RBL Bank | మార్కెట్లోకి కొత్త క్రెడిట్ కార్డు వచ్చింది. పైసాబజార్ తాజాగా ఆర్బీఎల్ బ్యాంక్ (Bank) భాగస్వామ్యంతో ఈ కొత్త క్రెడిట్ కార్డును (Credit Card) లాంచ్ చేసింది. ఇందులో పలు రకాల బెనిఫిట్స్ ఉన్నాయి. క్యాష్‌బ్యాక్‌తో పాటుగా క్రెడిట్ లైన్ బెనిఫిట్ కూడా పొందొచ్చు. అంటే క్రెడిట్ కార్డు లిమిట్‌ను వెంటనే బ్యాంక్ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఈ కొత్త కో బ్రాండెడ్ క్రెడిట్ కార్డు పేరు డుయెట్. అతేకాకుండా ఇది లైఫ్ టైమ్ ఫ్రీ క్రెడిట్ కార్డు కావడం గమనార్హం.
ఈ కొత్త క్రెడిట్ కార్డు ద్వారా సులభంగానే క్యాష్ బ్యాక్ వంటివి పొందొచ్చు. దీని వల్ల ఫ్లెక్సిబుల్ లెండింగ్ ప్రొడక్ట్, వివిధ వాల్యూ యాడెడ్ సర్వీసులు పొందొచ్చని ఆర్బీఎల్ బ్యాంక్ పేర్కొంది. పైసా బజార్ జర్నీలో ఈ కొత్త డుయెట్ క్రెడిట్ కార్డు అనే మరో మైలు రాయి అని పైసా బజర్ సీనియర్ డైరెక్టర్ గౌరవ్ అగర్వాల్ తెలిపారు. కస్టమర్లకు విలువ చేకూర్చడమే లక్ష్యంగా ఈ క్రెడిట్ కార్డును తీసుకువచ్చామని వెల్లడించారు.
పరుగులు పెడుతోంది పట్టుకోండి.. వారంలోనే డబ్బు రెట్టింపు!
నియో లెండింగ్ స్ట్రాటజీలో భాగంగా ముందుకు వెళ్తున్నామని ఆయన తెలిపారు. ఎక్కువ మంది క్రెడిట్ యాక్సెస్ అందుబాటులో ఉండేలా ఈ కొత్త సర్వీసులు అందుబాటులోకి తీసుకువచ్చామని వివరించారు. కాగా ఈ కొత్త క్రెడిట్ కార్డు ద్వారా ఆన్లైన్, ఆఫ్‌లైన్ కొనుగోళ్లపై ఫ్లాట్ 1 శాతం తగ్గింపు సొంతం చేసుకోవచ్చు. అప్పర్ లిమిట్ అంటూ ఏమీ ఉండదు. అయితే ఫ్యూయెల్ కొనుగోలు, వాలెట్ లోడింగ్స్, రెంటల్ ట్రాన్సాక్షన్లు, లోన్ ట్రాన్సాక్షన్లకు మాత్రం ఇది వర్తిస్తుంది.
ఎలక్ట్రిక్ స్కూటర్.. ఒక్క రూపాయి ఆఫర్ అదిరింది!
పైసా ఆన్ డిమాండ్ క్రెడిట్ కార్డు స్థానంలో ఈ క్రెడిట్ కార్డును తీసుకువచ్చారు. ఈ కొత్త క్రెడిట్ ద్వారా రూ. 3 వేల నుంచి డబ్బులను బ్యాంక్‌కు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఈజీ ఈఎంఐ రూపంలో ఇలా ట్రాన్స్ఫర్ చేసుకున్న మొత్తాన్ని తిరిగి చెల్లించొచ్చు. రోజుల్లో ఎప్పుడైనా క్రెడిట్ కార్డులోని మొత్తాన్ని బ్యాంక్ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. కాగా రివార్డు పాయింట్ల రిడంప్షన్‌కు మాత్రం రూ.99 చెల్లించుకోవాల్సి వస్తుంది. అంతేకాకుండా పైసా బజార్ ఆర్బీఎల్ బ్యాంక్ సంయుక్తంగా మరో క్రెడిట్ కార్డును అందిస్తున్నాయి. దీని పేరు డూయెట్ ప్లస్ క్రెడిట్ కార్డు. అయితే ఇది ఉచితం మాత్రం కాదు. ప్రతి ఏటా ఫీజు కింద రూ. 1499 చెల్లించాల్సి ఉంటుంది. క్రెడిట్ కార్డు ద్వారా రూ. 4 లక్షలు ఖర్చు చేస్త ఈ ఫీజు మాఫీ బెనిఫిట్ పొందొచ్చు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bank, Bank account, Credit card, Money, Rbl