట్ ఉందా? జూన్ 30 లోగా ఈ పనిచేయండి
Online: ఆన్‌లైన్‌లో పాన్, ఆదార్ లింక్ చేయడానికి https://www.incometax.gov.in/ వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి. హోమ్ పేజీలో Link Aadhaar ఆప్షన్ కనిపిస్తుంది. క్లిక్ చేయాలి. కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. పాన్ నెంబర్, ఆధార్ నెంబర్, ఆధార్ కార్డులో ఉన్నట్టుగా పేరు, మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. Link Aadhaar పైన క్లిక్ చేస్తే పాన్, ఆధార్ నెంబర్లు లింక్ అవుతాయి.
Income Tax Returns: మీరు ప్రతీ ఏటా ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేస్తున్నారా? అయితే ఐటీ రిటర్న్స్ ఫైల్ చేసే సమయంలో మీ పాన్ నెంబర్, ఆధార్ నెంబర్ వెల్లడిస్తే సరిపోతుంది.
PAN Card Application: కొత్తగా పాన్ కార్డ్ తీసుకుంటున్నారా? ఇప్పటికే ఉన్న పాన్ కార్డులో ఏవైనా మార్పులు చేస్తున్నారా? అప్లికేషన్ ఫామ్‌లో ఆధార్ నెంబర్ వెల్లడిస్తే మీ పాన్ నెంబర్, ఆధార్ నెంబర్ లింక్ అవుతాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Aadhaar Card, Aadhaar card, AADHAR, PAN, PAN card, Personal Finance, UIDAI