హోమ్ /వార్తలు /బిజినెస్ /

Money Tasks: ఆధార్‌కు పాన్‌ లింక్‌ చేశారా? మార్చి 31లోగా పూర్తిచేయాల్సిన మనీ టాస్క్స్ ఇవే

Money Tasks: ఆధార్‌కు పాన్‌ లింక్‌ చేశారా? మార్చి 31లోగా పూర్తిచేయాల్సిన మనీ టాస్క్స్ ఇవే

Money Tasks: 2022 మార్చి 31 లేదా అంతకు ముందు పూర్తి చేయాల్సిన 8 ముఖ్యమైన ఆర్థిక సంబంధమైన పనులు ఇవే. తప్పకుండా వీటిని పూర్తి చేయాలి. లేదంటే మీరే ఇబ్బంది పడాల్సి వస్తుంది.

Money Tasks: 2022 మార్చి 31 లేదా అంతకు ముందు పూర్తి చేయాల్సిన 8 ముఖ్యమైన ఆర్థిక సంబంధమైన పనులు ఇవే. తప్పకుండా వీటిని పూర్తి చేయాలి. లేదంటే మీరే ఇబ్బంది పడాల్సి వస్తుంది.

Money Tasks: 2022 మార్చి 31 లేదా అంతకు ముందు పూర్తి చేయాల్సిన 8 ముఖ్యమైన ఆర్థిక సంబంధమైన పనులు ఇవే. తప్పకుండా వీటిని పూర్తి చేయాలి. లేదంటే మీరే ఇబ్బంది పడాల్సి వస్తుంది.

  2022 మార్చి నాటికి ఆర్థిక వ్యవహారాలకు సంబంధించిన వివిధ ముఖ్యమైన పనులకు గడువు పూర్తవుతుంది. పాన్- ఆధార్ లింకింగ్ (PAN-Aadhaar Linking), రివైజ్డ్ లేదా ఆలస్యంగా ఐటీఆర్‌ ఫైల్‌  (ITR Filing) చేయడం, బ్యాంక్ ఖాతా కేవైసీ అప్‌డేట్‌, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF), నేషనల్ పెన్షన్ సిస్టమ్ (NPS) వంటి చిన్న పొదుపు పథకాలకు సంబంధించి కనీస పెట్టుబడి, ఇతర ఆర్థికపరమైన వ్యవహారాలకు 2022 మార్చి 31వ తేదీకి గడువు ముగుస్తుంది.  2022 మార్చి 31 లేదా అంతకు ముందు పూర్తి చేయాల్సిన 8 ముఖ్యమైన ఆర్థిక సంబంధమైన పనులు ఇవే..

  * ఆలస్యంగా లేదా రివైజ్డ్‌ ఐటీఆర్‌ ఫైలింగ్‌ (Revised income tax return (ITR) filing)

  అసెస్‌మెంట్‌ ఇయర్‌ 2021-22కు సంబంధించి ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ రిటర్న్స్‌(ఐటీఆర్‌ ) ఫైల్‌ చేయడానికి 2022 మార్చి 31వ తేదీ గడువు. ఇచ్చిన గడువు లోగా ఐటీఆర్‌ ఫైల్ చేయడంలో విఫలమైన పన్ను చెల్లింపుదారులు తమ ఆలస్యమైన ఆదాయపు పన్ను రిటర్న్‌ను మార్చి 31వ తేదీలోపు ఫైల్‌ చేయాలని అధికారులు సూచించారు. ఆర్థిక సంవత్సరం 2020-21కి సంబంధించి ఆలస్యంగా లేదా రివైజ్డ్‌ ఐటీఆర్‌ని ఫైల్ చేయడానికి 2021 మార్చి 31 గడువు. పన్ను చెల్లింపుదారు ఐటీఆర్‌ని ఆన్‌లైన్‌లో ఫైల్ చచేస్తే.. మార్చి 31లోపు సవరించవచ్చు.

  * పాన్- ఆధార్ లింక్ చేయడం (PAN-Aadhaar linking):

  ఆధార్ కార్డ్‌తో పాన్‌ నంబర్‌ లింక్‌ చేయడానికి కూడా 2022 మార్చి 31 గడువు. గడువులోపు లింక్‌ చేయకపోతే పాన్ కార్డ్ పనిచేయదు. సెక్షన్ 272B ప్రకారం.. చెల్లని PAN కార్డ్‌ని కలిగి ఉంటే రూ.10,000 జరిమానా విధిస్తారు. బ్యాంకు డిపాజిట్ వడ్డీపై టీడీఎస్‌ రెట్టింపు అవుతుంది.

