హోమ్ /వార్తలు /బిజినెస్ /

PAN-Aadhaar Link: పాన్‌ను ఆధార్‌తో లింక్ చేయలేదా..? జూన్ 30 నుంచి మీరు లోన్ తీసుకోలేరు! 

PAN-Aadhaar Link: పాన్‌ను ఆధార్‌తో లింక్ చేయలేదా..? జూన్ 30 నుంచి మీరు లోన్ తీసుకోలేరు! 

(ప్రతీకాత్మక చిత్రం)

(ప్రతీకాత్మక చిత్రం)

పాన్, ఆధార్‌ లింక్ చేయకపోతే.. జూన్ 30 తర్వాత, పాన్ కార్డ్ పనిచేయదు. అంటే రుణాలు సహా వివిధ సేవలను పొందేందుకు దీనిని హోల్డర్లు ఉపయోగించలేరు. మరి ఈ రెండింటినీ లింక్ ఎలా చేయాలో తెలుసుకుందాం.

  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

PAN-Aadhaar Link: ఆదాయ పన్ను చట్టం-1961 ప్రకారం పాన్ కార్డును ప్రతి ఒక్కరూ ఆధార్ కార్డుతో అనుసంధానం (PAN-Aadhaar Link) చేయడం తప్పనిసరి. భారత ప్రభుత్వం ఈ రెండిటినీ లింక్ చేయడానికి గడువును జూన్ 30 వరకు పొడిగించింది. గతంలో గడువు మార్చి 31 వరకే ఉండగా దీనిని ఇటీవలే పొడిగించింది. అప్పటి వరకు, పాన్‌ను ఆధార్‌తో లింక్ చేయని వ్యక్తులు తమ పాన్ కార్డ్‌ని ఎలాంటి ఇబ్బందులు లేకుండా వినియోగించవచ్చు. కానీ జూన్ 30 తర్వాత, పాన్ కార్డ్ పనిచేయదు. అంటే రుణాలు సహా వివిధ సేవలను పొందేందుకు దీనిని హోల్డర్లు ఉపయోగించలేరు. మరి ఈ రెండింటినీ లింక్ ఎలా చేయాలో తెలుసుకుందాం.

ఆదాయపు పన్ను శాఖ ఆదేశం ప్రకారం, గడువుకు ముందే పాన్, ఆధార్‌లను లింక్ చేయాలని IDFC ఫస్ట్ బ్యాంక్ తన వినియోగదారులకు తెలియజేసింది. అలా చేయడంలో విఫలమైతే కొత్త రుణం మంజూరు చేయడం కుదరదని వివరించింది. మరో మాటలో చెప్పాలంటే, జూన్ 30 లోపు తమ పాన్‌ను ఆధార్‌తో లింక్ చేయని వారు లింకింగ్ ప్రక్రియను పూర్తి చేసే వరకు కొత్త రుణాలు పొందలేరు. రుణాలు మాత్రమే కాదు పాన్ కార్డు నిరుపయోగంగా మారడం వల్ల చాలా పనులను చేయడం కుదరదు. అవేవో తెలుసుకుందాం.

జూన్ 30 గడువులోగా మీరు మీ పాన్‌ను ఆధార్‌తో లింక్ చెయ్యని పక్షంలో.. మీరు మీ PANని ఉపయోగించి పన్ను రిటర్న్‌లను ఫైల్ చేయలేరు. ఎందుకంటే అది నిరుపయోగంగా/ చెల్లుబాటు కాని కార్డుగా మారుతుంది. దీనివల్ల పెండింగ్‌లో ఉన్న రిటర్న్‌లు ప్రాసెస్ అవ్వవు. పెండింగ్‌లో ఉన్న రీఫండ్‌లు జారీ కావు. పెండింగ్‌లో ఉన్న ప్రక్రియలు పూర్తి చేయడం కూడా కుదరదు. పాన్ పని చేయని కారణంగా ఐటీ డిపార్ట్‌మెంట్ పన్నును అధిక రేటు వద్ద డిడక్ట్ చేయాల్సి వస్తుంది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ (CBDT) ప్రకారం, మీ పాన్ పనిచేయకపోతే, మీరు మీ పాన్‌ను అందించలేదని, తెలియజేయలేదని లేదా కోట్ చేయలేదని భావించడం జరుగుతుంది. అలానే ఆర్థిక లావాదేవీలకు ముఖ్యమైన KYC ప్రమాణాలలో PAN ఒకటి కాబట్టి ట్రాన్సాక్షన్లలో ఇబ్బందులు ఎదురవుతాయి.

Bajaj-Triumph: త్వరలో మార్కెట్లోకి బజాజ్-ట్రయంఫ్ మోటార్‌సైకిల్.. ధర, స్పెసిఫికేషన్స్ ఇవే..

* SMS ద్వారా ఆధార్, పాన్‌ లింక్ చేయడం ఎలా?

స్టెప్ 1: SMS కంపోజర్‌లో “UIDPAN < 12 అంకెల ఆధార్ నంబర్ > < 10 అంకెల పాన్ >" అని టైప్ చేయాలి.

స్టెప్ 2: మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌ని ఉపయోగించి 56161 లేదా 567678కి ఈ SMS పంపాలి.

* ఆదాయ పన్ను శాఖ పోర్టల్ ద్వారా లింక్ చేయడం ఎలా?

స్టెప్ 1: IT ఈ-ఫైలింగ్ పోర్టల్ అయిన ‘https://www.incometax.gov.in/iec/foportal/’ కి వెళ్లాలి.

స్టెప్ 2: వెబ్‌పేజీలోని ‘క్విక్ లింక్స్‌’ సెక్షన్‌లో ‘లింక్ ఆధార్’ ఆప్షన్‌పై నొక్కాలి.

స్టెప్ 3: ఇప్పుడు కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. ఇక్కడ పాన్ నంబర్, ఆధార్ నంబర్, మీ పేరు వంటి ఇతర అవసరమైన వివరాలు ఎంటర్ చేయాలి. స్క్రీన్‌పై కనిపిస్తున్న సూచనలను ఫాలో అవుతూ అవసరమైన వివరాలు ఇవ్వాలి. అంతే, మీ ఆధార్ పాన్ కార్డుతో లింక్ అవుతుంది. కాగా ఇప్పుడు పాన్-ఆధార్ లింక్ చేసుకునేవారు రూ.1,000 ఆలస్య రుసుముగా చెల్లించాల్సి ఉంటుంది.

First published:

Tags: AADHAR, PAN card

ఉత్తమ కథలు