హోమ్ /వార్తలు /బిజినెస్ /

పాకిస్థాన్ స్టాక్ మార్కెట్‌పై ‘సర్జికల్ స్ట్రైక్’

పాకిస్థాన్ స్టాక్ మార్కెట్‌పై ‘సర్జికల్ స్ట్రైక్’

మార్చి: 
వాణిజ్య యుద్ధ భయాల నేపథ్యంలో ఆర్‌బీఐ పసిడి కొనుగోళ్లు జరిపింది. ఈ ఏడాది 6.5 టన్నుల మేర పసిడి కొనుగోలు చేసింది. దీంతో ఆర్‌బీఐ వద్ద పసిడి నిల్వలు 607 టన్నులకు చేరాయి.

మార్చి: వాణిజ్య యుద్ధ భయాల నేపథ్యంలో ఆర్‌బీఐ పసిడి కొనుగోళ్లు జరిపింది. ఈ ఏడాది 6.5 టన్నుల మేర పసిడి కొనుగోలు చేసింది. దీంతో ఆర్‌బీఐ వద్ద పసిడి నిల్వలు 607 టన్నులకు చేరాయి.

పాక్ మీద భారత్ సర్జికల్ స్ట్రైక్ జరిపిందన్న వార్త తెలిసిన వెంటనే కరాచీ స్టాక్ మార్కెట్లు కుదేలయ్యాయి. సుమారు 900 పాయింట్లు పడిపోయాయి.

    జైషే మహ్మద్ ఉగ్రవాద స్థావరాలపై భారత్ జరిపిన సర్జికల్ స్ట్రైక్ ప్రభావం ఒక్క టెర్రరిస్టుల మీదే కాదు.. కరాచీ స్టాక్ మార్కెట్ మీద భారీగా పడింది. పాకిస్థాన్ స్టాక్ మార్కెట్ భారీగా కుదేలైంది. ఏకంగా 785 పాయింట్లు నష్టపోయింది. పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోని బాలాకోట్, ముజఫరాబాద్, చకోటీ ప్రాంతాల్లో భారత వాయుసేన సర్జికల్ స్ట్రైక్ చేసింది. దీంతో సుమారు 350 మంది వరకు టెర్రరిస్టులు చనిపోయినట్టు అంచనా. జైషే మహ్మద్ టెర్రరిస్ట్ క్యాంప్ అయిన బాలాకోట్‌ మీద ప్రధానంగా ఎఫెక్ట్ పడింది. బాలాకోట్‌లో బాంబులు వేస్తే.. ఆ ప్రభావం కరాచీ స్టాక్ మార్కెట్ మీద కూడా పడింది.


    పాక్ మీద భారత్ సర్జికల్ స్ట్రైక్ జరిపిందన్న వార్త తెలిసిన వెంటనే కరాచీ స్టాక్ మార్కెట్లు కుదేలయ్యాయి. సుమారు 900 పాయింట్లు పడిపోయాయి. మంగళవారం 39,606 వద్ద ప్రారంభమైన మార్కెట్లు 785 పాయింట్లు నష్టపోయి 38,821 వద్ద ముగిశాయి. పుల్వామా ఉగ్రదాడి తర్వాత మార్కెట్లను భయం వెంటాడుతూనే ఉంది. ఫిబ్రవరి 14న ఉగ్రదాడి జరిగినప్పటి నుంచి ఫిబ్రవరి 26వ తేదీ వరకు సుమారు 1,685 పాయింట్లు కోల్పోయింది.

    First published:

    Tags: Pakistan, Pulwama Terror Attack, Surgical Strike 2

    ఉత్తమ కథలు