  రూ. లక్ష కోట్ల ఆర్డర్​ వాల్యూను సాధించిన ఈ–మార్కెట్ ప్లేస్​ పోర్టల్​.. ప్రధాని మోదీ

  * బ్యాంక్ ఖాతా కేవైసీ అప్‌డేట్ (Bank account KYC update):

  2021 చివరిలో పెరుగుతున్న ఒమిక్రాన్‌ వవ్యాప్తితో బ్యాంక్ ఖాతా కేవైసీ అప్‌డేట్ గడువును 2021 డిసెంబర్ 31 నుంచి 2022 మార్చి 31కి ఆర్‌బీఐ పొడిగించింది. గడువులోపు కకేవైసీ అప్‌డేట్ చేసుకోకపోతే బ్యాంక్ ఖాతా స్తంభింపజేయవచ్చు.

  * ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ తగ్గించే ఇన్వెస్ట్‌మెంట్స్‌  (Investments to reduce income tax):

  మార్చి చివరిలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగుస్తుంది. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF), నేషనల్ పెన్షన్ సిస్టమ్ (NPS), ELSS మ్యూచువల్ ఫండ్‌ తదితర పన్ను ఆదా పథకాల్లో పన్ను చెల్లింపుదారులు పెట్టుబడులు పెడతారు. పన్ను ఆదా చేసుకొనేందుకు అవసరమైన ప్రణాళికను మార్చి 31వ తేదీలోగా చేసుకోవాలి.

  * స్మాల్‌ సేవింగ్స్‌ స్కీమ్స్‌ను బ్యాంక్/ పోస్టాఫీసు ఖాతాలకు లింక్‌ (Linking small savings scheme with bank account/post office savings:

  MIS/SCSS/TD ఖాతాలపై వడ్డీని ఖాతాదారుని PO సేవింగ్స్ ఖాతా లేదా బ్యాంక్ ఖాతాలో మాత్రమే 2022 ఏప్రిల్ 1 నుంచి జమ చేస్తామని తపాలాశాఖ నోటీసు జారీ చేసింది. సకాలంలో వడ్డీ పొందడానికి స్మాల్‌ సేవింగ్స్‌ స్కీమ్స్‌ను పోస్టాఫీసు ఖాతా, బ్యాంక్ ఖాతాతో లింక్ చేయాలి.

  SBI Working On Holidays: ఏపీలో ఈ శని, ఆదివారాల్లో పనిచేయనున్న ఎస్బీఐ.. కేవలం వీరికి మాత్రమే అవకాశం..

  * పీఎం కిసాన్ కేవైసీ అప్‌డేట్‌ (PM Kisan KYC update):

  పీఎం కిసాన్‌లో నమోదు చేసుకొన్న రైతులకు ఈ-కేవైసీ తప్పనిసరి చేశారు. నమోదు చేసుకున్న పీఎం కిసాన్ రైతులు తమ కేవైసీని మార్చి 31లోగా ఆన్‌లైన్‌లో లేదా ఆఫ్‌లైన్‌లో తప్పనిసరిగా అప్‌డేట్ చేయాలి. గడువులో చేసుకోలేకపోతే తదుపరి పీఎం కిసాన్ ఇన్‌స్టాల్‌మెంట్ అందదు.

  * PPF, NPS ఖాతాలలో కనీస పెట్టుబడులు (Maintaining minimum contribution on PPF, NPS account):

  ఆదాయపు పన్నును తగ్గించుకోవడం కోసం సంపాదించే వ్యక్తి PPF, NPS ఖాతాలో పెట్టుబడి పెడతారు. 2022 మార్చి ముగిసేలోపు, ఒక ఆర్థిక సంవత్సరంలో కనీసం అవసరమైన డబ్బును ఇన్వెస్ట్ చేశారా లేదా నిర్ధారించుకోవాలి. PPF ఖాతాలో కనీస వార్షిక డిపాజిట్ రూ.500 అయితే టైర్-1 NPS ఖాతాలో కనీస వార్షిక డిపాజిట్ ఒక్క ఆర్థిక సంవత్సరంలో రూ.1,000.

  * డీమ్యాట్‌, ట్రేడింగ్ ఖాతా కేవైసీ (KYC for demat and trading account):

  2021 ఏప్రిల్‌లో SEBI జారీ చేసిన సర్క్యులర్ ప్రకారం.. NSDL, CDSL ఆరు రకాల సమాచారాన్ని ధ్రువీకరించాలి. పేరు, చిరునామా, PAN, మొబైల్ నంబర్, ఈ-మెయిల్‌, ఆదాయ పరిధిని తెలుసుకోవాలి. ఇప్పటికే ఉన్న డీమ్యాట్‌, ట్రేడింగ్ ఖాతాలలో కూడా అప్‌డేట్ చేస్తారు.

  First published:

  Tags: Business, Money, Personal Finance

  ఉత్తమ కథలు