ఆతిథ్య సేవలు అందించే ఓయో(OYO) బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఆర్మీ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులకు డిస్కౌంట్ అందిస్తోంది. ఈ నెల 4న నేషనల్ డిఫెన్స్ అకాడమీ(NDA), కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్(CDS) పరీక్షలు జరగనున్నాయి. ఈ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు ఓయో ప్రాపర్టీస్‌లో బస చేస్తే 45 శాతం డిస్కౌంట్ ఇవ్వనుంది. దేశంలోని 19 ప్రధాన నగరాల్లో ఈ ఆఫర్‌ను ఓయో ప్రకటించింది. ఈ లిస్ట్‌లో ఢిల్లీ, బెంగళూరు, చెన్నై, గౌతమ్ బుద్ధ నగర్, గుర్గావ్, లక్నో, చండీగఢ్, హైదరాబాద్, అహ్మదాబాద్, జైపూర్, ఇండోర్, లూథియానా, భువనేశ్వర్, పాట్నా, విశాఖపట్నం, వారణాసి, కోల్‌కతా, పూణే, డెహ్రాడూన్ వంటి నగరాలు ఉన్నాయి. అయితే సదరు నగరాల్లోని సెలక్టెడ్ OYO ప్రాపర్టీలలో మాత్రమే ఈ ఆఫర్‌ను పొందే అవకాశం ఉంటుంది.
ఆఫర్ పొందండం ఎలా?
ఓయో డిస్కౌంట్ స్టే ఆఫర్ పొందాలంటే అభ్యర్థులు ఈ ప్రాసెస్ ఫాలో అవ్వాలి..
స్టే ఆఫర్‌పై ఓయో సీనియర్ వైస్ ప్రెసిడెంట్ శ్రీరంగ్ గాడ్‌బోలే మాట్లాడుతూ..‘ఎన్‌డీఏ, సీడీఎస్ పరీక్షలకు వచ్చే అభ్యర్థులకు వివిధ నగరాల్లో సరసమైన ధరలకు సౌకర్యవంతమైన బస అందించడం ఎంతో గౌరవంగా భావిస్తున్నాం. లొకేషన్, వారి బడ్జెట్ ప్రాధాన్యతల ఆధారంగా వివిధ రకాల హోటల్ బ్రాండ్స్‌ను వారు ఎంపిక చేసుకునే అవకాశం ఉంటుంది.’అని తెలిపారు.
గతేడాది 5.70 లక్షల దరఖాస్తులు
రక్షణ మంత్రిత్వ శాఖ వివరాల ప్రకారం.. గతేడాది ఎన్‌డీఏ పరీక్షలకు దాదాపు 5.70 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. అందులో 1.70 లక్షల మంది బాలికలు ఉన్నారు. అకాడమీలో మొదటి బ్యాచ్ మహిళా అభ్యర్థుల స్ఫూర్తితో ఈ ఏడాది ఎక్కువ మంది మహిళా అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
అడ్మిషన్ సంస్థలు ఇవే..
నేషనల్ డిఫెన్స్ అకాడమీ ఖడక్వాస్లా- పూణే, ఇండియన్ మిలిటరీ అకాడమీ- డెహ్రాడూన్, ది ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ- చెన్నై, ది ఇండియన్ నేవల్ అకాడమీ- ఎజిమల, ది ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ అకాడమీ- హైదరాబాద్ వంటి వాటిల్లో అడ్మిషన్స్ కోసం ఎన్‌డీఏ, సీడీఎస్ పరీక్షలను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రతి సంవత్సరం రెండుస్లారు నిర్వహిస్తుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Indian Army, NDA