మార్చి వచ్చిందంటే అనేక ఆర్థిక అంశాలకు డెడ్‌లైన్స్ వస్తుంటాయి. ఎక్కువగా ఆర్థిక లావాదేవీలు (Financial Transactions) జరిపేవారికి మార్చి చాలా ముఖ్యమైన నెల. మార్చి నెలాఖరులోగా పూర్తి చేయాల్సిన పనులు చాలా ఉంటాయి. మార్చి ముగియడానికి మరో 9 రోజులు మాత్రమే గడువు ఉంది. అనేక అంశాలకు సంబంధించి మార్చి 31 చివరి తేదీగా ఉంది. ఆ పనులన్నీ మార్చి 31 లోగా పూర్తి చేయాల్సి ఉంటుంది. మరి ఆర్థిక అంశాలకు సంబంధించి మార్చి 31 లోగా పూర్తి చేయాల్సిన డెడ్‌లైన్స్ ఏంటీ? మీరేం చేయాలి? తెలుసుకోండి.
PAN Aadhaar Link: మీ పాన్ కార్డుకు ఆధార్ నెంబర్ ఇంకా లింక్ చేయలేదా? ఇప్పటికే ఆదాయపు పన్ను శాఖ అనేక సార్లు గడువు పెంచింది. 2021 సెప్టెంబర్ 30 గా ఉన్న గడువును 2022 మార్చి 31 వరకు పొడిగించింది. అప్పట్లోగా పాన్ కార్డ్ ఉన్నవారంతా తప్పనిసరిగా ఆధార్ నెంబర్ లింక్ చేయాలి. లేకపోతే రూ.10,000 వరకు జరిమానా చెల్లించాల్సి రావొచ్చు.
IRCTC BoB Credit Card: రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్... మీకోసం కొత్త క్రెడిట్ కార్డ్
Link your PAN & Aadhaar to enable quick & easy e-verification of ITRs. The due date to link your Aadhaar & PAN is 31st March, 2022. Link today! Pl visit: https://t.co/GYvO3n9wMf #ITR #LinkNow pic.twitter.com/qBqKd9Hi0J
— Income Tax India (@IncomeTaxIndia) March 21, 2022
Tax Savings: పన్ను ఆదా చేయాలనుకునేవారు మార్చిలో ఎక్కువగా లైఫ్ ఇన్స్యూరెన్స్, టర్మ్ ఇన్స్యూరెన్స్, హెల్త్ ఇన్స్యూరెన్స్ కొంటూ ఉంటారు. మరి మీరు కూడా పన్ను ఆదా చేసే ఆలోచనలో ఉన్నారా? అయితే మార్చి 31 లోగా ఇలాంటి ఇన్స్యూరెన్స్ స్కీమ్స్ లేదా సుకన్య సమృద్ధి యోజన, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ లాంటి అకౌంట్స్‌లో చేరొచ్చు.
Income Tax Returns: మీరు 2020-21 ఆర్థిక సంవత్సరం అంటే 2021-22 అసెస్‌మెంట్ ఇయర్‌కు సంబంధించిన ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఇంకా ఫైల్ చేయలేదా. 2022 మార్చి 31 లోగా బిలేటెడ్ ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేసే ఛాన్స్ ఉంది. ఈ డెడ్‌లైన్ మిస్ అయితే రూ.5,000 వరకు జరిమానా చెల్లించాల్సి రావొచ్చు.
Aadhaar Card: మీ ఆధార్ కార్డును ఎక్కడెక్కడ వాడారు? సింపుల్‌గా తెలుసుకోండిలా
Bank Account: మీకు బ్యాంక్ అకౌంట్ ఉందా? మరి మీ కేవైసీ వివరాలన్నీ అప్‌డేట్‌గా ఉన్నాయా? 2022 మార్చి 31 లోగా మీ కేవైసీ వివరాలు అప్‌డేట్ చేయడం తప్పనిసరి. వాస్తవానికి ఈ డెడ్‌లైన్ 2021 డిసెంబర్ 31న ముగుస్తుందని గతంలోనే ప్రకటించింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. కానీ కరోనా వైరస్ మహమ్మారి ప్రభావాన్ని దృష్టిలో పెట్టుకొని డెడ్‌లైన్ పొడిగించింది.
PMAY: ప్రధాన మంత్రి ఆవాస్ యోజన (PMAY) స్కీమ్ ద్వారా క్రెడిట్ లింక్డ్ సబ్సిడీ స్కీమ్ పొందాలనుకుంటున్నారా? ఈ స్కీమ్‌లో చేరడానికి 2022 మార్చి 31 చివరి తేదీ. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన స్కీమ్ ద్వారా 6.50 శాతం నుంచే హోమ్ లోన్ పొందొచ్చు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.