పాన్ కార్డ్ ఉన్నవారు తమ ఆధార్ నెంబర్ లింక్ (PAN Aadhaar Link) చేయాలని ఆదాయపు పన్ను శాఖ పదేపదే కోరుతున్న సంగతి తెలిసిందే. గతంలో చాలాసార్లు గడువు కూడా పొడిగించింది. ఆ గడువు 2022 మార్చి 31న ముగిసింది. అయితే జరిమానా చెల్లించి 2023 మార్చి 31 వరకు పాన్ కార్డ్, ఆధార్ నెంబర్ లింక్ చేయొచ్చు. అంటే ఈ నెలాఖరులోగా పాన్ నెంబర్, ఆధార్ నెంబర్ లింక్ చేయాలి. అప్పట్లోగా పాన్ కార్డుకు ఆధార్ నెంబర్ లింక్ చేయకపోతే ఆ తర్వాత అంటే 2023 ఏప్రిల్ 1 నుంచి ఆ పాన్ కార్డ్ చెల్లదు. దీంతో పాన్ కార్డ్ హోల్డర్స్ పలు సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ముఖ్యంగా ఆర్థిక లావాదేవీలు (Financial Transcations) జరిపేవారికి చిక్కులు తప్పవు. ప్రధానంగా 5 సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అవేంటో తెలుసుకోండి.
1. పాన్ కార్డ్ ఇనాపరేటీవ్‌గా మారుతుంది కాబట్టి ఆదాయపు పన్ను రిటర్న్స్ ఫైల్ చేయడం కుదరదు.
2. ఇప్పటికే ఆదాయపు పన్ను రిటర్న్స్ ఫైల్ చేసినా, పెండింగ్‌లో ఉన్న రిటర్న్స్ ప్రాసెస్ కావు.
3. ఇక గతంలోనే ఐటీ రిటర్న్స్ ఫైల్ చేసి రీఫండ్స్ కోసం ఎదురుచూస్తున్నట్టైతే పెండింగ్ రీఫండ్స్ రావు.
4 ఒక్కసారి పాన్ ఇనాపరేటీవ్‌గా మారినట్టైతే డిఫెక్టీవ్ రిటర్న్స్ విషయంలో పెండింగ్‌లో ఉన్న ప్రొసీడింగ్స్ కూడా చేయబడవు.
5. పాన్ కార్డ్ ఇనాపరేటీవ్‌గా మారుతుంది కాబట్టి ఎక్కువ రేట్ ప్రకారం పన్ను చెల్లించాల్సి ఉంటుంది.
Discount on Gold: 10 గ్రాముల గోల్డ్‌పై రూ.4,000 డిస్కౌంట్... ఇలా కొనేయండి
Urgent Notice! As per Income-tax Act, 1961, it is mandatory for all PAN holders, who do not come under the exempt category, to link their PAN with Aadhaar before 31.3.2023. From 1.04.2023, the unlinked PAN shall become inoperative. Please don’t delay, link it today! pic.twitter.com/YsysxzUjEJ
— Income Tax India (@IncomeTaxIndia) February 28, 2023
ఈ సమస్యలు ఉంటాయి కాబట్టి వీలైనంత త్వరగా పాన్ నెంబర్ ఆధార్ నెంబర్ లింక్ చేయాలి. రూ.1,000 జరిమానా చెల్లించి పాన్ ఆధార్ ఎలా లింక్ చేయాలో తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి. ఇక ఇప్పటికే పాన్ ఆధార్ లింక్ చేసినవారు స్టేటస్ చెక్ చేయాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేయండి. ఆదాయపు పన్ను చట్టం ప్రకారం మినహాయింపు కేటగిరీ పరిధిలోకి రాని పాన్ కార్డ్ హోల్డర్స్ తప్పనిసరిగా తమ ఆధార్ నెంబర్‌ను లింక్ చేయాల్సిందేనని ఆదాయపు పన్ను డిపార్ట్‌మెంట్ చెబుతోంది.
Rs 1 Crore Returns: నెలకూ రూ.300 పొదుపుతో కోటీశ్వరులు కావొచ్చు ఇలా
పాన్, ఆధార్ నెంబర్ లింక్ చేయాలనుకునేవారు కొన్ని విషయాలు గుర్తుంచుకోవాలి. పాన్ కార్డ్, ఆధార్ నెంబర్‌లోని పుట్టిన తేదీ ఒకేలా ఉంటేనే పాన్ నెంబర్, ఆధార్ నెంబర్ లింక్ అవుతుంది. అంతే కాదు పేరు, జెండర్ లాంటి వివరాలన్నీ ఒకేలా ఉండాలి. లేకపోతే పాన్, ఆధార్ లింకింగ్ ప్రాసెస్ ఫెయిల్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ముందుగా మీ పాన్ కార్డులో, ఆధార్ కార్డులోని వివరాలు సరిగ్గా ఉంటే సరైన వివరాలతో ఈ కార్డుల్ని మొదట అప్‌డేట్ చేయాలి. ఆ తర్వాత పాన్, ఆధార్ లింక్ చేయాలి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Aadhaar Card, ITR, ITR Filing, PAN card, Personal Finance