హోమ్ /వార్తలు /బిజినెస్ /

PAN Aadhaar Link: కొత్త వెబ్‌సైట్‌లో పాన్ కార్డ్, ఆధార్ నెంబర్ లింక్ చేయండి ఇలా

PAN Aadhaar Link: కొత్త వెబ్‌సైట్‌లో పాన్ కార్డ్, ఆధార్ నెంబర్ లింక్ చేయండి ఇలా

PAN Aadhaar Link: కొత్త వెబ్‌సైట్‌లో పాన్ కార్డ్, ఆధార్ నెంబర్ లింక్ చేయండి ఇలా
(ప్రతీకాత్మక చిత్రం)

PAN Aadhaar Link: కొత్త వెబ్‌సైట్‌లో పాన్ కార్డ్, ఆధార్ నెంబర్ లింక్ చేయండి ఇలా (ప్రతీకాత్మక చిత్రం)

PAN Aadhaar Link | ఇటీవల ఇన్‌కమ్ ట్యాక్స్ కొత్త వెబ్‌సైట్ లాంఛ్ అయిన సంగతి తెలిసిందే. కొత్త ఇ-ఫైలింగ్ పోర్టల్‌లో పాన్, ఆధార్ నెంబర్లు ఎలా లింక్ చేయాలో తెలుసుకోండి.

మీరు మీ పాన్ నెంబర్, ఆధార్ నెంబర్ లింక్ చేశారా? ఇంకా చేయలేదా? 2021 సెప్టెంబర్ 30 లోగా పాన్ కార్డ్, ఆధార్ నెంబర్ లింక్ చేయాల్సిందే. లేకపోతే పాన్ కార్డ్ ఇనాక్టీవ్‌గా మారుతుంది. అంటే ఆధార్ నెంబర్ లింక్ చేయని పాన్ కార్డ్ చెల్లదు. ఆ పాన్ కార్డును ఎక్కడా ఉపయోగించడానికి వీల్లేదు. ఒకవేళ ఆధార్ లింక్ చేయని పాన్ కార్డ్ ఉపయోగిస్తే ఫైన్ చెల్లించాల్సి వస్తుంది. కాబట్టి గడువు లోగా పాన్ కార్డు ఉన్నవారంతా తమ ఆధార్ నెంబర్‌ను లింక్ చేయాల్సిందే. పాన్ కార్డ్, ఆధార్ నెంబర్ లింక్ చేయడానికి వేర్వేరు పద్ధతులు ఉన్నాయి. ఆదాయపు పన్ను శాఖ వెబ్‌సైట్‌లో కూడా పాన్ ఆధార్ నెంబర్ లింక్ చేయొచ్చు. ఇ-ఫైలింగ్ పోర్టల్ 2.0 వెబ్‌సైట్‌లో కూడా పాన్ ఆధార్ లింక్ చేసే విధానం కాస్త మారింది. మరి కొత్త వెబ్‌సైట్‌లో పాన్, ఆధార్ ఎలా లింక్ చేయాలో తెలుసుకోండి.

PM Ujjwala Scheme 2.0: ఉచితంగా గ్యాస్ కనెక్షన్, గ్యాస్ సిలిండర్... అప్లై చేయండి ఇలా

IRCTC: ఐఆర్‌సీటీసీ బిజినెస్ ఆఫర్... నెలకు రూ.80,000 సంపాదించండి ఇలా

PAN Aadhaar Link: పాన్, ఆధార్ నెంబర్లు లింక్ చేయండి ఇలా


పాన్ కార్డ్ హోల్డర్లు ముందుగా ఆదాయపు పన్ను శాఖ వెబ్‌సైట్ https://www.incometax.gov.in/ ఓపెన్ చేయాలి.

ఇటీవల రూపొందించిన కొత్త వెబ్‌సైట్ ఓపెన్ అవుతుంది.

హోమ్ పేజీలోనే Link Aadhaar లింక్ కనిపిస్తుంది. క్లిక్ చేయాలి.

మొదట పాన్ నెంబర్ ఎంటర్ చేయాలి. రెండో కాలమ్‌లో ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి.

ఆ తర్వాత ఆధార్ కార్డులో ఉన్నట్టుగా పేరు టైప్ చేయాలి.

తర్వాత మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి.

ఒకవేళ మీ ఆధార్ కార్డుపై పుట్టిన సంవత్సరం మాత్రమే ఉంటే I have only year of birth in Aadhaar card సెలెక్ట్ చేయాలి.

ఆ తర్వాత I agree to validate my Aadhaar details సెలెక్ట్ చేయాలి.

తర్వాత Link Aadhaar క్లిక్ చేస్తే మీ మొబైల్ నెంబర్‌కు ఓటీపీ వస్తుంది.

ఓటీపీ ఎంటర్ చేసి Validate పైన క్లిక్ చేయాలి.

మీ పాన్ కార్డ్, ఆధార్ నెంబర్ లింక్ అవుతుంది.

ఒకవేళ మీ పాన్, ఆధార్ నెంబర్ ముందే లింక్ అయితే Your PAN is already linked to given Aadhaar అనే మెసేజ్ కనిపిస్తుంది.

Online Business: రూ.12 లక్షల పెట్టుబడితో బిజినెస్... కోట్ల రూపాయల టర్నోవర్

Aadhaar Number: ఆధార్ నెంబర్ వెరిఫై చేయాలా? ఈ స్టెప్స్ ఫాలో అవండి

PAN Aadhaar Link: పాన్, ఆధార్ లింక్ స్టేటస్ తెలుసుకోండి ఇలా


మీరు ముందే పాన్ కార్డ్, ఆధార్ నెంబర్ లింక్ చేసినట్టైతే https://www.incometax.gov.in/ వెబ్‌సైట్‌లో స్టేటస్ తెలుసుకోవచ్చు.

ముందుగా https://www.incometax.gov.in/ వెబ్‌సైట్ ఓపెన్ చేసిన తర్వాత Link Aadhaar Status లింక్ క్లిక్ చేయాలి.

పాన్ నెంబర్, ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి.

View Link Aadhaar Status పైన క్లిక్ చేయాలి.

మీ పాన్ నెంబర్, ఆధార్ నెంబర్ లింక్ అయిందో లేదో స్టేటస్ తెలుస్తుంది.

First published:

Tags: Aadhaar Card, Aadhaar card, AADHAR, PAN, PAN card

ఉత్తమ కథలు